వేములవాడ యార్న్ డిపోకు రూ.50కోట్ల నిధులు
తెలంగాణలో నేత కార్మికుల సంక్షేమానికి చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు.వేములవాడలో యార్న్ డిపోకు రూ.50 కోట్లు కేటాయించామన్నారు.
By : The Federal
Update: 2024-11-13 13:44 GMT
తెలంగాణ వ్యవసాయ, చేనేతశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జౌళిశాఖపై రివ్యూ చేశారు. అన్ని ప్రభుత్వశాఖలు, కార్పొరేషన్ల నుంచి అవసరమైన వస్త్రాల కోసం వెంటనే ఆర్డర్లు తెప్పించుకోవాలని టెస్కో ఎండి శైలజా రామయ్యర్ ను మంత్రి ఆదేశించారు.
- చేనేత సంఘాల ద్వారా వస్త్రాల ఉత్పత్తికి తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి కోరారు. ఇప్పటికే ఆర్డర్లు ఇచ్చిన ప్రభుత్వ శాఖలకు వస్త్రాల సప్లయిను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.
- ఇప్పటికే 96.03 లక్షల మీటర్ల వస్త్రాల ఉత్పత్తి కోసం సంఘాలకు ఆర్డర్ ఇవ్వడం జరిగిందని, సంఘాల నుంచి కొనుగోలు చేసి సంబంధిత శాఖలకు సప్లయి చేశామని అధికారులు చెప్పారు. నేత కార్మికులకు ఉపాధి కల్పించి వారి సంక్షేమానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి తెలిపారు.జీవో 18 ద్వారా వేములవాడ కేంద్రంగా రాజన్న సిరిసిల్లకి యార్న్ డిపో మంజూరు చేశామని మంత్రి పేర్కొన్నారు.వేములవాడ యార్న్ డిపోకు రూ. 50 కోట్ల నిధులు మంజూరు చేశామని మంత్రి తుమ్మల వివరించారు.