TGPSC | గ్రూప్‌-2కు వేళాయే.. టీజీపీఎస్‌సీ ఛైర్మన్ ఏం చెప్పారంటే..

తెలంగాణ రాష్ట్రం గ్రూప్-2 పరీక్షలకు సన్నద్ధమవుతోంది. అధికారులు ఈ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు శరవేగంగా చేస్తున్నారు.;

Update: 2024-12-14 07:18 GMT

తెలంగాణ రాష్ట్రం గ్రూప్-2 పరీక్షలకు సన్నద్ధమవుతోంది. అధికారులు ఈ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు శరవేగంగా చేస్తున్నారు. తాజాగా ఈ పరీక్షల ఏర్పాట్లపై టీజీపీఎస్‌సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం పలు కీలక విషయాలు పంచుకున్నారు. రాష్ట్రంలో డిసెంబర్ 15, 16 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు జరగనున్నాయని వివరించారు. మొత్తం 783 గ్రూప్-2 సర్వీసుల పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశామని, వీటికి మొత్తం 5,51,943 మంది దరఖాస్తు చేసుకున్నారని ఆయన వివరించారు. ఈ పరీక్షలు ఒక్కో పేపరు 150 మార్కులకు జరగనుందని, మొత్తం నాలుగు పేపర్ల పరీక్షలు జరగనున్నాయని, అంటే మొత్తం 600 మార్కులకు గ్రూప్-2 పరీక్షలు జరగనున్నాయని బుర్రా వెంకటేశం తెలిపారు. ఈ పరీక్షలు ఉదయం 10 గంటల నుంచి 12:30 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5:30 గంటల వరకు రెండు సెషన్లలో పరీక్షలు జరగనున్నట్లు తెలిపారు.

అపోహలు వద్దు..

‘‘గ్రూప్-2 పరీక్షలు ఇప్పటి వరకు ఎగ్జామ్ 4 సార్లు పోస్ట్పోన్ అయింది. 1,368 కేంద్రాలులో పరీక్ష నిర్వహణ జరుగుతుంది. 49,843 మంది సిబ్బంది పరీక్షకు అందుబాటులో ఉంటారు. ఇప్పటి వరకు 77% హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. 80 శాతం పైగా డౌన్లోడ్ చేసుకుంటారు అని అంచనా వేస్తున్నాం. అభ్యర్థులు ఎవరూ ఆందోళన చెందవద్దు.... ఎలాంటి అపోహలు వద్దు. చైర్మన్‌గా నాకు ఉన్న అధికారాలు అన్ని మీకోసం ఉపయోగిస్తాను. బయో మెట్రిక్ కచ్చితంగా ఇవ్వాలి లేకుంటే జవాబు పత్రం తిరస్కరించపడుతుంది. గతంలో నోటిఫికేషన్ వచ్చినప్పుడు పూర్తి అవడానికి 4 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు చాలా తొందరగా ఫలితాలు విడుదల చేస్తాము. ప్రతి సెంటర్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాము. క్వశ్చన్ పేపర్ అభ్యర్థులకు తప్ప ఎవరికీ తెలియకుండా జాగత్రలు తీసుకున్నాము’’ అని తెలిపారు.

ఢిల్లీకి అందుకే వెళ్తున్నాం..

‘‘18వ రోజు డిల్లీకి కమిషన్ వెళ్లి అక్కడ ఏ విధమైన విధానాలు పాటిస్తున్నారు అని తెలుసుకోవడం కోసం వెళ్తున్నాను. 19వ రోజు ఎస్ఎస్‌సీ కమిషన్‌తో భేటీ అవ్వనున్నాం. ఎన్‌టీఏతో భేటీ అవ్వనున్నాం. జనవరి నెల చివరి కల్లా రాష్ట్ర ప్రభుత్వంతో భేటీ అయ్యి నివేదిక ఇస్తాం. గత చరిత్ర మాసకబరింది. అయినా సరే మన దగ్గర విధివిధానాల కోసం తమిళనాడు, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల కమిషన్ ఇక్కడికి రావాలని సంప్రదించారు. తెలంగాణ కమిషన్ పరీక్ష తేదీ ప్రకటించింది అంటే పోస్ట్‌పోన్ అవ్వదు అనే నమ్మకం ఉండే విధంగా ముందుకు వెళ్తున్నాం. సంస్థాగత మార్పులు చేసి యూపీఎస్సీతో పోటీ పడే విధంగా కమిషన్‌ని రెడీ చేస్తాం. మార్చిలో గ్రూప్1, గ్రూప్2, గ్రూప్3 ఫలితాలు విడుదల చేస్తాం. పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిలబస్ మాత్రమే ఇస్తుంది.. కానీ ఏ పుస్తకం చదవాలి అని చెప్పదు. చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఎందుకు జాబ్ క్యాలెండర్ జాప్యం అవుతుంది అని పరిశీలించి జనవరిలో విడుదల చేస్తాం. పరీక్ష ప్రారంభానికి అరగంట ముందు గేట్లు మూసివేస్తాం. అభ్యర్థులు ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. గ్రూప్1, గ్రూప్3 జవాబు ప్రత్రాలు మూల్యకలనం జరుగుతుంది. పోలింగ్ కేంద్రాలు ఏ విధంగా ఉంటాయో అదే విధంగా ఫ్యూచర్లో అలానే ఉంటాయి. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ నిర్వహించడం సాధ్యం కాదు’’ అని స్పష్టం చేశారు.

Tags:    

Similar News