జస్టిస్ గవాయ్ పై దాడి వెనుక అసలేం జరిగిందంటే..

సనాతన ధర్మం తెలిసిన వాడేనా ఆ దాడి చేసిందీ?

Update: 2025-10-07 03:22 GMT
(రాజేశ్వర్ చెలిమల)
ఖజూరహోలో ఎపుడో విరిగిన విగ్రహం కేసది. సెప్టెంబరు (2025) నెలలో ఒకరోజు సుప్రీం కోర్టు ముందుకు విచారణ నిమిత్తం ఒక PIL వచ్చింది. ఆ PIL సందర్భంగా మన CJI చేసినట్టు చెబుతున్న కొన్ని వ్యాఖ్యలే, నిన్న ఆయనపై జరిగిన దాడి యత్నానికి కారణం అయి ఉండొచ్చని అంటున్నారు..
కారణం ఏదైనా.. నిన్న (2025 అక్టోబర్) ౬వ తేదీ నాడు, ఓపెన్ కోర్టులో CJIపై ఒక న్యాయవాది (అతన్ని ఇప్పుడు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, అడ్వకేట్ రోల్స్ నుంచి సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది) దాడి చేయడానికి ప్రయత్నించాడనే వార్త అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. CJI గారిపై జరిగిన ఆ దాడి యత్నాన్ని అందరూ ముక్త కంఠంతో ఖండించాలని కోరుతున్నాం...

 ఇంతకూ 'నిన్న సుప్రీం కోర్టులో జరిగిన, ఆ అవాంచనీయ సంఘటనకు మూల కారణంగా' చెప్పబడుతున్న , ఆ కేస్ (PIL) వివరాలు ఏంటో ఇపుడు చూద్దాం..

