ఢిల్లీలో కాంగ్రెస్ కీలక హామీలు.. విడుదల చేసిన రేవంత్
ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల జోరు రోజురోజుకు పెరుగుతోంది. ఎలాగైనా అధికారాన్ని అందిపుచ్చుకోవాలని రాజకీయపార్టీలన్నీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి.;
ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల జోరు రోజురోజుకు పెరుగుతోంది. ఎలాగైనా అధికారాన్ని అందిపుచ్చుకోవాలని రాజకీయపార్టీలన్నీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. ప్రత్యర్థిని మట్టుబెట్టడంతో పాటు తమ పార్టీని ప్రజల్లోకి మరింత లోతుగా తీసుకెళ్లడానికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నాయి. అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేలా వారిపై హామీ జల్లు కురిపిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా కాంగ్రెస్ పార్టీ తామ కీలక హామీలకు సంబంధించి పోర్టలను విడుదల చేసింది. ఈ పోస్టర్లను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రిలీజ్ చేశారు. తెలంగాణలో తరహాలోనే ప్రజలకు ఇచ్చే ప్రతి హామీని నెరవేరుస్తామని రేవంత్ వెల్లడించారు. ఢిల్లీ వాసులకు కూడా 300 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే వంట గ్యాస్ సిలెండర్ ఇస్తామని కాంగ్రెస్ తెలిపింది. తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తోందని, రైతులకు రుణమాఫీ చేశామని, అతి త్వరలోనే రైతు భరోసాను కూడా అందించనున్నామని వెల్లడించారు.
‘తెలంగాణలో ఆరు గ్యారెంటీలు ఇచ్చాం. వాటన్నింటిని అమలు చేస్తున్నాం. రైతులను రూ.2లక్షల రుణమాఫీ చేశాం. రైతుభరోసాను రూ.10000 నుంచి రూ.12000కు పెంచాం. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 55వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. అతి త్వరలోనే నూతన ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాం. అది విజయవంతంగా కొనసాగుతోంది. ఢిల్లీలో కూడా ప్రజలంతా కలిసి కాంగ్రెస పార్టీకి అవకాశం ఇస్తే.. ఢిల్లీ కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి అవుతుంది. దేశ రాజధాని అభివృద్ధి చేసే సత్తా కాంగ్రెస్‌కే ఉంది’’ అని రేవంత్ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ‘‘ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నడిపించడానికి తెలంగాణ నుంచి పూర్తి మద్దతు ఇస్తామని, ఢిల్లీ కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే బాధ్యత నాది. ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే ఏ సహాయం కావాలన్న తెలంగాణ నుంచి అందిస్తాం. ఢిల్లీలో పోటీ పడుతున్న కేజ్రీవాల్, మోదీ వేరువేరు కాదు. ఇద్దరూ ఒక్కరే. ఇద్దరూ అబద్దాలు చెప్పడంలో ఆరితేరిపోయారు. ప్రజలారా వారిని నమ్మకండి. కాంగ్రెస్‌కు ఓటేయండి’’ అని కోరారు.
కాంగ్రెస్ హామీలివే
- ఉచిత రేషన్ కిట్లు
- రూ.500లకే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్
- 300 యూనిట్ల ఉచిత కరెంట్
- యువ ఉడాన్ యోజన: ఏడాదిపాటు నిరుద్యోగ యువతకు ప్రతి నెలా రూ.8,500
- జీవన్ రక్ష యోజన: రూ.25 లక్షల వరకు ఉచిత ఆరోగ్య బీమా
- ప్యారీ దీదీ యోజన: మహిళలకు ప్రతినెలా రూ.2,500 ఆర్థిక సాయం