ఎస్ఎల్‌బీసీ ప్రమాదం, 30 గంటలు దాటినా కార్మికుల జాడ లేదు...

శ్రీశైలం ఎడమ ఒడ్డు కాలువ (ఎస్ఎల్‌బీసీ) సొరంగం కూలిపోయిన ప్రాంతానికి రెస్క్యూ బృందాలు చేరుకున్నాయి.సొరంగంలో బురద, నీరు పేరుకుపోవడంతో దాన్ని తొలగిస్తున్నారు.;

Update: 2025-02-23 13:49 GMT

శ్రీశైలం ఎడమ ఒడ్డు కాలువ (ఎస్ఎల్‌బీసీ) సొరంగంలో చిక్కుకు పోయిన వారిని కాపాడేందుకు రెస్క్యూ బృందాలు ముమ్మర కృషి చేస్తున్నాయి. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్,సింగరేణి, భారత సైన్యం మట్టి, బురదనీటిని తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. చిక్కుకుపోయిన 8మందిని కాపాడేందుకు రెస్క్యూ సిబ్బంది అండర్ వాటర్ స్కానర్లు, సేఫ్ జాకెట్లతో సహాయ పనులు చేపట్టారు. బురద చేరి టన్నెల్ సొరంగం మూసుకుపోవడంతో నేవీ బృందాలను కూడా రప్పిస్తామని మంత్రులు జూపల్లి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. సొరంగంలో ప్రమాదం జరిగిన ప్రాంతానికి సహాయ సిబ్బంది చేరి చిక్కుకుపోయిన వారి పేర్లతో పిలుస్తున్నా వారి నుంచి స్పందన లేదు.


చిమ్మచీకటిలో...
చిమ్మచీకటిలో బురద, నీటి మధ్య సహాయ పనులను రెస్క్యూ సిబ్బంది ముమ్మరం చేశారు. సొరంగంలో 8 మంది చిక్కుపోయి 30 గంటలు జరిగినా వారి ఆచూకీ దొరకలేదు. 100 మీటర్ల దూరం సొరంగం బురద, నీరు చేరి మూసుకుపోయింది. నిపుణులను రంగంలో దించి పై నుంచి రంధ్రం వేసి చిక్కుకుపోయిన వారిని కాపాడాలని నిపుణులు యత్నిస్తున్నారు. హైదరాబాద్ నుంచి ఎక్సవేటర్లు, పంపింగ్ పంపులు తీసుకువచ్చి బృందాలు లోపలకు వెళ్లి సహాయ పనులు చేపట్టాయి.

పేరుకుపోయిన బురద
సొరంగంలో బురద పేరుకుపోయింది.దీంతో సహాయక చర్యలు ఊపందుకున్నాయి. మట్టి బురదను 330 మంది సిబ్బంది సహాయ చర్యలు చేపట్టారు. టన్నెల్ నుంచి కార్మికులను బయటకు తీసుకువచ్చేందుకు యత్నిస్తున్నామని మంత్రులు ఉత్తమ్, జూపల్లి చెప్పారు. బురదనీటిలో కార్మికులు కూరుకుపోయారనే అనుమానంతో విశాఖ నుంచి నేవీ బృందాన్ని రప్పిస్తున్నామని మంత్రులు చెప్పారు. దీంతో పాటు ఉత్తరాఖండ్ రాస్ట్రం నుంచి నిపుణులను కూడా తీసుకువస్తామని వారు వివరించారు.

రెస్క్యూ బృందాలు సహాయ చర్యలు ముమ్మరం
ఎస్ఎల్‌బీసీ సొరంగంలో చిక్కుకున్న కార్మికులను రక్షించడానికి రెస్క్యూ బృందాలు సహాయ చర్యలను ముమ్మరం చేశాయి. తెలంగాణ ప్రభుత్వం ఆర్మీ, నేవీ, సింగరేణి, ఎన్డీఆర్ ఎఫ్ తో కలిసి పనిచేస్తోంది. సొరంగంలో చిక్కుకున్నట్లు భావిస్తున్న ఎనిమిది మంది కార్మికులను రక్షించడానికి శోధన బృందాలుపని చేస్తున్నాయని అధికారులు తెలిపారు.సహాయ సిబ్బంది సొరంగం బోరింగ్ యంత్ర ప్రదేశానికి చేరుకున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.నల్గొండ జిల్లాలోని నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి నీటిని తీసుకురావడానికి ప్రపంచంలోనే అతి పొడవైన 44 కిలోమీటర్ల సొరంగం పనులు ప్రారంభమయ్యాయి.

