హైడ్రా పనులను అడ్డుకున్న గులాబి కార్పోరేటర్
ఎమ్మెల్యే అరికెపూడి బాటలో...;
హైడ్రా పనులకు శేర్ లింగం పల్లి కార్పోరేటర్ అడ్డం పడ్డారు. హుడా ట్రేడ్ సెంటర్ ప్రాంతంలో నాలా ఆక్రమణలను హైడ్రా తొలగించే సమయంలో కార్పోరేటర్ రాగ్యా నాగేందర్ యాదవ్ అడ్డం పడ్డారు. శుక్రవారం హైడ్రా చేపట్టిన ఆక్రమణల తొలగింపులను ఆయన అడ్డుకున్నారు.
హైడ్రాను పనులను కాంగ్రెస్ ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తుంటే ప్రజా ప్రతినిధులు మాత్రం పార్టీల కతీతంగా డిస్కరేజ్ చేస్తున్నారు. మొన్న శేర్ లింగం పల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ హైడ్రా పనులను అడ్డుకున్నారు. సున్నం చెరువు ప్రాంతంలో ఆక్రమణలను తొలగిస్తున్నసమయంలో అడ్డం పడ్డారు. సున్నం చెరువు ప్రాంతంలో అరికెపూడి గాంధీ వోటర్లు ఎక్కువగా ఉన్నారు. అరికెపూడి బిఆర్ఎస్ ఎమ్మెల్యే గా గెలవడానికి సున్నం చెరువు వోటర్లు ముఖ్య భూమిక వహించారు. మళ్లీ గెలవాలంటే అరికెపూడి హైడ్రాను వారించాలి. పొలిటికల్ స్ట్రాటజీ కూడా అదే. ఆయన బిఆర్ ఎస్ నుంచి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీకి విధేయుడు. పైగా పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చిన రేవంత్ రెడ్డికి వీర విధేయుడు. కాంగ్రెస్ అధికారంలో రాగానే కొందరు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో వెనకా ముందు చూసుకోకుండా చేరిపోయారు. వారిలో అరికెపూడి ముందు వరుసలో ఉన్నారు. రేవంత్ రెడ్డి వీర విధేయుడుగా ఉన్న అరికెపూడి హైడ్రా పనులను అడ్డుకున్నారు. శేర్ లింగంపల్లి కార్పోరేటర్ రాగ్యానాగేందర్ యాదవ్ మాత్రం వీర విధేయుడు. గురుశిష్యుల బంధం. ఈ ఇద్దరు గురు శిష్యులు శేర్ లింగంపల్లి రాజకీయల్లో కీలకంగా ఉన్నారు. హైడ్రా పనులను ఈ నేతలు అడ్డుకోవడం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మింగుడు పడటం లేదు.