వైభవంగా జరిగిన సీతారాముల కల్యాణం

సీతారాముల కల్యాణాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు తెలుగురాష్ట్రాల నుండే కాక పొరుగున ఉన్న ఛత్తీస్ ఘడ్, జార్ఖండ్ తదితర రాష్ట్రాల నుండి కూడా భక్తులు పెద్దఎత్తున వచ్చారు.;

Update: 2025-04-06 11:38 GMT
Bhadrachala kalyanam

భద్రాచల శ్రీసీతారామ స్వామి కల్యాణం కన్నులపండువగా జరిగింది. భద్రాచలంలోని మిథిలా స్టేడియంలో రాములోరి కల్యాణం కమనీయంగా జరిగింది. రేవంత్ రెడ్డి(Revanth) దంపతులు రాములోరి కల్యాణానికి(SithaRamakalyanam) ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సీతారామచంద్రస్వామికి సమర్పించారు. అభిజిత్ లగ్నంలో సీతమ్మవారి మెడలో శ్రీరామచంద్రమూర్తి మాంగల్యధారణ చేశారు. కల్యాణ మహోత్సవాన్ని(Rama Kalyanam) ఆలయ పండితులు శాస్త్రోక్తంగా జరిపించారు. సీతారాముల కల్యాణాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు తెలుగురాష్ట్రాల నుండే కాక పొరుగున ఉన్న ఛత్తీస్ ఘడ్, జార్ఖండ్ తదితర రాష్ట్రాల నుండి కూడా భక్తులు పెద్దఎత్తున వచ్చారు.


సీతారాముల వివాహ మహోత్సవానికి రేవంత్ రెడ్డి దంపతులతో పాటు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దంపతులు, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి దంపతులు, తుమ్మల నాగేశ్వరరావు, కొండా సురేఖ దంపతులు, చీఫ్ సెక్రటరీతో పాటు పలువురు ఎంఎల్ఏలు, ప్రజాప్రతినిధులు కూడా హాజరయ్యారు. దాదాపు గంటన్నరసేపు రేవంత్ దంపతులు మిథిలాస్టేడియంలోనే ఉన్నారు. వివాహ మహోత్సవాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు సుమారు 2 లక్షలమంది హాజరై ఉంటారని ఆలయ అధికారులు అంచనా వేశారు.

Tags:    

Similar News