‘బీజేపీ పాలిత రాష్ట్రాల కన్నా తెలంగాణ ముందే ఉంది’.. మోదీకి రేవంత్ రిప్లై

తెలంగాణ ప్రభుత్వంపై ప్రధాని మోదీ చేసిన విమర్శలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బీజేపీ పాలిత రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణలో పాలన అద్భుతంగా ఉందన్నారు.

Update: 2024-11-02 07:49 GMT

తెలంగాణ ప్రభుత్వంపై ప్రధాని మోదీ చేసిన విమర్శలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బీజేపీ పాలిత రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణలో పాలన అద్భుతంగా ఉందని, ప్రజలకు సంక్షేమం అందించడంలో తెలంగాణ రికార్డులు కూడా చేస్తోందంటూ ఘాటుగా బదులిచ్చారు. తెలంగాణపై కేంద్రం చేసిన వ్యాఖ్యలకు ధీటైన సమాధానం చెప్పడం చాలా సంతోషంగా ఉందని కూడా రేవంత్ రెడ్డి అన్నారు. ఎక్స్(ట్విట్టర్) వేదికగా ప్రధాని మోదీకి రేవంత్ తన సమాధానం చెప్పారు.

కాంగ్రెస్ పాలనతో తెలంగాణను కమ్మేసిన చీకట్లను తరిమేసి వెలుగులు నింపామని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు రుణమాఫీ, మధ్యతరగతి వారికి తక్కువ ధరకే వంట గ్యాస్ సిలెండర్ అందిస్తున్న ఘనత తమ ప్రభుత్వానికే చెందుతుందని అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పరిస్థితి ఇంతకన్నా దయనీయంగా ఉందని విమర్శించారు. అంతేకాకుండా ఇందిరమ్మ రాజ్యం కొనసాగుతున్న తెలంగాణను విమర్శించే ముందు ప్రధాని మోదీ ముందుగా వాళ్ల పార్టీ చేస్తున్న తప్పులను సరిచూసుకోవాలని హితవు పలికారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చీ రాగానే రాష్ట్రంలో ఆనందం వెల్లువిరిసిందని, తమ పాలనతో ప్రజలకు ఫుల్ ఖుష్ అవుతున్నారని పునరుద్ఘాటించారు. సీఎంగా బాధ్యతలు తీసుకున్న 48 గంటల్లోనే ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే పనిలో పడ్డానని, అధికారంలో వచ్చిన 11 నెలల్లోనే తమ ప్రభుత్వం 50 వేల మంది యువతకు ఉద్యోగావకాశాలు కూడా కల్పించామని ఆయన తన పోస్ట్‌లో వివరించారు.

రేవంత్ పోస్ట్‌లో ఏముందంటే..

‘‘నా రాష్ట్రం, మా ప్రభుత్వంపై మీరు చేసిన వ్యాఖ్యల్లో పలు తప్పిదాలు, మరికొన్ని అపోహలు ఉన్నాయి. ఈ విషయాన్ని తెలియజేయడం చాలా సంతోషంగా ఉంది. 7 డిసెంబర్ 2023న కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టినప్పుడు తెలంగాణ అంతటా ఆనందం వెల్లువిరిసింది. దశాబ్ద కాలపు బీఆర్ఎస్ అసమర్ద పాలన నుంచి ప్రజలకు విముక్తిని పొందారు. తమ ప్రభుత్వం రావడంపై వారు ఎంతో సంతోషపడ్డారు. అధికారం చేపట్టిన రెండు రోజుల్లో ఇచ్చిన రెండు హామీలను నెరవేర్చింది మా ప్రభుత్వం. అవి రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం. రెండవది రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద ఆరోగ్య బీమాను రూ.10 లక్షలకు పెంచడం. ఈ 11 నెలల నుంచి తెలంగాణలోని మా సోదరీమణులు, తల్లులు అందరూ కూడా ఒక్క రూపాయి కూడా చెల్లించకుండానే బస్సులో ప్రయాణం చేశారు. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు 101 కోట్ల ఉచిత బస్సు ప్రయాణాలు జరిగాయి. ఏడాదిలోపే మా ప్రభుత్వం రూ.3,433.36 కోట్లు ఆదా చేశాం’’ అని ప్రకటించారు.

దేశంలో ఇదే తొలిసారి..

