అందరూ ఉండి అనాథగా మారిన శిశువు

ఇద్దరి డీఎన్ఏలు మ్యాచ్ కాలేదని తేలింది;

Update: 2025-07-31 10:55 GMT
Infant with Dr Namratha

విధిలిఖితాన్ని ఎవ్వరూ తప్పించలేరు. లేకపోతే అయినవాళ్ళు ఇంతమంది ఉండి కూడా ఈ శిశువు అనాధగా మారటం ఏమిటి ? విషయం ఏమిటంటే ‘సృష్టి ఫెర్టిలిటీ సెంటర్’(Srushti surrogacy center) పేరుతో డాక్టర్ పచ్చిపాల నమ్రత అరాచకాలు, మోసాలు ఒక్కోటి వెలుగుచూస్తున్నాయి. ఇందులో భాగంగానే నమ్రత అత్యాస కారణంగా ఒక శిశువు అనాధగా మారింది. విషయం ఏమిటంటే రాజస్ధాన్ దంపతులకు సరొగసీ(Surrogacy) పద్దతిలో సంతానభాగ్యం కలిగచేస్తానని డాక్టర్ నమ్రత హామీ ఇచ్చింది. తొమ్మిది నెలల తర్వాత వైజాగ్(Vizag) కేంద్రానికి వెళ్ళి పిల్లాడిని తీసుకోవాలని చెప్పింది. ఇందుకోసం రాజస్ధాన్ దంపతుల నుండి డాక్టర్ రు. 35 లక్షలు తీసుకున్నది.

అయితే పుట్టినదగ్గర నుండి పిల్లాడికి అనారోగ్యం పట్టి పీడిస్తునే ఉంది. అందుకని తమ పిల్లాడిని తీసుకుని దంపతులు డాక్టర్ దగ్గరకు వెళితే వైద్యంచేయటానికి నిరాకరించటమే కాకుండా ఇంకోసారి రావద్దని బెదిరించారు. అలాగే పిల్లాడికి తనకు డీఎన్ఏ టెస్టు చేయించాలని భర్త అడిగినా డాక్టర్ నిరాకరించారు. దాంతో పిల్లాడికి వైద్యంచేయించేందుకు దంపతులు ఇంకో డాక్టర్ దగ్గరకు వెళ్ళారు. అక్కడి డాక్టర్ పిల్లాడికి, తండ్రికి డీఎన్ఏ టెస్టుచేయించారు. దాంతో ఇద్దరి డీఎన్ఏలు మ్యాచ్ కాలేదని తేలింది. అంటే తండ్రి స్పెర్మ్ తో సరొగసి పద్దతిలో బిడ్డ పుట్టలేదు. ఇంకెవరి బిడ్డనో డాక్టర్ నమ్రత తీసుకొచ్చి దంపతులకు అందించిందన్న విషయం అర్ధమైపోయింది. దాంతో దంపతులు డాక్టర్ నమ్రత మీద గోపాలపురం పోలీసులకు ఫిర్యాదుచేయటంతో మొత్తం డొంకంతా కదిలింది.

ఇక్కడ బాధాకరమైన విషయం ఏమిటంటే తమకు పుట్టలేదుకాబట్టి ఆ పిల్లాడితో తమకు ఎలాంటి సంబంధంలేదని దంపతులు తెగేసిచెప్పేశారు. పైగా ఎప్పుడూ అనారోగ్యంతోనే ఉంటున్న కారణంతో పాటు తాజా పరీక్షల్లో పిల్లాడికి క్యాన్సర్ అని తేలింది. దాంతో పిల్లాడిని దంపతులు వదిలించేసుకున్నారు. ఇక జన్మనిచ్చిన తల్లి, దండ్రులు అరెస్టయి రిమాండులో ఉన్నారు. పిల్లాడిని కన్నది అస్సాంకు చెందిన మహ్మద్ ఆలీ అదిక్, నస్రీమా దంపతులు. నమ్రత ర్యాకెట్లో వీళ్ళు కూడా బాగమైనందుకు వీళ్ళద్దరినీ పోలీసులు అరెస్టుచేసి రిమాండుకు పంపారు. అంటే కన్నవాళ్ళేమో జైలుపాలయ్యారు..పెంచిన తల్లి, దండ్రులేమో పిల్లాడు వద్దని వదిలించేసుకున్నారు. దాంతో కన్నవాళ్ళకి, పెంచిన వాళ్ళకి దూరమైన శిశువు చివరకు అనాథలాగ శిశువిహార్ కు చేరాడు. డబ్బుమీద డాక్టర్ నమ్రతకు ఉన్న వ్యామోహం కారణంగా ఒక పిల్లాడు అనాథగా మారటం చాలా బాధాకరమనే చెప్పాలి.

Tags:    

Similar News