"మధ్య ప్రదేశ్ రాష్ట్రం (ఖజూరహో) లోని ఒక ఆలయ ప్రాంగణంలో.. ఎపుడో బ్రిటిష్ వారు రాక మునుపు, విదేశీ రాజుల దండయాత్రల కాలంలో.. ఓ విగ్రహం (అది విష్ణు మూర్తి దంట) యొక్క తల విరిగి పోయిందనీ, ఆ విగ్రహం అప్పటి నుంచీ ఇప్పటి వరకు ఇంకా అలాగే ఏ దిక్కూ మొక్కూ లేకుండా అక్కడే పడి ఉందనీ, దాన్ని బాగు చేయించాలని, మధ్య ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా , మా మొర ఎవరూ వినిపించుకోవడం లేదనీ, కనీసం మీరైనా మా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించి, సదరు విగ్రహాన్ని సరిచేసే (తలను అతికించే) మార్గం చూడండని, ఓ వ్యక్తి సుప్రీం కోర్టులో ఒక PIL వేశాడు...
గత నెల (2025 సెప్టెంబర్) లో ఆ కేస్ సుప్రీంకోర్టు ముందుకు విచారణకు వచ్చిన సందర్భంగా..
సుప్రీం కోర్టు CJI, జస్టిస్ గగోయ్ గారు, ఖజూరహో దేవాలయాలు "ఆర్కియాలోజికల్ సర్వే ఆఫ్ ఇండియా" వారి ఆధీనంలో ఉన్నందున, మీరు సుప్రీం కోర్టు తలుపు తట్టే బదులు, పురావస్తు శాఖ వారిని అప్రోచ్ కావడం మంచిదని సూచించారు. ఇంకా ఈ కేస్ లో.. "ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ కంటే, పబ్లిసిటీ మీద ఇంట్రెస్ట్ తో వేసిన కేస్ లాగా ఉంది, మీరు వెళ్లి ఆ విగ్రహాన్నే ప్రార్థించండి" అని CJI గారు వ్యాఖ్యానించినట్టుగా చెప్తున్నారు.
ఆయన అలా వ్యాఖ్యానించడానికి కూడా ఓ కారణం ఉంది. అదేంటంటే..
"ఖజురహో లో చాలా దేవాలయాలలో నిత్య పూజలు జరగవు. మొఘలుల కాలంలో ఒక ఆలయ ప్రాంగణంలో, ఓ విగ్రహం తల విరిగి పడిపోయి ఉందని చెప్పబడుతున్న ఆ పర్టిక్యులర్ ఆలయంలో కూడా నిత్య పూజలు జరగవు.
సుదీర్ఘ కాలం పాటు, ఏళ్ళ తరబడి ఏ పూజలూ ఎరగని, అక్కడ విరిగి పడి ఉన్న ఓ రాతి విగ్రహాన్ని సరి చేయడానికి, రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించాలని, కేస్ వేయడమే హాస్యాస్పదం. అది నిజంగా పబ్లిసిటీ మీద ఇంట్రెస్ట్ తో వేసిన కేస్ గాక మరేమిటి ?
నిజానికి ఖజూరహో ఆలయాలలో పూజలు నిర్వహించడానికి భక్తులు రారు. అక్కడి ఆలయాల మీద చెక్కబడి ఉన్న శిల్పసంపదను, ఆ శిల్పకళా ఖండాలను చూడటానికే రెగ్యులర్ గా సందర్శకులు (భక్తితో కాదు, కేవలం శిల్పాల బ్యూటీని ఆస్వాదించడానికే) అక్కడికి వస్తూ ఉంటారు. ఆ ఖజూరహో శిల్పాలను చూడటానికి విదేశీయులు సైతం అత్యధిక సంఖ్యలో ఇండియాకు వస్తూ ఉంటారన్నది వాస్తవం.
అంటే ఆ ఆలయాలను, ఎవరూ భక్తితో కాకుండా.. కేవలం వాటి మీద చెక్కబడి ఉన్న శిల్ప సంపదను చూడటానికి, చూసి ఆస్వాదించడానికి జనం అక్కడికి వెళ్తూ ఉంటారనే మొత్తం ప్రజలందరికీ తెలుసు.
పైగా ఆ ప్రాచీన కట్టడాలను.. అవి ఉన్నవి ఉన్నట్లుగా, వాటికి ఎటువంటి మార్పులు, చేర్పులు చేయకుండా వాటిని పరిరక్షించే బాధ్యత మొత్తాన్ని "భారత పురావస్తు శాఖ" వారికి, అధికారికంగానే అప్పగించడం జరిగింది. ]
So, ఈ కేస్ విచారణ సందర్భంగా.. సుప్రీం కోర్టు CJI గారు చేసిన వ్యాఖ్యల్లో, ఎక్కడా సనాతన ధర్మాన్ని కించ పరిచినట్టు గానీ, అపహాస్యం చేసినట్టు గానీ లేనేలేదు.
మరి అలాంటప్పుడు ఒక సీనియర్ న్యాయవాది అయి ఉండి (ఇతను 71 సంవత్సరాల వయస్సున్న "రాకేష్ కిషోర్" అని పోలీసుల విచారణలో తేలింది), తాను సనాతన ధర్మ పరిరక్షుణ్ణని ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నంలో భాగంగా.. ఓపెన్ కోర్టులోనే ఈ దేశంలో అత్యున్నత న్యాయస్థానమైన, సుప్రీంకోర్టు CJI గారి మీదనే దాడీ చేయడానికి ఎలా తెగించగలిగాడనేది ప్రశ్న. అతని వెనుక ఇంకా ఎంతటి మతోన్మాదులు ఉన్నారో ?
ఈ సంఘటనపై మీడియా కథనం ఈ విధంగా ఉంది:
న్యూఢిల్లీ: కోర్టు ప్రొసీడింగ్స్ కొనసాగుతున్న సమయంలోనే ఓ సీనియర్ అడ్వకేట్ సుప్రీం కోర్టు సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ పై దాడికి యత్నించాడు. తన షూ తీసి సీజేఐపై వేయడానికి ప్రయత్నిస్తుండగా.. అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది, తోటి లాయర్లు అప్రమత్తమై అడ్డుకున్నారు. ఆ తర్వాత అతన్ని కోర్టు రూమ్ నుంచి బయటికి తీసుకెళ్లిపోయారు.