టన్నెల్ లోపల మంత్రి జూపల్లి
ఎస్ఎల్బీసీ సొరంగంలో మంత్రి జూప‌ల్లి కృష్ణారావు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సైనిక బృందాల‌తో క‌లిసి లోకో ట్రైన్ లో ట‌న్నెల్ లోకి వెళ్లారు. మ‌ధ్యాహ్నం 1 గంట నుంచి ఆరు గంట‌లుగా మంత్రి సొరంగంలోనే ఉన్నారు.ప్ర‌మాద స్థ‌లం ద‌గ్గ‌ర నుంచి మంత్రి ఇంజ‌నీరింగ్ అధికారులు, ఎజెన్నీ ప్ర‌తినిధుల‌తో ఇంట‌ర్ కాం ఫోన్ లో మాట్లాడారు. కార్మికులను గుర్తించే పనులు చేపట్టామని టన్నెల్ లోపల ఉన్న మంత్రి జూపల్లి చెప్పారు. బ‌య‌ట నుంచి ప్ర‌మాద‌స్థ‌లికి సొరంగంలో మధ్య‌ దూరం 13.5 కిలోమీటర్ల దూరం ఉంది.

రంగంలో ఆర్మీ సిబ్బంది
తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లాలోని దోమలపెంట సమీపంలో నిర్మాణంలో ఉన్న శ్రీశైలం ఎడమ గట్టు కాలువ వద్ద ఆర్మీ సిబ్బంది త్వరితగతిన రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు.తెలంగాణ,ఆంధ్రా సబ్ ఏరియా రెస్క్యూ ఆపరేషన్లను సమన్వయం చేస్తుంది.సికింద్రాబాద్ నుండి బైసన్ డివిజన్ యొక్క ఇంజనీర్ టాస్క్ ఫోర్స్ రంగంలోకి దిగింది. అధిక సామర్థ్యం గల పంపింగ్ సెట్లు, సాయుధ గొట్టాలు, ఎక్స్కవేటర్లు, జేసీబీలు, బుల్డోజర్లతో కూడిన ఆర్మీ వైద్య బృందాలు, ఇంజనీర్లు శిథిలాలను తొలగించడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు.

ప్రమాదంపై గవర్నర్ ఆరా
తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ తో ఫోన్ లో మాట్లాడి కొనసాగుతున్న సహాయ చర్యల గురించి ఆరా తీశారు. నాగర్ కర్నూల్ జిల్లాలో సొరంగం కూలిపోయిన ఘటనలో చిక్కుకున్న వ్యక్తులను సురక్షితంగా తిరిగి తీసుకురావడానికి జరుగుతున్న ప్రయత్నాల గురించి గవర్నర్ కు వివరించారు.జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF), రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (SDRF), సైన్యం, నిపుణులు సంఘటన స్థలంలో చురుగ్గా పనిచేస్తున్నారని జిల్లా కలెక్టర్ రెస్క్యూ ఆపరేషన్లపై తాజా సమాచారాన్ని అందించారు.సొరంగంలో చిక్కుకున్న వారిని సురక్షితంగా తిరిగి తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు చేయాలని జిష్ణు దేవ్ వర్మ అధికారులను ఆదేశించారు.

కేంద్ర సహాయం అందిస్తున్నాం : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లాలో ఎస్ఎల్ బీసీ పైకప్పు కూలిపోయిన ఘటనలో చిక్కుకుపోయిన 8 మంది కార్మికుల క్షేమం కోసం, భద్రత కోసం ప్రార్థిస్తున్నానని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు.కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకురావడానికి అవసరమైన అన్ని సహాయాలను అందిస్తోందని మంత్రి చెప్పారు. హోం మంత్రిత్వ శాఖ ఈ సహాయ చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ బృందాలను పంపిందని కిషన్ రెడ్డి చెప్పారు.





Tags:    

Similar News