తెలంగాణ సచివాలయ సర్వీసు అధికారుల బదిలీలు
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సచివాలయ సర్వీసుల శాఖలో పలు అధికారులను బదిలీలు చేశారు. సాధారణ పరిపాలనా శాఖకు చెందిన 26 మంది అధికారులను బదిలీ చేశారు.
By : The Federal
Update: 2024-10-30 13:44 GMT
తెలంగాణ సాధారణ పరిపాలన శాఖకు చెందిన 26 మంది కీలక అధికారులను బదిలీ చేస్తూ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. వివిధ శాఖల్లో పనిచేస్తున్న జీఏడీ అధికారులను భారీగా బదిలీ చేయడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదటి సారి జీఏడీ అధికారులను బదిలీ చేసింది. బదిలీ అయిన అధికారులు వెంటనే రిలీవ్ అయి కొత్త శాఖల్లో చేరాలని చీఫ్ సెక్రటరీ ఆదేశాలు చేశారు. ఈ మేరకు జీఓఆర్టీ నంబరు 1448 తో ఉత్తర్వులు జారీ చేశారు.
- వైద్యఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అదనపు సెక్రటరీ సీహెచ్ రాజసులోచనను ఇరిగేషన్ అండ్ కాడ్ శాఖ అదనపు కార్యదర్శిగా బదిలీ చేశారు. ఏ అండ్ సీ అదనపు కార్యదర్శి ఎల్ సరితారాణిని వైద్యఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అదనపు సెక్రటరీగా బదిలీ చేశారు.
- ఇరిగేషన్ శాఖ అదనపు కార్యదర్శి ఎన్ శంకర్ ను పశుసంవర్ధక శాఖకు, రెవెన్యూ అదనపు సెక్రటరీ టీ శేఖర్ ను ఏ అండ్ సీ విభాగానికి, టీవీసీ అదనపు సెక్రటరీ వి నిర్మలను జీఏడీ పొలిటికల్ విభాగానికి బదిలీ చేశారు. జీఏడీ పొలిటికల్ విభాగం జాయింట్ సెక్రటరీ హోంశాఖకు బదిలీ చేశారు. విద్యాశాఖ అదనపు కార్యదర్శి లలితా మాలోత్ ను ఇరిగేషన్ శాఖకు బదిలీ చేశారు.
- రెవెన్యూశాఖ జాయింట్ సెక్రటరీ ఎం రాంసింగ్ ను అటవీశాఖకు, గిరిజన సంక్షేమ శాఖ జాయింట్ సెక్రటరీ ఎస్ లక్ష్మిబాయిని ఉన్నతవిద్యాశాఖకు బదిలీ చేశారు. ఇరిగేషన్ శాఖ డిప్యూటీ సెక్రటరీ కళ్యాణిని గిరిజన సంక్షేమ శాఖకు బదిలీ చేశారు.
టీజీఎస్పీఎఫ్‌కు సచివాలయ భద్రత
తెలంగాణ సెక్రటేరియట్ భద్రతను తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌కు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. డీజీపీ లేఖ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పాత సచివాలయం పద్ధతిలోనే బందోబస్తు బాధ్యతలను టీజీఎస్పీఎఫ్ కు అప్పగించారు.ఇటీవల టీజీఎస్పీ ఆందోళనలతో ఎస్పీఎఫ్ సెక్యూరిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ శాంతికుమారి జీఓఎంఎష్ నంబరు 227 విడుదల చేశారు. దీనికోసం నాలుగు కంపెనీల బలగాలను కేటాయించారు.