Revanth Reddy | అదానీ పెట్టుబడులపై ప్రతిపక్షాలకు సమాధానమిచ్చిన రేవంత్
అదానీ అవినీతి మంటలు తీవ్రంగా చెలరేగుతున్నాయి. వీటి ప్రభావం తెలంగాణ రాజకీయాలపై కూడా గట్టిగానే పడుతోంది.;
అదానీ అవినీతి మంటలు తీవ్రంగా చెలరేగుతున్నాయి. వీటి ప్రభావం తెలంగాణ రాజకీయాలపై కూడా గట్టిగానే పడుతోంది. అవినీతి చేసిన అదానీతో సీఎం రేవంత్ ఎందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నారని, కుదుర్చుకున్న ఒప్పందాలను ఎందుకు రద్దు చేయడం లేదని ప్రతిపక్షాలు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాయి. అదానీ అవినీతి అంశం తెరపైకి వచ్చిన మరుసటి రోజు నుంచే స్కిల్ యూనివర్సిటీకి అదానీ గ్రూప్ అందించిన రూ.100 కోట్ల విరాళంపై ప్రతిపక్షాలు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశాయి. అది విరాళమా? ముడుపుల చెల్లింపా? అని ప్రశ్నించారు. దానిపై స్పందించిన సీఎం.. అదానీ నుంచి రూ.100 కోట్ల విరాళాన్ని తిరస్కరిస్తున్నట్లు వెల్లడించారు. అదే విధంగా ఎటువంటి ట్రాన్సాక్షన్ చేయొద్దని తెలుపుతూ అదానీ గ్రూప్‌కు పంపిన లేఖను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నేపథ్యంలో అదానీతో తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న రూ.12,400 కోట్ల విలువైన ఒప్పందాలపై ప్రశ్నించడం ప్రారంభించాయి ప్రతిపక్షాలు. వాటిని వెంటనే రద్దు చేసుకోవాలని డిమాండ్ చేయడం ప్రారంభించాయి. కాగా వీటిపై సీఎం రేవంత్ తాజాగా స్పందించారు. అదానీతో చేసుకన్న పెట్టుబడి ఉండాలను వెంటనే రద్దు చేయలేమని తెలిపారు.
గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను సింగిల్ స్కోక్‌తో రద్దు చేసే పరిస్థితి ఉండదని, అది తెయకుండా పదేళ్లు పాలన కొనసాగించారా అంటూ ప్రతిపక్షాలపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత ప్రైవేటు వ్యక్తుల పెట్టుబడులు పెిగాయని, అందుకు అనుగుణంగానే రాజ్యంగాన్ని మారుస్తున్నామని సీఎం తెలిపారు. ప్రైవేటు వ్యక్తుల పెట్టుబడులపై విస్తృతంగా చర్చ జరగాలని, వ్యక్తులపై చర్చ చేయడం కాదని వివరించారు. ప్రవేటు వ్యక్తుల పెట్టుబడుల విషయంలో తమ ప్రభుత్వం తీవ్ర చర్చలు చేస్తోందని, అతి త్వరలోనే పలు నిర్ణయాలు తీసుకంటామని చెప్పారు. అదే విధంగా అదానీ ఒప్పందాలపై కూడా నిర్ణయం తీసుకోనున్నట్లు సీఎం ప్రకటించారు. ఇటీవల అదానీ ఒప్పందాలపై మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. అదానీతో చేసుకున్న ఒప్పందాలను వెంటనే ద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఆ ఒప్పందాల సంగతేంటి సీఎం: హరీష్
‘‘యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి ఆదాని ఇచ్చిన 100 కోట్ల నిధులను వెనక్కి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న రేవంత్ రెడ్డి. మరి, రాహుల్ గాంధీ.. అదానీ అవినీతి మీద జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని నినదిస్తున్న సమయంలో దావోస్‌లో మీరు ఆదానితో చేసుకున్న రూ.12,400 కోట్ల ఒప్పందాల సంగతేమిటి? అదానీకి రాష్ట్రంలోని డిస్కంలను అప్పగించి వాటిని ప్రైవేటీకరించేందుకు మీరు చేస్తున్న కుట్రల మాటేమిటి? 20 వేల మెగావాట్ల థర్మల్ ప్లాంట్ పెడతామనే ప్రతిపాదనతో వస్తే మర్యాదపూర్వకంగా కలిసి చాయ్ తాగించి పంపించేసింది గతంలోని కేసీఆర్ ప్రభుత్వం. కానీ కాంగ్రెస్ ద్వంద్వ ప్రమాణాలు పాటించింది. రాహుల్ గాంధీ ఎవరినయియితే అవినీతి పరుడు అన్నారో ఆ వ్యక్తికే గల్లీలోని కాంగ్రెస్ రెడ్ కార్పెట్ పరిచింది. ఢిల్లీలో రాహుల్ వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఆదానితో రేవంత్ రెడ్డి దోస్తీ చేసి ఒప్పందాలు చేసుకున్నాడు. ఇప్పుడు అదానీ అవినీతి బయటికిరాగానే మాట మార్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదానీతో చేసుకున్న ఒప్పందాలన్నింటినీ రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం’’ అని వెల్లడించారు. అంతేకాకుండా అదానీ వ్యవహారంపై అసెంబ్లీలో చర్చకు ఎంత ప్రయత్నించినా ప్రభుత్వం అంగీకరించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే అదానీతో ఒప్పందాల రద్దుపై సీఎం రేవంత్ స్పష్టతనిచ్చారు.