అతన్ని సెక్యూరిటీ వాళ్ళు బయటకు తీసికెళ్తున్న సమయంలో..
"సనాతన ధర్మాన్ని అవమానిస్తే దేశం సహించబోదు"
అంటూ ఆ అడ్వకేట్ నినాదాలు చేశాడు.
దాడికి యత్నించిన లాయర్ ను ఢిల్లీలోని మయూర్ విహార్లో నివాసం ఉండే 71 ఏండ్ల "రాకేశ్ కిశోర్"గా గుర్తించారు. దాడి సమయంలో సీజేఐ పక్కన జస్టిస్ కే. వినోద్ చంద్రన్ కూడా ఉన్నారు.
ఈ ఘటనపై జస్టిస్ బీఆర్ గవాయ్ వెంటనే స్పందించారు. "ఇలాంటి చర్యలు నన్నేం చేయబోవు. వాదనలు కొనసాగించాలి" అని కేసు వాదిస్తున్న లాయర్లకు సూచించారు.
కాగా, ఇటీవల మధ్యప్రదేశ్ లోని ఖజురహో ఆలయ కాంప్లెక్స్ లోని జవారీ ఆలయంలో ధ్వంసమైన విష్ణుమూర్తి విగ్రహాన్ని పునరుద్ధరించాలంటూ దాఖలైన పిటిషన్ ను సీజేఐ జస్టిస్ గవాయ్ కొట్టేశారు.
అయితే, తీర్పు సమయంలో ఆయన చేసిన కామెంట్లు వివాదాస్పదం అయ్యాయి. దీన్ని దృష్టిలో పెట్టుకునే రాకేశ్ కిశోర్ దాడికి పాల్పడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
అసలేం జరిగిందంటే..
సుప్రీం కోర్టులోని కోర్టు నంబర్ 1లో సుమారు ఉదయం 11:35 గంటల సమయంలో సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కే.వినోద్ చంద్రన్ బెంచ్లో ఉన్నారు. కేసులు మెన్షన్ చేసే సమయంలో రాకేశ్ కిశోర్ లేచి బెంచ్ వైపు వెళ్లాడు. తన షూ తీసి జస్టిస్గ గవాయ్ వైపు విసిరే ప్రయత్నం చేశాడు. వెంటనే అలర్ట్ అయిన సెక్యూరిటీ అతన్ని అడ్డుకుని కోర్టు రూమ్ నుంచి బయటికి తీసుకెళ్లిపోయారు. నిందితుడిని పోలీసులు
అదుపులోకి తీసుకున్నారు. తదుపరి చర్యల కోసం సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ జనరలును సంప్రదించారు.
నిందితుడిపై ప్రాథమిక చర్య..
నిందితుడు కిశోర్ సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ లో సభ్యుడిగా ఉన్నాడు. దాడి తర్వాత అతన్ని బార్ కౌన్సిల్ సస్పెండ్ చేసింది. దేశంలోని ఏ కోర్టులో కూడా వాదించకుండా ఆంక్షలు విధించింది. షోకాజ్ నోటీసు జారీ చేసింది. 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అన్ని కోర్టులకు, ట్రిబ్యునల్స్ కు ఈ సస్పెన్షన్ విషయాన్ని తెలియజేయాలని సూచించింది.
#CJIగారు_చేసింది_వివాదాస్పద_కామెంట్స్_ఏమీ_కావు
ఖజురహో ఆలయకాంప్లెక్స్లోలోని 'జవారీ ఆలయం'లో గత చరిత్రలో ఎపుడో ధ్వంసమైన 'విష్ణుమూర్తి విగ్రహాన్ని' పునరుద్ధరించడానికి, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ దాఖలు చేయబడిన ఓ పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ పిటిషన్ ను సీజేఐ బీఆర్ వాయ్ గారు ఈ (2025) సెప్టెంబర్ 17న విచారించారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని కామెంట్లు చేశారంటున్నారు.
అవి "ఇది పబ్లిసిటీ ఇంట్రెస్ట్ లిటిగేషన్" పిటిషన్, దీనిపై ఇక్కడికి వచ్చే బదులు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్లనే అభ్యర్థించండి. లేదంటే మీరెలాగూ విష్ణుమూ ర్తి పరమ భక్తుడినని అని చెబుతున్నారుగా. ఆయననే (ఆ విష్ణుమూర్తినే) వేడుకోండి. మీకు శైవత్వం పై వ్యతిరేకత లేకుంటే అదే ఖజు రహోలోని, అతిపెద్ద శివలింగానికి కూడా మీరు విన్న వించుకోవచ్చు" అని సీజేఐ బీఆర్ గవాయ్ గారు వ్యాఖ్యానించినట్టు చెప్తున్నారు.
ఈ కామెంట్స్ ఆధారంగానే, నిందితుడైన రాకేష్ కిషోర్ ను సపోర్ట్ చేసే ఓ సనాతన బ్యాచ్ కూడా సోషల్ మీడియాలో మోపైంది. అసలు CJI గారు చేసినట్టు చెప్పబడుతున్న, ఈ కామెంట్స్ లో వివాదం ఏముందని అంత రాద్దాంతం చేస్తున్నారో అర్థం కావడంలేదు.
(రచయిత- జన విజ్ఞాన వేదిక (జేవీవీ) తెలంగాణ రాష్ట్ర శాఖ నాయకుడు)
Tags:    

Similar News