ఆరేళ్ల అమ్మాయికి గుండెపోటు
స్టేషన్ ఘన్పూర్ లో విషాదం;
ఇటీవలి కాలంలో గుండెపోట్లు సర్వ సాధారణమైపోయాయి. నడీడుకొచ్చిన వారికే గుండెపోటులు వస్తాయని మనమంతా అనుకుంటాం. ఎందుకంటే ఈ వయసు వారికే గుండెపోట్లు రావడానికి అవకాశాలెక్కువ. ప్రధాన కారణాల్లో స్థూలకాయం, బీపీ, షుగర్ అసాధరణంగా పెరిగిపోవడమే. గుండెరక్తనాళాల్లో రక్తం గడ్డకట్టుకోవడం వల్ల గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది.
తెలంగాణ స్టేషన్ ఘన్ పూర్ లో ఆరేళ్ల చిన్నారికి గుండెపోటు వచ్చింది. గోవింద్, అనూష దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరుకుమార్తెలున్నారు. చిన్న కూతురు మిథున (6)కు శనివారం చాతీలో నొప్పి వచ్చింది. అసిడిటీ సమస్య అని తల్లిదండ్రులు భావించారు. శ్వాస తీసుకోవడానికి ఆ అమ్మాయి ఇబ్బంది పడింది. ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చిన్నారి చనిపోయింది. గుండెపోటు వల్ల చనిపోయినట్లు వైద్యులు నిర్దారించారు.
జన్యుసంబంధలోపాల వల్ల..
భారతీయులమైన మనం జన్యుపరంగా కరోనరీ ఆర్టరీ వ్యాధికి గురయ్యే అవకాశం ఉన్నందున గుండెపోటు చర్చనీయాంశం అయ్యింది.
గుండె ప్రాథమికంగా 4 గదులు ఉంటాయి. కుడి గుండెకు ఆహారం అందించే 2 ప్రధాన పైపులు ఉంటాయి. అవే 4 గదుల నుంచి ఎడమ గుండెకు తిరిగి వెళుతుంది. ఒక శిశువు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అనేక గుండె జబ్బులతో జన్మించవచ్చు. కవాటాలకు అడ్డంకులు ఏర్పడినప్పుడు గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. బృహద్ధమని మొత్తం శరీరానికి రక్తాన్ని సరఫరా చేసే ప్రధాన పైపు. గుండెకు సరఫరా చేసే రెండు ప్రధాన నాళాలు ఉన్నాయి-కుడి, ఎడమ కరోనరీలు ఉంటాయి. ఎడమ కరోనరీ ఆర్టరీ బృహద్ధమనికి బదులుగా పుపుస ధమని (ఆక్సిజన్ లేని రక్తాన్ని తీసుకువెళ్ళే ఇతర పైపు) పై ఒత్తిడి పడి రక్త ప్రవాహ దిశ తారుమారు అవుతుంది. ఎడమ కరోనరీ ఆర్టరీలో, ఇది గుండెకు ముఖ్యమైన పోషకాలను మోసుకెళ్ళే రక్తాన్ని కోల్పోయేలా చేస్తుంది. నాళం మూసుకుపోవడం వల్ల పెద్దలకు గుండెపోటు వచ్చినట్లుగా, చిన్న పిల్లలు గుండెపోటు గుండెపోటుకు గురయ్యే అవకాశం ఉందని కార్డియాలస్ట్ నవీన్ కుమార్ చెరుకు తెలిపారు. .