అరవింద్ పోరాట ఫలితంగానే కొత్త రైల్వే లైను

నిజామాబాద్ బిజెపి అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి;

Update: 2025-07-24 13:22 GMT

ఆదిలాబాద్ ఆర్మూర్ పటాన్ చెరు కొత్త రైల్వే లేన్ నిజామాబాద్ ఎంపీ ధర్మ పురి అరవింద్ కృషి ఫలితమేనని నిజామాబాద్ బిజెపి అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి అన్నారు.

ఆదిలాబాద్ ఆర్మూర్ పటాన్ చెరు కొత్త రైల్వే లైనుకు రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది.

ధర్మపురి అరవింద్ ఈ ప్రాజెక్టు మంజూరుకు అనేక పర్యాయాలు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కలిసినట్టు కులాచారి వివరించారు. తాజాగా అశ్విని వైష్ణవ్ నిజామాబాద్ పార్లమెంటు సభ్యులకు లేఖ రాశారు. ఈ ప్రాజెక్టు మంజూరైందని, డిపిఆర్ తయారీ పనులు జరుగుతున్నాయని తెలిపారు. 250 కిలో మీటర్ల ఈ రైల్వే లైను నిర్మల్, నిజామాబాద్ , బోధన్, సంగారెడ్డిలను లైను కలుపుతుందన్నారు. ఈ లైను వెళ్లే ప్రాంతాలలో కొత్త రైల్వేస్టేషన్ల ను నిర్మించే ప్రతిపాదన ఉందని ఆయన సూచనా ప్రాయంగా తెలిపారు. ఈ లైను పూర్తయితే పొరుగున ఉన్న మహరాష్ట్ర వాసులకు కూడా వెసులుబాటు కలుగుతుందన్నారు.

నిజాం ప్రభుత్వ హాయంలో రైల్వే లైన్లను నిర్మించింది. అయితే  మన పాలకులు   కేవలంనిజామాబాద్ నుంచి జగిత్యాల వరకు కేవలం ఒక లైను మాత్రమే నిర్మించారు. ఇది కూడా నిజామాబాద్ ప్రజల పోరాట ఫలితమని కులాచారి అన్నారు.

Tags:    

Similar News