Revanth Emergency meeting|సినీఇండస్ట్రీపై రేవంత్ అత్యవసర భేటి

ఇండస్ట్రీలోని ప్రముఖుల సమావేశంలో చర్చించాల్సిన అంశాలను మంత్రులు, ఉన్నతాధికారుల సమావేశంలో సీఎం ఫైనల్ చేసినట్లు సమాచారం

Update: 2024-12-26 05:31 GMT
Revanth

ఇపుడందరి దృష్టి రేవంత్-సినీ ఇండస్ట్రీ భేటీపైనే నిలిచింది. కమాండ్ కంట్రోల్ సెంటర్లో సినీఇండస్ట్రీలోని ప్రముఖులతో రేవంత్, మంత్రులు సమావేశం అవబోతున్నారు. అంతకన్నా ముందే మంత్రులు, ఉన్నతాధికారులతో రేవంత్(Revanth) తన నివాసంలో భేటీఅయ్యారు. ఇండస్ట్రీలోని ప్రముఖుల సమావేశంలో చర్చించాల్సిన అంశాలను మంత్రులు, ఉన్నతాధికారుల సమావేశంలో సీఎం ఫైనల్ చేసినట్లు సమాచారం. కీలకమైన అంశాలు ఏమిటంటే డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రభుత్వం చేస్తున్న చర్యలకు మద్దతుగా సినీ హీరోలు తమవంతు సహకారం అందించాలని కోరబోతున్నట్లు సమాచారం. అలాగే ప్రభుత్వం చేపడుతున్న అనేక సంక్షేమకార్యక్రమాల్లో అవసరమైనపుడు హీరోలు తమవంతుగా ప్రచారంలో(యాడ్స్) పాల్గొనాలని కూడా రేవంత్ అడగబోతున్నట్లు ప్రభుత్వవర్గాలు చెప్పాయి.

పుష్ప సినిమా(Pushpa Movie) రిలీజ్ రోజున సంధ్యా ధియేటర్లో(Sandhya Theatre Stampeding) జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించగా, ఆమె కొడుకు శ్రీతేజ కోమాలోకి వెళ్ళిపోయాడు. 20 రోజుల చికిత్స తర్వాత ఇపుడు కాస్త కోలుకుంటున్నట్లు తేజ తండ్రి భాస్కర్ చెప్పాడు. తొక్కిసలాటకు హీరో అల్లుఅర్జున్ కారణమని పోలీసులు కేసునమోదు చేసి అరెస్టుచేసిన విషయం తెలిసిందే. అల్లుఅర్జున్ అరెస్టు(Allu Arjun Arrest) తర్వాత అసెంబ్లీలో రేవంత్ మాట్లాడుతు తాను సీఎంగా ఉన్నంతవరకు బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపుకు అనుమతి ఉండదని ప్రకటించారు. రేవంత్ ప్రకటనతో హీరోలు, నిర్మాతల గుండెల్లో బండలుపడ్డాయి. ఎందుకంటే బెనిఫిట్ షోలు, టికెట్ల ధరలు పెంచుకునేందుకు లేదంటే నిర్మాతలు నిండాముణిగిపోవటం ఖాయం. ఇండస్ట్రీలోని ప్రముఖులు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ దిల్ రాజుతో భేటీ అయ్యారు. అల్లుఅర్జున్ మీద కేసు, అరెస్టు కారణంగా ప్రభుత్వానికి, సినీ ఇండస్ట్రీకి ఉన్న గ్యాప్ బాగా పెరిగిపోయింది.

రేవంత్ సీఎం అయిన తర్వాత సినీ ప్రముఖులు పెద్దగా పట్టించుకోవటంలేదు. ఈ విషయాలు గమనించిన రేవంత్ కూడా కామ్ గానే ఉన్నాడు. తొక్కిసలాట జరగటం, అల్లుఅర్జున్ మీద కేసు, అరెస్టుతో సినీప్రముఖులకు ప్రభుత్వం పవర్ ఏమిటో అనుభవపూర్వకంగా తెలిసొచ్చింది. దెబ్బకు రేవంత్ తో బేరానికి దిగినట్లున్నారు. నిర్మాత, ఎగ్జిబిటర్ అయిన దిల్ రాజును ప్రభుత్వం ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఎఫ్డీసీ)(FDC Chairman Dil Raju) ఛైర్మన్ గా నియమించటం సినీ ఇండస్ట్రీకి కలిసొచ్చింది. అందుకనే సమస్యల పరిష్కారానికి దిల్ రాజే మధ్యవర్తిత్వం నెరుపుతున్నారు. మంత్రులు, ఉన్నతాధికారుల భేటీలో యాంటీ డ్రగ్స్ క్యాంపెయిన్ కు సినీహీరోలు ప్రచారం కల్పించాలని, సినిమా టికెట్లపై ప్రత్యేకసెస్ విధించాలని డిసైడ్ అయ్యింది. ప్రత్యేక సెస్ ద్వారా వచ్చే నిధులను ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అభివృద్ధికి ఖర్చుచేయాలని, కులగణన, ఇంటింటి సర్వేలకు హీరోలు ప్రచార కర్తలుగా ఉండాలని ప్రతిపాదించాలని సమావేశం డిసైడ్ అయ్యింది.

Tags:    

Similar News