ఆరుంధతీ రాయ్ కి తెలుగు కవుల సంఘీభావం
ఆరుంధతీ రాయ్ కి సంఘీభావంగా వెలువడిన కవితా సంకలనం ఆవిష్కరణ
ప్రఖ్యాత రచయిత్రి అరుంధతీ రాయ్ కి సంఘీభావంగా వెలవడిన 'మాటలే దేశద్రోహమైతే’ అనే కవితా సంకలనాన్ని ఈ రోజు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆవిష్కరించారు. ఇదే విధంగా ‘కలలు చిగురిస్తాయి’ పేరున పాలస్తీనా పోరాాటానికి మద్దతుగా వెలువడిన మరొక కవితా సంకలనాన్ని కూడా ఆవిష్కరించారు. ఆరుంధతీ రాయ్ మీద విధిస్తున్న ఆంక్షలను నిరసిస్తూ భావ ప్రకటనా స్వేచ్ఛను కీర్తిస్తూ పలువురు యువకవులు రాసిన కవితలు 'మాటలే దేశద్రోహమైతే’ సంకలనంలో ఉన్నాయి. మాతృభూమి కోసం పోరాడుతున్న పాలస్తీనా ప్రజలకు సంఘీభావంగా ‘కలలు చిగురిస్తాయి’ వెలువడింది.
రచయిత దొంతం చరణ్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో ప్రొపెసర్. కొండ నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రతిఘటన పై మాట్లాడుతున్న యంగ్ జనరేషన్ రాయడం కూడా చాలా అవసరం అన్నారు. ‘యువకులు కవితలు రాయడం స్ఫూర్తి దాయకం ఇది ముందు జనరేషన్స్ కి మంచి వాయిస్ అవుతుంది,’ అని అన్నారు.