Revanth Reddy | ‘కేటీఆర్ ఆత్మహత్య చేసుకుంటారేమో’

దేశ చరిత్రలో తొలిసారి కులగణన చేసి చరిత్ర సృష్టించాం. ఈ నిర్ణయంతో ప్రధానిపై ఒత్తిడి పెరగనుంది. అన్ని రాష్ట్రాల్లో కుల గణన డిమాండ్ రానుందని రేవంత్ అన్నారు.;

Update: 2025-02-04 08:12 GMT

తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల అంశాలు మళ్ళీ తెరపైకి వచ్చాయి. కుల గణను పూర్తి చేసిన కాంగ్రెస్.. బీసీలకు అన్యాయం చేయడానికి కాకి లెక్కలు చెప్తోందని ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న పనుల్లో చిత్తశుద్ధి లేదని కేటీఆర్ కూడా విమర్శించారు. బీఆర్ఎస్ నేతల నుంచి వస్తున్న ఈ విమర్శలపై తాజాగా సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. చిత్తశుద్ధి గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్‌కు లేదన్నారు రేవంత్ రెడ్డి. తమ ప్రభుత్వం ఏ పని చేసినా.. అది ప్రజల ప్రయోజనం కోసమేనని, కేసీఆర్ కుటుంబీకుల తరహాలో కుటుంబాల కోసమ కాంగ్రెస్ ఎప్పుడూ ఏ పనీ చేయలేదని అన్నారు. అసెంబ్లీ లాబీలో‌లో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్, కేటీఆర్‌పై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌కు, బీఆర్ఎస్‌కు మధ్య ఉన్న తేడా చిత్తశుద్ధే అని అన్నారు.

‘‘సమగ్ర సర్వే వివరాలు కేసీఆర్ చెప్పాలి. ఎక్కడ ఉన్నాయో కూడా తెలవడం లేదు. మేము ఏ పని చేసినా బాధ్యతతో చేశాం. కేసీఆర్ కుటుంబం ఏ పని చేసినా చిత్త శుద్ధి లేదు. రాజకీయ లబ్ధి కోసమే చేస్తున్నారు కదా! 56% శాతం బీసీలు ఎస్సీ 17 % ఉన్నారు. 73.5 శాతం ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాం. వర్గీకరణ జరగాలి అని ఎప్పటి నుంచో మాదిగలు, మాలలు పోరాటం చేస్తున్నారు. భవిష్యత్తులో ఏ సర్వే జరిగిన ఇదే ప్రామాణికంగా తీసుకోవాలి. దేశ చరిత్రలో మొదటి సారి కులగణన చేసి చరిత్ర సృష్టించాము. ఎస్సీ వర్గీకరణ అంశంలో సుప్రీం కోర్టు తీర్పు,కమిషన్ నివేదిక,సబ్ కమిటీ నివేదిక సూచన ప్రకారం ముందుకు వెళ్తాం’’ అని వ్యాఖ్యానించారు.

‘‘ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీ కి రావాలి కదా. రాజకీయాల కోసం ఏది చేయడం లేదు. ఈ డాక్యుమెంట్ డెడికేషన్ కమిషన్ తీసుకొంటుంది. కమిషన్ తగిన నిర్ణయం తీసుకుంటుంది. 88 జనరల్ సీట్లలో బీసీ లకు 30 సీట్లు కేటాయించాము...33 శాతం ఇచ్చాము. ఈ రోజు దేశం చరిత్రలో నిలిచిపోతుంది. ఈ నిర్ణయంతో ప్రధాని పై ఒత్తిడి పెరగనుంది. అన్ని రాష్ట్రాల్లో కుల గణన చేయాలని డిమాండ్ రానుంది. భవిషత్ లో ఈ రోజు మేము ప్రవేశపెట్టే డాక్యుమెంట్ రిఫరెన్స్ తీసుకోవాలి. 2011 జనాభా లెక్కల తర్వాత మళ్లీ మేమే చేశాం. 2014 లెక్కలు ఎక్కడ ఉన్నాయో చేసిన వాళ్లే చెప్పాలి. అసెంబ్లీ కి రాని వారు అసెంబ్లీ టైం గురించి మాట్లాడుతున్నారు. కొందరు ఉప ఎన్నిక గురించి మాట్లాడుతున్నారు.. సిరిసిల్ల లో కేటీఆర్ సూసైడ్ చేసుకుంటడేమో..’’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Tags:    

Similar News