శివమొగ్గలో ట్రయాంగిల్ ఫైట్: మాజీ సీఎం కొడుకు వర్సెస్ మాజీ సీఎం కూతురు

కన్నడ నాట లోక్ సభ ఎన్నికల రాజకీయాలు వేడెక్కాయి. కొన్నిచోట్ల ముక్కోణపు పోటీ ఉంది. ముఖ్యంగా శివమొగ్గలో మాజీ సీఎం కుటుంబాలతో, మాజీ సీఎం పోటీపడుతున్నారు.;

Update: 2024-03-20 11:48 GMT

శివమొగ్గ లోక్ సభ నియోజకవర్గం పోరు రసవత్తరంగా సాగనుంది. ఈ సీటులో ప్రస్తుతం బీవై రాఘవేంద్ర బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు. ఆయన మాజీ సీఎం యడియూరప్ప కుమారుడు. ప్రత్యర్థిగా పోటీ చేసేది కన్నడ స్టార్ నటుడు శివరాజ్ కుమార్ భార్య, గీతా శివరాజ్ కుమార్ పోటీ చేస్తున్నారు.

ఆమెకి కన్నడ సినీ పరిశ్రమ కూడా మద్ధతు ప్రకటించింది. గీత కూడా మాజీ సీఎం, ఎస్ బంగారప్ప కూతురు కూడా.. దీంతో తమ గెలుపు సునాయాసం అనుకున్న కమలందళంలో ఇప్పుడు కంగారు మొదలైంది. దీనిని బీజేపీ నాయకులు కూడా అంగీకరించారు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే బీజేపీ సీనియర్ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి కేఎస్ ఈశ్వరప్ప కూడా శివ మొగ్గ బరిలో దిగుతున్నానని ప్రకటించాడు.

రాజకీయాలు మగ మహారాజులకేనా.. మగువలకు కాదా?
ప్రముఖ నిర్మాత, కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (కెఎఫ్‌సిసి) అధ్యక్షుడు ఎన్‌ఎం సురేష్ చెబుతున్న దాని ప్రకారం, కన్నడ నిర్మాతలు, పంపిణీదారులు, ఎగ్జిబిటర్లు, కళాకారులు, దర్శకులు గీతకు మద్దతుగా ప్రచారం చేస్తారు. ప్రముఖ కన్నడ నటుడు, దివంగత రాజ్‌కుమార్ కుటుంబం రాజకీయాలకు దూరంగా ఉండగా, గీతా శివరాజ్‌కుమార్ 2014లో జనతాదళ్ (ఎస్) టికెట్‌పై బీఎస్‌వై పై పోటీ చేసి భారీ తేడాతో ఓడిపోయారు.
గీత భర్త, దివంగత రాజ్‌కుమార్ కుమారుడు శివరాజ్‌కుమార్, కన్నడ సినిమా తన భార్యకు బేషరతుగా మద్దతు ప్రకటించడం గర్వంగా ఉందన్నారు. "ఆమెకు నా పూర్తి మద్దతు కూడా ఉంది," అని వెల్లడించారు.
“అప్పాజీ (తండ్రి) రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ, ఆయన ఎప్పుడూ రాజకీయాలను తృణీకరించలేదు. అందుకే గీతను కోడలిగా చేసుకున్నాడు. రాజకీయం గీత రక్తంలోనే ఉంది. ఆమె తన తండ్రి నుంచి రాజకీయాలను వారసత్వంగా పొందింది. రాజకీయాలు కేవలం పురుషుల కోసం మాత్రమే కాదు; విధానపరమైన అంశాల్లో మహిళలు తమ అభిప్రాయాన్ని కూడా చెప్పాలి, ” అని శివరాజ్ కుమార్ అభిప్రాయపడ్డారు.
“ఎన్నికల రాజకీయాల్లోకి దిగడంపై నాకు ఎలాంటి భయం లేదు. ఎవరినైనా ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోగలను. నేను విజయం సాధించి, శివమొగ్గ, కన్నడ సినీ పరిశ్రమ సమస్యల పరిష్కారం కోసం పార్లమెంటులో గళం విప్పుతానన్న నమ్మకం నాకుంది” అని గీతా శివరాజ్ కుమార్ అన్నారు.
నటుడు శివరాజ్‌కుమార్ తన భార్యతో కలిసి కొల్లూరు మూకాంబిక ఆలయంలో పూజలు చేయనున్నారు. అనంతరం ర్యాలీలో ప్రసంగించనున్నారు. గీత సోదరుడు, కర్ణాటక మంత్రి మధు బంగారప్ప ఆమె ప్రచార కార్యక్రమాన్ని రూపొందించారు.
గీత వివిధ ప్రాంతాల్లో 300కు పైగా సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్నారు. ఆమె తండ్రి బంగారప్ప ఇలాగే ప్రచారం చేసేవారు’’ అని శివమొగ్గకు చెందిన ఓ సోషలిస్టు నాయకుడు గుర్తు చేసుకున్నారు.
ముక్కోణపు పోటీ



 


యడియూరప్ప "వంశపారంపర్య రాజకీయాలను" వ్యతిరేకించడానికి ఈశ్వరప్ప స్వతంత్ర అభ్యర్థిగా దిగాడ. దీంతో పోటీ రాఘవేంద్ర, గీతల మధ్య నేరుగా కాకుండా ముక్కోణపు పోరుగా మారిపోయింది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) ఒత్తిడి ఉన్నప్పటికీ కర్ణాటకలో ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభకు హాజరు కావడానికి ఈశ్వరప్ప నిరాకరించారు. దాదాపు మూడు దశాబ్దాలుగా బంగారప్ప, యడియూరప్ప కుటుంబాలు శివమొగ్గలో రాజకీయాలను శాసించాయి.
శివమొగ్గ నియోజకవర్గం
బంగారప్ప 1996లో తొలిసారిగా లోక్‌సభకు ఎన్నికయ్యారు, ఆ తర్వాత 1999లో కాంగ్రెస్ టిక్కెట్‌పై ఎన్నికయ్యారు. బీజేపీలో చేరిన తర్వాత 2004లో ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. తర్వాత 2005లో జరిగిన ఉప ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు.
2009 నుంచి ఆ సీటు యడ్యూరప్ప కుటుంబం ఆధీనంలోనే ఉంది. రాఘవేంద్ర, 2009లో తన మొదటి లోక్‌సభ ఎన్నికల్లో గీత తండ్రి బంగారప్పను ఓడించారు. శివమొగ్గలో ఇప్పుడు ఇద్దరు మాజీ ముఖ్యమంత్రుల పిల్లలు - "వంశపారంపర్య రాజకీయాలను" వ్యతిరేకించే వ్యక్తి మధ్య పోటీ కనిపిస్తుంది.
Tags:    

Similar News