‘ప్రజల ఛీ కొట్టినా సిగ్గు రాలేదా కేసీఆర్’.. మండిపడ్డ సీఎం రేవంత్
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో 5వేలకు పైగా స్కూళ్లను మూయించేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే చెందుతుందన్నారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో 5వేలకు పైగా స్కూళ్లను మూయించేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే చెందుతుందని, బడులను బంద్ చేయించి చిన్నారుల విద్య జీవితంతో ఆటలాడారంటూ మండిపడ్డారు. కానీ తమ ప్రభుత్వం అలాంటి తప్పులు చేయదని, అందుకు ఇప్పుడు తాము తీసుకొస్తున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్సే నిదర్శనమని అన్నారు. రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ పాఠశాల మళ్ళీ ప్రారంభమవుతుందని, ప్రతి విద్యార్థులు మళ్ళీ తమ పాఠశాలకు వెళ్లే వెసులుబాటు కల్పిస్తామని వెల్లడించారు. ఈరోజు చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల శంకుస్థాపన కార్యక్రమంలో రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదలను అందించే విద్యపై తమ ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పారు. పేదలను రూపాయి ఖర్చు లేకుండా అంతర్జాతీయ ప్రమాణాలతో నాణ్యమైన విద్య అందించాలన్నదే తమ ప్రభుత్వ కల అని, అందుకోసమే ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ప్రాజెక్ట్‌ను ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నామని చెప్పారు. ఇప్పటికే ప్రతి ఒక్కరికీ మేలు చేకూర్చేలా ఈ ప్రణాళికలను సిద్ధం చేశామన్నారు. ప్రతి రెసిడెన్షియల్ పాఠశాలను కూడా 20-25 ఎకరాల్లో నిర్మిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. కేవలం విద్యార్థి సమస్యలనే కాకుండా టీచర్ల సమస్యలను కూడా తమ ప్రభుత్వం పరిష్కరిస్తుందని చెప్పారు. ఇప్పటికే కొన్నిటి పరిష్కారం దిశగా నిర్ణయాలు కూడా తీసుకున్నట్లు వెల్లడించారు.
టీచర్ల సమస్యలకు చెక్
విద్యార్థులతో పాటు ప్రభుత్వం టీచర్లు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా తమ ప్రభుత్వం పరిష్కరిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఇప్పటికే వాటిలో ముఖ్యమైనవైన పదోన్నతులు, బదిలీలపై ఒక నిర్ణయం తీసుకున్నామని, 21 వేల పదోన్నతులు, 34 వేల బదిలీలు చేపట్టినట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. దాంతో పాటుగా డీఎస్సీ ద్వారా ప్రభుత్వా పాఠశాలల్లో ఉన్న ఉపాధ్యాయుల కొరతను నిరవారించడం కోసం 11 వేల పోస్టులను భర్తీ చేసినట్లు కూడా ఆయన వివరించారు. తెలంగాణలోని ప్రతి బిడ్డా కూడా తాను అనుకున్నదే చదివి జీవితంలో ఉన్నత శిఖాలను చేరాలన్నదే తమ ఆశయమని చెప్పారు. చిన్నప్పుడు నేను ఫలానాది అవుతానని చెప్పే విద్యార్థి.. జీవితంలో అది కావడం లేదని, కొందరు మర్చిపోతే మరికొందరికి సరైన విద్య అండం లేదని, అటువంటి పరిస్థితులు ఏర్పడకుండా చేయాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. ఇప్పుడు ప్రతి ఒక్కరికీ నాణ్యమైన విద్య అందించడం కోసమే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
కేసీఆర్‌కు సిగ్గు రాలేదా..
ఈ సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలంతా అనుకుని మరీ గుడ్డి సున్నా స్థానాలకే పరిమితం చేసినా బీఆర్ఎస్‌లోకానీ కేసీఆర్‌లో కానీ ఏమాత్రం మార్పు లేదని, వారికి బుద్ధి కూడా రాలేదంటూ చురకలంటించారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను, రెసిడెన్షియల్ స్కూళ్లను తీవ్ర నిర్లక్ష్యం చేసిన కేసీఆర్‌కే దక్కుతుందని ఎద్దేవా చేశారు. పిల్లలు బాగా చదువుకుని తెలివి వచ్చేస్తే తన బండారం బయటపడుద్దనుకున్నారో ఏమో కానీ పిల్లలకు చదువును దూరం చేసింది మాత్రం కేసీఆరే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్లు అధికారంలో ఉన్నారు.. కనీసం ఒక్కసారైనా విద్యార్థుల మౌలిక వసతుల గురించి కేసీఆర్ కానీ బీఆర్ఎస్ కానీ ఆలోచించిందా? అని ప్రశ్నించారు.