హైడ్రా ఏర్పాటుకు కారణం బయటపెట్టిన రేవంత్

హైదరాబాద్ భవిష్యత్తుకు హైడ్రా గ్యారెంటీ అని కూడా ప్రకటించారు. ప్రకృతిని కాపాడుకునేందుకే హైడ్రాను ఏర్పాటుచేసినట్లు చెప్పారు.

Update: 2024-09-17 10:30 GMT
Revant and Hydra

హైడ్రా ఏర్పాటు వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యాన్ని రేవంత్ బయటపెట్టారు. హైదరాబాద్ భవిష్యత్తుకు హైడ్రా గ్యారెంటీ అని కూడా ప్రకటించారు. ప్రకృతిని కాపాడుకునేందుకే హైడ్రాను ఏర్పాటుచేసినట్లు చెప్పారు. హైడ్రా ఏర్పాటు వెనుక రాజకీయ కోణం కాని ప్రభుత్వం, వ్యక్తిగత స్వార్ధం ఏమీలేదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. పర్యావరణ పునరుజ్జీవనం కోసమే హైడ్రాను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. చెరువులు, కుంటలు, కాల్వలను ఆక్రమించి చేసిన నిర్మాణాలన్నింటినీ హైడ్రా కూల్చేస్తుందన్నారు. అక్రమనిర్మాణాలను కూల్చేయటమే కాకుండా వాటన్నింటినీ యథాతథస్ధితికి తీసుకొచ్చే బాధ్యతను ప్రభుత్వం హైడ్రాకు అప్పగించిందన్నారు.

ఒకపుడు గ్రేటర్ పరిధిలో ఉన్న వేలాది చెరువులు ఇపుడు వందల సంఖ్యకు తగ్గిపోయిందన్నారు. దీనికి కారణం అక్రమార్కులు నీటివనరులను ఆక్రమించటమే అని స్పష్టంచేశారు. ఒకపుడు లేక్ సిటీగా పాపులరైన హైదరాబాద్ ఇపుడు ఫ్లడ్ సిటీగా మారిపోవటానికి పోయిన ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. ఫ్లడ్ సిటీని మళ్ళీ లేక్ సిటీగా మార్చటమే తమ ప్రభుత్వం ముందున్న లక్ష్యంగా రేవంత్ వివరించారు. ఇలాంటి అనేక ఆలోచనల్లో నుండి పుట్టిందే హైడ్రాగా రేవంత్ వివరించారు. తెలంగాణాలో ముఖ్యంగా హైదరాబాద్ లో కేరళ పరిస్ధితి రాకూడదన్నదే తమ ప్రభుత్వం ఆలోచనగా చెప్పారు. భూమాఫియా వాళ్ళు పేదలను ముందుపెట్టి హైడ్రా లక్ష్యాన్ని నీరుగార్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని మండిపోయారు.

ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా హైడ్రా వెనక్కు తగ్గదని, భవిష్యత్తులో మరింత బలోపేతం అవటానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. తొందరలోనే హైడ్రాకు చట్టబద్దత కల్పిస్తామని, అవసరమైనంత సిబ్బందిని కూడా సమకూర్చబోతున్నట్లు ప్రకటించారు. ఈ నేపధ్యంలోనే హైదరాబాద్ భవిష్యత్తుకు హైడ్రా గ్యారెంటీగా ఉంటుందన్నారు. ప్రకృతిని కాపాడేందుకే హైడ్రాను ఏర్పాటు చేసినట్లు రేవంత్ స్పష్టంచేశారు.

Tags:    

Similar News