కెటిఆర్ అరాచకాలపై పుస్తకం రాస్తా: మైనంపల్లి
కెటిఆర్ , హరీష్ రావులను అరెస్ట్ చేయాలి;
By : B Srinivasa Chary
Update: 2025-07-19 14:27 GMT
బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అరాచకాలపై తాను పుస్తకం రాస్తానని కాంగ్రెస్ సీనియర్ నేత మైనంపల్లి హన్మంత్ రావు వెల్లడించారు.భార్యాభర్తలను విడదీసిన చరిత్ర కెటిఆర్ ది అని విమర్శించారు. కెటిఆర్ జైలు ఊచలు లెక్క బెట్టే రోజులు దగ్గరపడ్డాయన్నారు. కెటిఆర్, హరీష్ రావులను అరెస్ట్ చేయడానికి రేవంత్ రెడ్డి ఎందుకు ముందుకు రావడం లేదని మైనంపల్లి ప్రశ్నించారు. జర్నలిస్ట్ స్వేచ్చ చనిపోవడానికి కెటిఆర్ మాత్రమే కారణమని ఆయన అన్నారు. గాంధీభవన్ లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
డ్రగ్స్ తీసుకోవడం వల్ల కేటీఆర్ మైండ్ పనిచేయడం లేదని ఎద్దేవా చేశారు. పవర్ లేకపోతే బిఆర్ఎస్ నేతలు బ్రతకలేకపోతున్నారని మైనంపల్లి వ్యాఖ్యానించారు.జర్నలిస్ట్ స్వేచ్ఛ చనిపోవడానికి కేటీఆర్ మాత్రమే కారణం అని ఆయన అన్నారు.