ఎప్‌సెట్.. తొలి రోజు ఎన్ని దరఖాస్తుల నమోదయ్యాయంటే..
ఈ ఏడాది మొత్తం దరాస్తుల సంఖ్య 50 వేల నుంచి 70 వేల వరకు తగ్గే అవకాశం.;
తెలంగాణలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కసం టీజీ ఎప్‌సెట్ నోటిఫికేషన్ విడుదలైంది. వీటికి తొలిరోజే 5,010 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. శనివారం ఉదయం 11:45 గంటలకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. వీటిలో ఇంజనీరింగ్ స్ట్రీమ్‌కు 3,116, అగ్రికల్చర్ అండ్ ార్మసీ స్ట్రీమ్‌కు 1,891, ఈ రెండు స్ట్రీమ్‌లకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ముగ్గురు ఉన్నట్లు ఎప్‌సెట్ కన్వీనర్ వెల్లడించారు. టీజీ ఎప్‌సెట్‌కు ఈ ఏడాది నుంచి ఏపీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి వీలు లేదు. దీంతో ఈ ఏడాది మొత్తం దరాస్తుల సంఖ్య 50 వేల నుంచి 70 వేల వరకు తగ్గే అవకాశం ఉన్నట్లు సమాచారం.
మార్చి 1 నుంచి టీజీ ఎప్‌సెట్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఇది ఏప్రిల్ 4 వరకు కొనసాగనుంది. ఆ తర్వాత దరఖాస్తు చేసుకోవాలంటే ఏప్రిల్ 9 వరకు రూ.250 ఆలస్య రుసుము చెల్లించాలి. ఆ తర్వాత అయితే ఏప్రిల్ 14 వరకు రూ.500, ఏప్రిల్ 18 వరకు రూ.2500, ఏప్రిల్ 24 వరకు రూ.5000 ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసుకోవచ్చు. అదే విధంగా దరఖాస్తులో ఏమైనా తప్పులు ఉంటే వాటిని ఏప్రిల్ 6 నుంచి 8 వరకు సరిచేసుకోవచ్చు. ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు దరఖాస్తు సమయంలోనే తమ వివరాలను అందించాల్సి ఉంటుంది.
ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 29 నుంచి మే 5 వరకు టీజీ ఎప్‌సెట్ పరీక్షలు జరగనున్నాయి. ఏప్రిల్ 19 నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 29, 30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మా కోర్సులకు, మే 2 నుంచి 5 వరకు ఇంజినీరింగ్ విభాగాలకు ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు తొలి విడత పరీక్ష జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో సెషన్ పరీక్ష జరగనుంది. ఇంటర్ రెండు సంవత్సరాల్లో 100 శాతం సిలబస్‌తో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు.