ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ ను తనిఖీలు చేసిన భధ్రతా బలగాలు

టెర్రరిస్టులు ఉన్నారన్న సమాచారంతో ఘట్ కేసర్ లో తనిఖీలు

Update: 2025-09-26 09:30 GMT

ఫలక్ నుమా సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ ను ఘట్ కేసర్ రైల్వేస్టేషన్ లో ఆపి భద్రతా బలగాలు ఆపి తనిఖీలు చేశాయి. హౌరా నుంచి సికింద్రాబాద్‌ వచ్చే ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ లో పోలీసులు ఈ తనిఖీలు చేశారు. ఉగ్రవాదులు ఉన్నారని సమాచారం అందడంతో భద్రతాబలగాలు అలర్ట్ అయ్యాయి. చర్లపల్లి ఆర్పీఎఫ్‌, జీఆర్పీ, ఘట్‌కేసర్‌ పోలీసులు శుక్రవారం ఉదయం నుంచి తనిఖీలు చేపట్టారు. అనుమానం వచ్చిన ప్రతి వ్యక్తిని సోదాలు చేశారు. వారి బ్యాగేజీని కూడా చెక్ చేశారు. తనిఖీల అనంతరం ముప్పు లేదని నిర్ధరించుకున్నాక రైలు సికింద్రాబాద్ వెళ్లింది.

ఘట్ కేసర్ ఇన్స్ పెక్టర్ బాలకృష్ణ మాట్లాడుతూ రైల్వే పోలీసుల నుంచి అందిన సమాచారం మేరకు తమ ప్రత్యేక బృందాలు రైల్వే స్టేషన్ చేరుకుని తనిఖీలు చేసినట్టు చెప్పారు. తనిఖీల్లో ఎటువంటి ప్రమాదం లేదని పోలీసులు తేలడంతో ఊపిరిపీల్చుకున్నారు.

Tags:    

Similar News