‘‘అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే దేశంలో ఎన్నడూ జరగనంత స్థాయిలో రాష్ట్రవ్యాప్తంగా రైతు రుణమాఫీ ప్రక్రియను చేపట్టాం. ఈ చర్యల ద్వారా రైతే రాజు అని మరోసారి నిరూపించాం. మా ప్రభుత్వం తీసుకున్న చర్యలతో రాష్ట్రవ్యాప్తంగా 22 లక్షల 22 వే మంది రైతులు ఇప్పుడు తమ రుణాల నుంచి విముక్తి పొంది నజమైన రాజులా బతుకుతన్నారు. 25 రోజుల సమయంలో రైతుల ఖాతాల్లోకి రూ.180వేల కోట్ల ఎాల చెల్లించారు. పేదల కరెంటు కష్టాలను కూడా నయం చేశాం. 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటును అందిస్తున్నాం. ఆకాశాన్నంటే ఉన్న గ్యాస్ సిలెండర్ ధరలను కూడా నేలకు చేర్చాం. దేశంలో కేవంలా కాంగ్రెస్ పాలిత తెలంగాణలో మాత్రమే వంగ గ్యాస్ సిలెండర్ రూ.500కు లబిస్తోంది. ఈ పథకం వల్ల ప్రతి రోజూ 42,90,246 మంది లబ్ధిదారులు సంతోషంగా ఉంటున్నారు’’ అని అన్నారు.

ప్రభుత్వ ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్

‘‘దాదాపు దశాబ్దంగా ఫెయిల్ అవుతున్న ప్రభుత్వ ఉద్యోగ రిక్రూట్‌మెంట్‌ను కూడా తెలంగాణ ప్రభుత్వంపూర్తి చేసింది. మా ప్రభుత్వం అత్యధిక నియామక చర్యలు తీసుకుంది. దాంతో పాటుగా ప్రతి పరీక్షను పర్ఫెక్ట్‌గా షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తున్నాం. గ్రూప్-1,2,3,4 ల పరీక్షలను కూడా కేవలం అధికారం వచ్చిన 11 నెలల్లోనే చేపట్టాం. వీటితో పాటుతా ఈ పదకొండు నెలల పాలనలోనే మా ప్రభుత్వం అర్హులైన 50వేల మంది యువతకు ఉపాధి అవకాశాలు కలపించింది. ఈ రికార్డ్‌ను ఏ బీజేపీ పాలిత రాష్ట్రం కూడా మ్యాచ్ చేయలేదు. చేసే చూపించండి’’ అని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి.

విద్యార్థులకూ గుడ్ న్యూస్

‘‘బీఆర్ఎస్ ప్రభుత్వం తమ హయాంలో విద్య వ్యవస్థను సర్వనాశనం చేసింది. విద్య వ్యవస్థ అనేది ఒకటుందా అన్నట్లు ఉండేది బీఆర్ మయాంలో. కానీ ఇప్పుడు అంతా మారింది. విద్యార్థుల కోసం మా ప్రభుత్వం ఎన్నో నిర్ణయాలు తీసుకుంది. ఇటీవల హాస్టళ్లు, గురకుల విద్యార్థులకు అందించే డైట్, కాస్మోటిక్ ఛార్జీలను 40 శాతం పెంచాం. అంతేకాకుండా మూసీ ప్రక్షాళనను కూడా ప్రారంభించారు. గతంలో మూసీని పట్టించుకున్న నాథుడే లేదు. కానీ మేము తెలంగాణలో ఉన్న అన్ని నదులు, చెరువులను కాపాడుకోవాలని నిశ్చయించుకున్నాం. ఇందులో భాగంగా కబ్జాకు గురైనా చెరువులు, ఎఫ్‌టీఎల్, నల్లాలను తిరిగి ప్రభుత్వ స్వాధీనంలోకి తీసుకొస్తున్నాం. బీఆర్ఎస్ హయాంలో వీటిని ఎవరూ పట్టించుకోలేదు. కానీ కాంగ్రెస్ అధికారంలో ఉండగా చెరువుల, నల్లాలు అన్నీ కూడా కబ్జాలకు, అక్రమ కట్టడాలకు నెలవుగా మారాయి. ఇప్పుడు వాటిని కూడా మేము ప్రక్షాళన చేస్తున్నాం. మేము యంగ్ ఇండి స్కిల్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, రెసిడెన్షిల్ స్కూల్స్ విషయాలతో బాల్‌ను ముందుకు కదిపాం. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ అమలుకు కట్టబడి ఉన్నాం’’ అని రేవంత్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

Tags:    

Similar News