భద్రాచలం ప్రమాదంలో ఏడుగురు మృతి
ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలంలో నిర్మాణంలో ఉన్న భవనం కూలి ఏడుగురు మరణించారు;
ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలంలో నిర్మాణంలో ఉన్న భవనం కూలి ఏడుగురు మరణించారు. అందుబాటులోని వివరాలు ప్రకారం భద్రాచలం(Bhadrachalam) పట్టణంలోని సూపర్ బజార్ సెంటర్లో ఆరు అంతస్తుల భవనం నిర్మాణం జరుగుతోంది. అన్నీ అంతస్తులకు స్లాబులు వేసారు. అయితే ఏమైందో ఏమోగాని సడెన్ గా బుధవారం మధ్యాహ్నం అన్నీ స్లాబులు(Building collapsed) ఒక్కసారిగా కూలిపోయింది. ఊహించనిరీతిలో భవనం స్లాబులు కూలిపోవటంతో భవనం నిర్మాణంలో ఉన్న కూలీలు శిధిలాల్లో ఇరుక్కుపోయారు. తాజా సమాచారం ప్రకారం ఏడుగురు మరణించారు(Seven died in accident). ఇంకా చాలామంది శిధిలాల్లోనే ఇరుక్కుపోయారు. శిధిలాలను తొలగించి అందరినీ బయటకు తీసుకొచ్చేందుకు పొక్లయినర్ల సాయంతో అధికార యంత్రాంగం ప్రయత్నాలు చేస్తోంది.
రెండస్తుల పాత భవనంపైనే మరో నాలుగు అంతస్తులు వేస్తున్నట్లు స్ధానికులు చెబుతున్నారు. నిర్మాణం నాసిరకంగా ఉండటం వల్లే అన్నీ అంతస్తులు కూలిపోయినట్లు భావిస్తున్నారు. భవనం నిర్వాహకులు ట్రస్ట్ పేరుతో విరాళాలు సేకరించి భవన నిర్మాణం చేస్తున్నట్లు సమాచారం. భవనం కూలిపోయిన విషయం తెలియగానే పోలీసులు, రెవిన్యు, పంచాయితీ రాజ్ శాఖ, ఐటీడీఏ అధికారులు ఘటనా స్ధలానికి చేరుకున్నారు. క్రేన్లు, పొక్లెయినర్లను తెప్పించి సహాయకపనులు మొదలుపెట్టారు.
ఈ ఆరంతస్తుల భవనం నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్నట్లు సమాచారం. భవనాన్ని నాసిరకం మెటీరియల్తో నిర్మిస్తున్నట్లు స్ధానికుల నుండి ఐటీడీఏ ప్రాజెక్టు అధికారికి ఫిర్యాదులు కూడా అందాయి. దాంతో నిర్మాణానికి సంబందిచిన సమాచారాన్ని తెప్పించుకున్న పీవో రాహుల్ భవానాన్ని కూల్చేయాలని పంచాయితీరాజ్ శాఖ ఉన్నతాదికారులను ఆదేశించారు. అయితే ప్రాజెక్టు అధికారి ఆదేశాలను పంచాయితిరాజ్ అధికారులు పాటించకపోవటంతోనే ఇపుడు ఈ ప్రమధం జరిగిందని తెలుస్తోంది. తమ భవనం నిర్మాణంపై ఫిర్యాదుచేసిన వారిని కనుక్కున్న యజమాని వారితో గొడవపడినట్లు సమాచారం. ఈ భవనమే కాదని నిబంధనలకు విరుద్ధంగా ఇంకా చాలా భవనాలు నిర్మాణంలో ఉన్నట్లు ఆరోపణలున్నాయి. అయినా పంచాయితీరాజ్ శాఖ ఎవరిపైనా ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. నిర్మాణంలో ఉన్న తన భవనం కూలిపోయిందని తెలియగానే దాని యజమాని శ్రీనివాసరావు పరారీ అయిపోయాడు. ఈ ప్రమాధంలో ఎంతమంది మరణించారు ? ఎంతమంది శిధిలాల్లో ఇరుక్కున్నారనే విషయంలో క్లారిటిలేదు. మరణించిన వాళ్ళ వివరాలు ఇంకా రావాల్సుంది.