ఆ ఇంట్లో 80 మంది.. రాహుల్ చెప్పింది అబద్దమా?
మహదేవపురం ఇంటిని సందర్శించిన ఫెడరల్ టీమ్..;
By : The Federal
Update: 2025-08-09 06:15 GMT
ప్రభుస్వామి నటేకర్
దేశంలో ఎన్నికల ప్రక్రియలో ఓట్ల చోరీ జరుగుతుందని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించిన సంగతి తెలిసిందే. మహదేవపుర నియోజకవర్గంలో ఒకే ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారని ఆయన ప్రెస్ మీట్ పెట్టారు.
ఇది దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. ఫెడరల్ కర్ణాటక బృందం రాహుల్ గాంధీ పేర్కొన్న చిరునామాను సందర్శించింది. ఇంటి నెంబర్ 35, మునిరెడ్డి గార్డెన్స్, బెల్లందూర్ కు వెళ్లి వాస్తవాలను వెలికితీసింది.
బెల్లందూర్ సందడిగా ఉండే టెక్ కారిడార్. ఇక్కడికి కొంచెం దూరంలో మునిరెడ్డిగార్డెన్ ఉంది. ఇది 10X15 అడుగుల రేకుల పైకప్పు గల ఇళ్ల వరుస ఉంది. ఈ నివాసం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వేలాది మంది వలస కార్మికులు నివసిస్తూ ఉంటారు. ఈ ఇళ్లలో 35 వ నంబర్ ఇప్పుడు జాతీయ స్థాయి వివాదానికి కేంద్రంగా మారింది.
ఇక్కడ గమనించిన విషయాలు ఏంటంటే..
‘ది ఫెడరల్’ కర్ణాటక టీమ్ అక్కడికి చేరుకున్నప్పుడూ అప్పటికే అక్కడ మీడియా ప్రతినిధులతో నిండిపోయి కనిపించింది. స్థానికులు అంతా ఆసక్తిగా, అనుమానాస్పద చూపులు చూస్తున్నారు. వీరందరికి మధ్యలో బెంగాల్ కు చెందిన దీపక్ అనే యువకుడు, తన భార్య, కొడుకుతో ఆందోళనతో నిలుచున్నాడు.
దీపక్ కేవలం ఒక నెల క్రితమే ఈ ఇంటికి అద్దెకి వచ్చాడు. ప్రస్తుతం అతను స్విగ్గీ డెలవరీ బాయ్ పనిచేస్తున్నాడు. పశ్చిమ బెంగాల్ లో కంప్యూటర్ రిపేర్ షాపు నడిపేవాడు. కానీ నష్టాలు చవిచూసిన తరువాత జీవనోపాధి కోసం బెంగళూర్ కు వలస వచ్చాడు. కానీ అతను అద్దెకు తీసుకున్న ఇల్లు జాతీయ వివాదానికి కేంద్రంగా మారుతుందని అతను ఎప్పుడూ ఊహించలేదు.
వాళ్లు నన్ను నేరస్థుడిలా చూస్తున్నారు..
దీపక్ ‘ది ఫెడరల్ కర్ణాటక’తో మాట్లాడుతూ.. తన బాధను పంచుకున్నాడు. ‘‘గత రెండు రోజులుగా మా జీవితం నరకంలా ఉంది. ఇంటిపక్కనున్న వారు మమ్మల్ని నేరస్థులా చూస్తున్నారు. మా ఇంట్లో 80 మంది ఉన్నారని మేము విన్నాము.
మీరు చట్టవిరుద్దమైన పని చేస్తున్నారా? అని వారు అడుగుతున్నారు వారు నా కొడుకును వారి ఆటల్లో భాగస్వామి కానివ్వడం లేదు. ఈ వార్త నన్ను నా భవిష్యత్ గురించి ఆందోళనల్లో ముంచెత్తింది.
ఇంటి యజమాని మమ్మల్ని ఖాళీ చేయమని అడిగితే.. మేము ఎక్కడికి వెళ్తాము? మీడియా నివేదికలకు నాకు సంబంధం లేదు. నా ఓటర్ ఐడీ బెంగళూర్ నుంచి కాదు.. బెంగాల్ నుంచి వచ్చింది’’ అన్నారు.
ఇంటి యజమాని రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను ఖండించారు. ఇది 35 ఇళ్ల సముదాయం కాదని అన్నారు. ‘‘ ఇవన్నీ 10X15 చిన్న ఇళ్లు, ఇక్కడ నివసించే వారు మొత్తం ఉత్తర భారతం నుంచి వచ్చిన వాళ్లే. రోజువారీ వేతనాలు సంపాదించే పేద వలస కార్మికులు.
ఇంత చిన్న ఇంట్లో 80 మంది ఎలా జీవించగలరు? ఇది అబద్దం. అద్దెదారులు మూడు నుంచి నాలుగు నెలలు ఇక్కడ ఉండి.. వేరే పని దొరికినప్పుడూ వెళ్లిపోతారు. కానీ వారు తమ ఓటర్ ఐడీ చిరునామాలను మార్చుకోరు.
అందుకే బహుశా గతంలో అద్దెకు తీసుకున్న వారి పేర్లు జాబితాలో ఉండి ఉండవచ్చు. దీనిపై ఎలాంటి దర్యాప్తునైనా ఎదుర్కోవడానికి నేను సిద్దంగా ఉన్నాను’’ అని జయరామ్ రెడ్డి అన్నారు.
నేను బీజేపీకి ఓటు వేస్తాను..
మీరు బీజేపీకి నాయకులా అని అడిగినప్పుడూ.. నేను బీజేపీకి ఓటు వేస్తాను. కానీ పార్టీ తరఫున ప్రచారం చేయలేదని ఆయన చెప్పారు. ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయంలోని కొన్ని సోర్స్ లు .. ఈ చిరునామాకు 80 పేర్లు లింక్ చేయబడ్డాయని ధృవీకరించారు.
కానీ వీరంతా అక్కడ నివసిస్తున్నారని, లేదా ఓటు వేస్తున్నారని దీని అర్థం కాదని నొక్కి చెప్పారు. అధికారులు పాత రికార్డులు దీనికి కారణమని వివరించారు. త్వరలో అలాంటి వాటిని తొలగిస్తామని చెప్పారు.
స్థానిక కాంగ్రెస్ నాయకుడు భైలా మూర్తి మాట్లాడుతూ.. దీనిని బీజేపీ చేసిన క్రమబద్దమైన మోసం అన్నారు. ఎన్నికల సంఘం వివరణను తోసిపుచ్చారు.
చివరగా ఫెడరల్ టీమ్ ఎం కనుగొందంటే..
ఓటరు జాబితాలోని చిరునామాలో 80 పేర్లు ఉన్నాయి. కానీ చాలా మంది తమ రికార్డులను మార్చుకోకుండానే వేరే ప్రాంతానికి వెళ్లిపోయిన అద్దెదారులని తేలింది. ప్రస్తుతం ఆ ఇంట్లో 80 మంది నివసిస్తున్న ఆధారాలు లేవు.