భర్తను చంపిన ఇద్దరు భార్యలు
జనగామ జిల్లాలో ప్రతీకార హత్య;
వాళ్లిద్దరు తో బుట్టువులు. ఇద్దరూ ఒకరినే వివాహమాడటంతో సవతులయ్యారు. తమ తల్లిని చంపాడన్న పగతో కట్టుకున్న భర్తను ఇద్దరు సవతులు చంపేశారు.
జనగామ జిల్లా ఘనపురం మండలానికి చెందిన పిట్టలగూడెంలో చోటు చేసుకుంది ఈ ఘటన.
కాలియా కనకయ్యకు గౌరమ్మ, చొక్కమ్మ భార్యలు. వీళ్లిద్దరు అక్క చెల్లెల్లు కావడంతో అన్యోన్యంగా ఉండే వారు. ఎంతగా అంటే ఒకరినే వివాహమాడేంత. మే 18న కనకయ్య తాగిన మైకంలో యాదాద్రి జిల్లా గుండాల మండలం సుద్దాల గ్రామంలో అత్త మామిడితోటలో ఉండగా హత్య చేశాడు. తాగిన మైకంలో అత్తను గొడ్డలితో దారుణంగా హత్య చేసి ఇంటికి వెళ్లిపోయాడు. మరో తోటలోఉన్న భార్యలను వెంట పెట్టుకుని సిద్దిపేట పారిపోయాడు. కేసు నమోదుచేసుకున్న పోలీసులకు కనకయ్య చంపినట్టు ప్రాథమిక సమాచారం రావడంతో సిద్దిపేట చేరుకున్నారు. అప్పటికే కనకయ్య పారిపోయాడు. విషయం తెలుసుకున్న భార్యలు స్వంత గ్రామమైన పిట్టల గూడెం చేరుకున్నారు. అప్పటికే కనకయ్య ఇంట్లో తలదాచుకున్నాడు. భర్తతో ఇద్దరు భార్యలు గొడవ పడ్డారు. మా అమ్మను ఎందుకు చంపావు అని గొడవపడ్డారు. పెద్ద గొడవ జరగడంతో ఊరివాళ్లు అక్కడి చేరుకున్నారు. జనార్ధన్, శ్రీనివాస్ ల సాయంతో కనకయ్యను ఇద్దరు భార్యలు చంపేశారు. భార్యలకు జనార్ధన్ , శ్రీనివాస్ లు వరుసకు సోదరులు. కనకయ్యను చంపేసి గ్రామంలో ఉన్న చెట్ల పొదల్లో పడేశారు.
కనకయ్య తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తుచేస్తున్నారు.