‘‘తమిళ్ నుంచి కన్నడ పుట్టిందనడానికి ఆధారాలు లేవు’’

ప్రముఖ భాషా నిపుణులు దేవ సుందరం;

Update: 2025-06-05 12:34 GMT

మహాలింగం పొన్నుస్వామి

కన్నడ భాష, తమిళం నుంచి పుట్టిందని ఇటీవల నటుడు కమల్ హసన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఈ మాటలు తమిళనాడు, కర్ణాటక అంతా భాష చర్చలకు దారితీసింది.

ప్రజాభిప్రాయం ప్రాంతీయంగా విడిపోతున్నందున రెండు భాషల మధ్య సంబంధం గురించి ‘ ది ఫెడరల్’ అనుభవజ్ఞుడైన భాషావేత్త ప్రొఫెసర్ దేవసుందరంతో మాట్లాడింది. భాషా పరిశోధన ఈ విషయం గురించి ఏ తెలియజేస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేసింది.

కన్నడ, తమిళం నుంచి పుట్టిందని కమల్ హసన్ చేసిన ప్రకటన తీవ్ర కలకలం రేపుతోంది. భాషా పరిశోధన ప్రకారం నిజం ఏమిటీ?
భాషాశాస్త్ర విద్యార్థిగా నేను ఓ విషయం స్పష్టం చేయాలి. కన్నడ అనేది తమిళ కుమార్తె కాదు. ఇద్దరు సోదరిమణులు మాత్రమే. వారు పురాతన ఊహాత్మక మూల ద్రావిడ భాష నుంచి ఉద్భవించారు. ఈ మూల భాష తమిళం లేదా కన్నడ కాదు. అది రెండు భాషలను సృష్టించింది. ఆ మూలం నుంచి తమిళం, కన్నడం సహ 25 ద్రావిడ భాషలు పుట్టాయి.
Full View

కన్నడం నుంచి తమిళం నుంచి పుట్టిందని చెప్పడానికి ఎటువంటి ఆధారం లేదు. అయితే తమిళం, కన్నడ భాష సోదరీమణులు అని చెప్పడానికి మాత్రం అనేక ఆధారాలు ఉన్నాయి. ఇప్పటిదాకా దొరికిన ఆధారాలకు అనేక సారూప్యతలు, సజాతీయాలు ఉన్నాయి.
కానీ కొందరు తమిళం అన్ని ద్రావిడ భాషలలో అత్యంత పురాతనమైనదని వాదిస్తారు. అది నిజమేనా?
కచ్చితంగా అది నిజమే. భారతీయ భాషలలోనే అత్యంత పురాతన భాష. శతాబ్ధాలుగా సాహిత్యం, వ్యాకరణం ద్వారా ఇది నిరంతరం ప్రవహిస్తోంది. ఇప్పటికే అనేక ఆధారాలు ఉన్నాయి. అందుకని కన్నడ, ఇతర ద్రావిడ భాషలు తమిళం నుంచి పుట్టాయని చెప్పడం తప్పు. దీనికి స్ఫష్టమైన ఆధారాలు లేకుండా భాష ఆ విధంగా అభివృద్ది చెందదు.
భాషా వంశపారంపర్యతను నిరూపించడానికి ఏ పద్దతులు ఉపయోగిస్తారు?
మేము తులనాత్మక భాషాశాస్త్రం, భాషా టైపోలాజీని ఉపయోగిస్తాము. ఈ పద్దతులు సారూప్యతలు, తేడాలను కాగ్నేట్ లు, వ్యాకరణ నిర్మాణాల ద్వారా విశ్లేషిస్తాయి. కానీ భాషా ఆధారాలు మాత్రమే సరిపోవు. అటువంటి వంశాన్ని స్థాపించడంలో మానవ శాస్త్రం, పురావస్తుశాస్త్రం, జన్యుశాస్త్రం, జీవ శాస్త్రం కూడా ముఖ్యపాత్ర పోషిస్తాయి.
బలమైన అనేక రకాల ఆధారాలు లభించే వరకూ తమిళం నుంచి కన్నడ పుట్టిందని చెప్పలేము. అకారణంగా చేసే ఇటువంటి ప్రకటనలు కన్నడ భాష మాట్లాడేవారి మనోభావాలను దెబ్బతీస్తాయి.
తమిళం, కన్నడ వేర్వేరు భాషలు అనే వాదనపై మీ అభిప్రాయం..?
అవును అది నిజమే. ప్రస్తుత రాజకీయ, సామాజిక సాంస్కృతిక సందర్భంలో తమిళం, కన్నడ వేర్వేరు అస్థిత్వాలకు సూచిస్తూ ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. భాష జాతీయతకు అత్యంత ముఖ్యమైన గుర్తు.
కాబట్టి ఎవరైన కన్నడను తమిళ కుమార్తె, తమిళం నుంచే కన్నడ పుట్టిందని మాట్లాడితే అది వారి గుర్తింపును దెబ్బతీస్తుంది. అందుకే ఈ చర్చను జాగ్రత్తగా సంప్రదించాలి. ఆధార సహితంగా మాట్లాడాలి.


Tags:    

Similar News