తెలంగాణకు కొత్త విద్యుత్ పాలసీ.. ప్రకటించిన డిప్యూటీ సీఎం

తెలంగాణ విద్యుత్ శాఖ అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ఆదేశాలిచ్చారు. ఈ సందర్భంగానే ఆయన కీలక ప్రకటన కూడా చేశారు.

Update: 2024-11-18 08:26 GMT

తెలంగాణ విద్యుత్ శాఖ(Telangana Electricity Department) అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) కీలక ఆదేశాలిచ్చారు. ఈ సందర్భంగానే ఆయన కీలక ప్రకటన కూడా చేశారు. అతి త్వరలోనే తెలంగాణలో నూతన విద్యుత్ పాలసీని తీసుకురానున్నట్లు ఆయన వెల్లడించారు. ఇప్పటికే ఈ పాలసీపై కసరత్తులు చేస్తున్నామని, అతి త్వరలోనే ఈ పాలసీపై నిపుణులతో చర్చించి ఫైనల్ చేస్తామని ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిబంధనలను అనుసరించి గ్రీన్ ఎనర్జీ(Green Energy)ని అందించడానికి అన్ని విధాల చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఇందుకోసం సోలార్ ప్లాంట్లు(Solar Plants), విండ్ టర్బైన్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు డిప్యూటీ సీఎం. విద్య, విద్యుత్, వ్యవసాయం.. ఇలా అన్ని రంగాల అభివృద్ధికి తమ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆయన వివరించారు. అన్ని రంగాల్లో తెలంగాణను అగ్రస్థానంలో నిలబెట్టడమే తమ ప్రభుత్వ ధ్యేయమని, ఆ దిశగానే రేవంత్ రెడ్డి(Revanth Reddy) నేతృత్వంలోని ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఆయన చెప్పుకొచ్చారు. ముందు చెప్పినట్లే అన్ని పథకాల విషయంలో పెట్టుకున్న టార్గెట్లను రీచ్ అయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారాయన.

చెప్పినట్లే చేస్తాం..

‘‘2025 మే నాటికి వైటీపీఎస్‌లో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభిస్తాం. 4వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని గ్రిడ్‌కు అనుసంధానిస్తాం. రాష్ట్రవ్యాప్తంగా గృహ, వ్యవసాయ, పారిశ్రామిక అవసరాలకు విద్యుత్ డిమాండ్ పెరుగుతుంది. అధికారిక అంచనాల ప్రకారం 2028-29 నాటికి 24,488 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవసరం. అదే విధంగా 2034-38 నాటికి తెలంగాణకు 35,800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కావాల్సి ఉంది. రాష్ట్ర అవసరాలను దృష్టిలో పెట్టుకుని వాటికి అనుగుణంగానే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించడానికి కసరత్తులు ప్రారంభించాం. 20వేల మెగావాట్ల ఉత్పత్తిని సాధించడానికి అన్ని విధాలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం’’ అని భట్టి విక్రమార్క వివరించారు.

అందరి సలహాల మేరకే..

‘‘విద్యుత్ ఉత్పత్తి విషయంలో అనుకున్న లక్ష్యాలను సాధించడం కోసమే కొత్త విద్యుత్ పాలసీని రూపొందిస్తున్నాం. ఇందు కోసం నిష్ణాతులు, అనుభవజ్ఞల సలహాలతో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. అసెంబ్లీ చర్చలు జరిపి అందరి సహకారంతో ముందుకెళ్లనున్నాం. అతి త్వరలోనే తెలంగాణకు భారీ సంఖ్యలో మల్టీ నేషనల్ సంస్థలు తరలి రానున్నాయి. సదరు సంస్థలకు కావాల్సిన విద్యుత్ అవసరాలకు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తిని సాధించడం కోసం ముందస్తు ప్రణాళికతో ముందుకు పోతున్నాం’’ అని ఆయన వివరించారు.

Tags:    

Similar News