వేడెక్కిన తెలుగు రాష్ట్రాలు... రెండు రోజులు అలర్ట్

మే నెల అడుగుపెట్టకముందే ఎండలు తీవ్ర రూపం దాల్చాయి. తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రజలు బయటకి వెళ్లాలంటేనే భయపడుతున్నారు.

Update: 2024-04-28 10:22 GMT

మే నెల అడుగుపెట్టకముందే ఎండలు తీవ్ర రూపం దాల్చాయి. తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రజలు బయటకి వెళ్లాలంటేనే భయపడుతున్నారు. శనివారం తెలంగాణలో మహబూబ్ నగర్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవగా, ఏపీలో నంద్యాల టాప్ లో ఉంది.

తెలంగాణలోని నిజామాబాద్, మెదక్, రామగుండం, హన్మకొండ, హైదరాబాద్, నల్గొండ, కొత్తగూడెం, మహబూబ్ నగర్ లో 40 నుండి 43.5 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక ఏపీలోని రెంటచింతల, విజయవాడ, నందిగామ, నంద్యాల, కర్నూల్, అనంతపూర్, కడప, నెల్లూరు, ఆరోగ్యవరం, తిరుపతి నగరాల్లో 40 నుండి 45 డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రతలు  నమోదయ్యాయి.  

తెలుగురాష్ట్రాల్లో ఆది, సోమవారాల్లోనూ ఎండ తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. సోమవారం గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ (ఇండియా మెటరోలాజికల్ డిపార్ట్మెంట్) తెలిపింది. ఆది, సోమవారాల్లో తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో స్వల్ప వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

తెలంగాణలో వడదెబ్బకు ఇద్దరు మృతి..

వడదెబ్బతో శనివారం ఇద్దరు చనిపోయారు. సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం కొత్త గోల్ తండాకు చెందిన బానోత్ మంగ్యా (40) కూలీ పను లకు వెళ్లొచ్చి అస్వస్థతకు గురవడంతో ఆస్పత్రికి తరలించగా అక్కడే మరణించాడు. హన్మకొండ జిల్లా దామెర మండలం పులుకుర్తి గ్రామానికి చెందిన ఎండనూరి రాజు (35) అత్తగారి ఊరైన భూపాలపల్లి జిల్లా కొత్తపల్లిగోరి మండలం దామరంచపల్లికి నడుచుకుంటూ వెళుతుండగా చెన్నా పూర్ వద్ద వడదెబ్బతో చనిపోయాడు

ఏపీలో బైక్ దగ్ధం..

శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని మదీనా మసీదు వద్ద నిలిపిన ఓ బైక్ ఎండ తీవ్రతకు మంటలు చెలరేగి దగ్ధమైంది. వాహనదారుడు శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో రోడ్డు పక్కన తన బైక్ ని పార్క్ చేసి వెళ్లాడు. నీడ లేకపోవడంతో అధిక ఉష్ణోగ్రత కారణంగా మంటలు చెలరేగాయి. స్థానికులు ఆర్పేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. వాహనం కాలి బూడిదైంది. ధర్మవరం పట్టణంలో శనివారం 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.


తెలంగాణలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైన నగరాలు..

నిజామాబాద్ - 43

మెదక్ - 42

రామగుండం - 42.4

హన్మకొండ - 41

హైదరాబాద్ - 40.9

నల్గొండ - 41.5

భద్రాద్రి కొత్తగూడెం - 42.6

మహబూబ్ నగర్ - 43.5

ఏపీలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైన నగరాలు..


రెంటచింతల - 43.2

విజయవాడ - 41.2

నందిగామ - 41.8

నంద్యాల - 44.9

కర్నూల్ - 44.5

అనంతపూర్ - 43.7

కడప - 43.4

నెల్లూరు - 41.1

ఆరోగ్యవరం - 40

తిరుపతి - 42.9

ధర్మవరం - 42

Tags:    

Similar News