గచ్చిబౌలి స్టేడియంలో పింక్ పవర్ రన్..

మహిళల ఆరోగ్య ప్రాధాన్యత గురించి తెలియజేయడం కోసం ఈరోజు గచ్చిబౌలి స్టేడియంలో పింక్ పవర్ రన్‌ను నిర్వహించారు.

Update: 2024-09-29 07:11 GMT

మహిళల ఆరోగ్య ప్రాధాన్యత గురించి తెలియజేయడం కోసం ఈరోజు గచ్చిబౌలి స్టేడియంలో పింక్ పవర్ రన్‌ను నిర్వహించారు. ఈ పవర్ రన్‌ కార్యక్రమాన్ని మంత్రి దామోదర రాజనర్సింహ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళల ఆరోగ్యం బాగుంటేనే కుటుంబాలు అభివృద్ధి చెందుతాయని సీఎం చెప్పారు. పింక్ పవర్ రన్‌లో భాగంగా 3కే, 5కే, 10కే విభాగాల్లో భారీ సంఖ్యలో ఔత్సాహికులు పాల్గొన్నారు. పవర్ రన్ ముగిసినంతరం విజేతలకు సీఎం రేవంత్ రెడ్డి బహుమతులు అందించారు సీఎం. ఈ పవర్ రన్‌లో పాల్గొన్న ఐటీ, ఇతర ప్రైవేటు ఉద్యోగుల పాల్గొనడాన్ని మంత్రి రాజనర్సింహ అభినందించారు. రానున్న కాలంలో ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహిస్తామని ఆక్ష్న చెప్పారు. అయితే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో స్థానం సంపాదించడం కోసం సుధారె్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం పెద్దఎత్తున జరిగింది. ఈ రోజు ఉదయం 5:30 గంటలకు ప్రారంభమైంది. రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన పెంచడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

పింక్ రన్‌కు అసలు కారణం ఇదే..

ఈ పింక్ పవర్ రన్‌లో దాదాపు 5వేల మందికిపైగా ఔత్సాహికులు పాల్గొన్నారు. వీరిలో విద్యార్థులు, వైద్యులు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు సహా పలు ఇతర రంగాల వారు కూడా ఉన్నారు. రోజురోజుకీ క్యాన్సర్ బాధితుల సంఖ్య పెరిగపోతుంది. ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య మరింత అధికం అవుతోంది. ఇందుకు క్యాన్సర్‌పై అవగాహన లేకపోవడమే కారణం. క్యాన్సర్‌ను ప్రారంభదశలో గుర్తించకపోవడమే ఇన్ని మరణాలకు కారణమని నిపుణులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవకాహన కల్పించడం కోసం తెలంగాణ ప్రభుత్వం సహకారంతో సుధారెడ్డి, ఎంఈఐఎల్ ఫౌండేషన్ సంయుక్తంగా ‘పింక్ పవర్ రన్ 2024’ను నిర్వమించింది.

మహిళల ఆరోగ్యానికి ప్రాధాన్యం..

పింక్ పవర్ రన్‌ విజేతలకు సీఎం రేవంత్ రెడ్డి బముమానాలు అందించారు. నగదు, మెడల్స్‌ను అందించి వారికి ప్రశంసించారు. మహిళల మెల్త్‌కేర్‌ని మెరుగుపరచడానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ చెప్పారు. కుటుంబం, సమాజం ఆరోగ్యంగా ఉండాలంటే మహిళలు ఆరోగ్యంగా ఉండాలని ఆయన అన్నారు. మహిళలకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తామని సీఎం అన్నారు.

Tags:    

Similar News