ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్ వాళ్ల దాడి.. సదస్సు జరుగుతుండగా..

వరంగల్‌లో రచయితలు నిర్వహించిన సదస్సును ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్ సంఘం కార్యకర్తలు అడ్డుకున్నారు. రచయితలపై దాడికి పాల్పడ్డారు.

Update: 2024-04-28 14:56 GMT

ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్ వాళ్ల ఆగడాలు రోజురోజుకు పెచ్చుమీరుతున్నాయి. అందుకు ఈరోజు వరంగల్‌లో చోటు చేసుకున్న ఘటనే నిదర్శనం. ‘లౌకిక విలువలు- సాహిత్యం’ అంశంపై ఈరోజు సమూహ సెక్యులర్ రైటర్స్ ఫోరమ్ ఓ సదస్సు నిర్వహించింది. ఈ విషయం తెలుసుకున్న ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్ సంఘం వారు అక్కడకు చేరి గొడవ చేశారు. సభ జరుగుతుండగానే బ్యానర్లే చింపేసి వెళ్లిపోవాలంటూ రాద్దాంతం చేశారు. దాంతో రచయితలు ఆ సభను వెంటనే ముగించుకున్నారు. అనంతరం వారు బయటకు వస్తుండగా కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత డా. పసునూరి రవీందర్, కవి నరేష్ కుమార్‌పై దాడికి పాల్పడ్డారు. విచక్షణారహితంగా వారిని కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్ సంఘాల కార్యకర్తలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రచయితల కార్యక్రమాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ నిలదీస్తున్నారు.

Tags:    

Similar News