గ్రూప్ 1 నియామకాలపై హైకోర్టులో విచారణ

స్టే ఎత్తివేయాలని కోరిన ప్రభుత్వ న్యాయవాది;

Update: 2025-07-07 11:13 GMT

గ్రూపు 1 పిటిషన్లపై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. గ్రూప్ 1 పరీక్షలను రద్దు చేసి మళ్లీ పరీక్షలు నిర్వహించాలని పిటిషనర్ల తరపు న్యాయవాది విద్యా సాగర్ వాదనలు వినిపించారు. మెయిన్స్ మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని పున: మూల్యాంకనం చేయాలని లేని పక్షంలో పరీక్షలు రద్దు చేయాలని ఆయన వాదించారు. ఏప్రిల్ లో గ్రూప్ 1 నియామకాలపై హై కోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. ఆ స్టేను ఎత్తి వేయాలని ఎంపికైన అభ్యర్థులు కోరుతున్నారు. పిటిషనర్ల తరపు వాదనలు పూర్తి చేయాలని హైకోర్టు సూచించింది. ఏదైనా అభ్యర్థన ఉంటే లిఖిత పూర్వకంగా కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది.

గ్రూప్ 1 పరీక్షలు జరిగినప్పుడు కోఠిలోని గ్రూప్ 1 పరీక్షా కేంద్రంలో ఎక్కువ మంది అభ్యర్థులు పాసయ్యారని పిటిషనర్లు వాదించారు. అయితే ప్రభుత్వ న్యాయవాది అదంతా అవాస్తవమన్నారు.ఎంపిక కాని అభ్యర్థులు అపోహలతో పిటిషన్లు వేసారని ప్రభుత్వ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు.


Tags:    

Similar News