కొత్త పార్టీ ప్రకటించిన తీన్మార్ మల్లన్న
తెలంగాణలో మరో ప్రాంతీయ పార్టీ;
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కొత్త పార్టీని స్థాపిస్తున్నట్టు ప్రకటించారు. పార్టీ పేరును తెలంగాణ నిర్మాణ పార్టీ అని తెలిపారు. బీసీల అభ్యున్నతి కోసమే తెలంగాణ పార్టీ పేరును స్థాపిస్తున్నట్టు తీన్మార్ మల్లన్న తెలిపారు.
తీన్మార్ మల్లన్న కార్యాలయంపై జాగృతి కార్యకర్తలు దాడి చేసిన కొద్దిసేపటికే మల్లన్న కొత్త పార్టీ పేరును అనౌన్స్ చేశారు.
ఇది రెండోసారి
2023లో తీన్మార్ మల్లన్న ఓ కేసులో చెంచల్ గూడలో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆ కేసులో మల్లన్నకు బెయిల్ వచ్చింది. బెయిల్ పై విడుదలైన తర్వాత మల్లన్న బీసీల హక్కుల సాధనకు కొత్త పార్టీ స్థాపిస్తున్నట్టు ప్రకటించారు. తెలంగాణ నిర్మాణ పార్టీ అని ప్రకటించారు. తర్వాత కొత్త పార్టీ ఊసెత్తకుండానే రాజకీయాలు చేశారు. బిఆర్ఎస్ ను నిందిస్తూ రాజకీయాలు నడిపి కాంగ్రెస్ కు దగ్గరయ్యారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోవచ్చిన తర్వాత తీన్మార్ మల్లన్నకు ఎంఎల్ సి స్థానం దక్కింది.
కాంగ్రెస్ ఎంఎల్సీ అయ్యాక తీన్మార్ మల్లన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కూడా విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ చివరి రెడ్డి ముఖ్యమంత్రి అని వ్యాఖ్యానించి వివాదాస్పదుడయ్యారు. పార్టీ సిద్దాంతాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్లు తీన్మార్ మల్లన్న ఆరోపణలు ఎదుర్కొని కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రస్తుతం బహిష్కృతమయ్యారు.
తీన్మార్ మల్లన్నపై ఎంఎల్సీ కవిత డిజిపికి ఫిర్యాదు చేసిన తర్వాతే కొత్త పార్టీని అనౌన్స్ చేశారు. తన కార్యాలయంపై దాడి చేసిన కవితపై చర్య తీసుకోవాలని తీన్మార్ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఆమె శాసన మండలి సభ్యత్వాన్ని రద్దు చేయాలని మండలి చైర్మన్ కు డిమండ్ చేశారు.