మరో ఇద్దరు మావోయిస్టుల లొంగుబాటు
రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఎదుట ..;
తెలంగాణలో మరో ఇద్దరు మావోయిస్టు అగ్రనేతలు లొంగిపోయారు. 40 ఏళ్ల సుదీర్ఘ కాలం వారు దండకారణ్యంలో ఉన్నట్టు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు గురువారం మీడియా సమావేశంలో చెప్పారు. ఆకర్ల సునీత దండకారణ్యంలో
స్పెషల్ జోన్ కమిటీ మెంబర్ గా పని చేశారు. చెన్నూరి హరీష్ అలియాస్ రమణ ఎరియా కమిటీ మెంబర్ గా పని చేశారు. ప్రభుత్వం ఇచ్చే పునరావాసకార్యక్రమాలకు ఆకర్షితులై జనజీవన స్రవంతిలో కలిసిపోయినట్టు సుధీర్ బాబు చెప్పారు. శేష జీవితం ప్రశాంత వాతావరణంలో గడపడానికి అగ్రనేతలు ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన చెప్పారు. కాకరాల సునీత తండ్రి, ఒక విప్లవ రచయితల సంఘం నాయకుడిగా పని చేసినట్టు కమిషనర్ చెప్పారు.
‘‘వరవరరావు, గద్దర్ లాంటి విప్లవకారులు వారి ఇంటికి తరచూ వస్తుండటంతో సునీత మావోయిస్టుల సిద్ధాంతాల వైపు ఆకర్షితులయ్యారు. ఆమె 1986లో పీపుల్స్ వార్ పార్టీలో క్రియాశీలకంగా పని చేశారు. 1986 ఆగస్టులో టీఎల్‌ఎన్ చలం గౌతమ్ అలియాస్ సుధాకర్‌ను వివాహం చేసుకున్నారు.సుధాకర్ రెండు నెలల క్రితం జరిగిన ఎన్ కౌంటర్ లో చనిపోయారు.
చెన్నూరి హరీశ్ అలియాస్ రమణ కూడా నేడు లొంగిపోయారు. ఆయన పదో తరగతి చదువుతున్నప్పుడే మావోయిస్టు ఉద్యమంలో మమేకం అయ్యారు.