వాట్సాప్ గ్రూపు ఏర్పాటు పై కేరళలో కలకలం.. ఆ గ్రూపు పేరేంటో తెలుసా?
కేరళలో ఉన్నతాధికారులతో కలిసి ఓ మతపరమైన వాట్సాప్ గ్రూపు ఏర్పాటుపై రాష్ట్రంలో కలకలం చెలరేగింది. దీనిపై విచారణ జరిపిన పోలీసులు..
By : The Federal
Update: 2024-11-09 11:16 GMT
కేరళలోని ఓ ఐఏఎస్ అధికారి మతపరమైన వాట్సాప్ గ్రూపు క్రియేట్ చేయడానికి ప్రయత్నించారని ఆరోపణల నేపథ్యంలో రాష్ట్రంలో కలకలం చెలరేగింది. గ్రూపు క్రియేట్ చేయడానికి ప్రయత్నించిన ఐఏఎస్ అధికారి ఫోన్ పూర్తిగా రీసెట్ అయిందని, అందువల్ల అధికారి చెప్పినట్లు ఫోన్ హ్యక్ అయిందో లేదో పూర్తిగా నిర్ధారించలేకపోయామని కేరళ పోలీసులు తెలిపారు.
ఐఏఎస్ అధికారి ఫోన్‌ను హ్యాక్ చేయలేదని పోలీసులను ఉటంకిస్తూ కొన్ని మీడియా కథనాలపై తిరువనంతపురం సిటీ పోలీస్ కమిషనర్ స్పర్జన్ కుమార్ మాట్లాడుతూ.. ఫోన్ రీసెట్ చేయబడింది.. హ్యాక్ అయిందో లేదో తెలియదని అన్నారు. ఈ విషయమై రాష్ట్ర పోలీస్ చీఫ్, డీజీపీ షేక్ దర్వేష్ సాహెబ్‌కు నివేదిక ఇచ్చామని తెలిపారు. నివేదిక గోప్యంగా ఉందని, దానిని రాష్ట్ర ప్రభుత్వానికి పంపుతామని డీజీపీ కార్యాలయం తెలిపింది.
"మల్లు హిందూ ఆఫీసర్స్"..
అక్టోబరు 31న కేరళ కేడర్‌కు చెందిన పలువురు IAS అధికారులను "మల్లూ హిందూ ఆఫీసర్స్" అని పేరుతో చేసిన కొత్త వాట్సాప్ గ్రూప్‌లో చేర్చడంతో వివాదం మొదలైంది. వాట్సాప్ గ్రూప్ క్యాడర్‌లో హిందూ అధికారులను మాత్రమే చేర్చారు. IAS అధికారి కె గోపాలకృష్ణన్ ఫోన్ నంబర్ నుంచి ఈ గ్రూపు క్రియేట్ చేశారు.
అయితే చాలామంది అధికారుల ఇది సరైంది కాదని, ఈ గ్రూపు పై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక రోజు తర్వాత వాట్సాప్ గ్రూప్ తొలగించబడింది, అయితే గోపాలకృష్ణన్ తన ఫోన్ హ్యాక్ చేయబడిందని పేర్కొన్నారు. తన అనుమతి లేకుండా తన పరిచయాలను ఉపయోగించి పలు గ్రూపులు సృష్టించారని ఆరోపించారు. పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఒక్కసారిగా విచారణ ప్రారంభించారు.
ప్రభుత్వ స్టాండ్..
ఈ ఘటనను పరిశీలిస్తామని సోమవారం కేరళ ప్రభుత్వం తెలిపింది. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి పి.రాజీవ ఘటనను "తీవ్రమైనది"గా అభివర్ణించారు. “ప్రభుత్వం ఈ విషయాన్ని పరిశీలిస్తుంది. IAS అధికారులకు సాధారణ ప్రవర్తనా నియమావళి ఉంది, ఇది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగం కింద వస్తుంది.
ప్రస్తుతం పరిస్థితిని పరిశీలిస్తున్నాం. ఏమి చేయాలో సమీక్షించి నిర్ధారిద్దాం” అని ఆయన సోమవారం న్యూఢిల్లీలో విలేకరులతో అన్నారు. అడ్మినిస్ట్రేటివ్, ఇతర ప్రభుత్వ అధికారుల మధ్య వాట్సాప్ గ్రూపులు కొత్తవి కానప్పటికీ, మతపరమైన మార్గాల్లో ఇది అరుదైనదని అధికారులు మీడియాకు తెలిపారు.
ఇంటెలిజెన్స్ విచారణ..
టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం, రాష్ట్ర, కేంద్ర ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఈ అంశంపై దర్యాప్తు చేస్తున్నాయి. గ్రూప్‌లో చేర్చబడిన కొంతమంది అధికారులు దాని గురించి ఏజెన్సీని అప్రమత్తం చేశారని, సాక్ష్యాలను కూడా అందించారని సీనియర్ ఇంటెలిజెన్స్ అధికారి మీడియాకి తెలిపారు.
సీనియర్ IPS అధికారి MR అజిత్ కుమార్‌ను ADGP (లా & ఆర్డర్) పదవి నుంచి తొలగించిన కొన్ని వారాల వ్యవధిలో ఇది జరిగింది. అతను కేరళలోని లెఫ్ట్ నేతృత్వంలోని LDF కూటమి ప్రభుత్వానికి తెలియకుండా సీనియర్ RSS కార్యకర్తలను రహస్యంగా కలుసుకున్నాడని ఆరోపించారు. దీనిపై రోజుల తరబడి వివాదం చెలరేగడంతో ప్రభుత్వం కుమార్‌ను బదిలీ చేయవలసి వచ్చింది, చివరకు ఎల్‌డిఎఫ్ మిత్రపక్షమైన సిపిఐ ఆరోపణలపై కఠినమైన వైఖరిని తీసుకుంది.