టీ స్క్వేర్ నిర్మాణం ఐకానిక్ గా ఉండాలన్న రేవంత్

టీస్క్వేర్ భవనంలో ఆపిల్ లాంటి ప్రపంచప్రఖ్యాత సంస్ధలు తమ ఔట్ లెట్లను ఏర్పాటుచేసుకోవాలి అనుకునేట్లుగా నిర్మాణాలు ఉండాలన్నారు

Update: 2025-10-11 10:36 GMT
Revanth

రాయదుర్గం సమీపంలో పరిశ్రమలశాఖ, టీజీఐఐసీ సంయుక్తంగా నిర్మించబోతున్న టీ స్వ్కేర్ నిర్మాణం తెలంగాణకే ఐకానిక్ గా ఉండాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth) చెప్పారు. ఏఐ హబ్, టీస్క్వేర్ ప్రాజెక్టులపై ఉన్నతాధికారులు, ప్రతినిధులతో శనివారం రేవంత్ సమీక్షించారు. టీస్క్వేర్ భవనంలో ఆపిల్ లాంటి ప్రపంచప్రఖ్యాత సంస్ధలు తమ ఔట్ లెట్లను ఏర్పాటుచేసుకోవాలి అనుకునేట్లుగా నిర్మాణాలు ఉండాలన్నారు. ఏఐ హబ్(AI Hub) తాత్కాలిక ఏర్పాటు కోసం ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ భవనాలను పరిశీలించాలని సూచించారు. నవంబర్ నెలాఖరుకు నిర్మాణ పనులు మొదలవ్వాలని ఆదేశించారు. టీ స్క్వేర్ నిర్మాణంలో అవసరమైన అన్నీ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.

వాహనాల పార్కింగుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని చెప్పారు. ముఖ్యంగా యుటిలిటీ జోన్ ఏర్పాటు చేసుకోవాలని గుర్తుచేశారు. టీ స్క్వేర్ 24 గంటలూ పనిచేయాలన్నారు. ఏఐ భవనంలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన సంస్ధల ప్రతినిధులతో బోర్డు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, ఐటి శాఖ ఉన్నతాధికారులు కూడా సమీక్షలో పాల్గొన్నారు.

Tags:    

Similar News