ప్రజ్వల్ రేవణ్ణ కేసులో ఊహించని ట్విస్ట్..
కర్నాటకను తీవ్రంగా కుదిపేస్తున్న సెక్స్ స్కాండల్ కేసు కీలక మలుపు తిరిగింది. జాతీయ మహిళా కమిషన్ ను ఓ మహిళా సంప్రదించి కొన్ని కీలక విషయాలు వెల్లడించిందని..
By : The Federal
Update: 2024-05-10 06:43 GMT
కర్ణాటకలో జెడిఎస్ సిట్టింగ్ ఎంపి ప్రజ్వల్ రేవణ్ణపై నమోదైన లైంగిక వేధింపుల కేసు కొత్త మలుపు తిరిగింది. ప్రజ్వల్ పై కేసు ఫైల్ చేయించిన కొంతమంది మహిళలు తమతో మాట్లాడారని, అందులో ఒక మహిళా తనతో బలవంతంగా ఫిర్యాదు చేయించారని చెప్పినట్లు జాతీయా మహిళా కమిషన్ వెల్లడించింది. తను బెదిరింపులు ఎదుర్కొన్న తరువాత బలవంతంగా ఫిర్యాదు చేయవలసి వచ్చిందని సదరు మహిళా అంగీకరించారని సమాచారం.
“ఒక మహిళ సివిల్ దుస్తులు ధరించిన ముగ్గురు వ్యక్తులపై ఫిర్యాదు చేయడానికి NCWని సంప్రదించింది. వారు తమను కర్ణాటక పోలీసులుగా పరిచయం చేసుకున్నారని ఆమె పేర్కొంది. నిందితులపై ఫిర్యాదు చేయాలని తనకు తెలియని నంబర్ల నుంచి చాలా కాల్స్ వచ్చాయని ఆమె ఫిర్యాదు చేసింది. కొంతమంది వ్యక్తుల బెదిరింపులు తట్టుకోలేకే ఫిర్యాదు చేసినట్లు వెలుగులోకి వచ్చింది” అని NCW పేర్కొంది.
NCW would like to state that 700 women have not given any complaints to NCW regarding Prajjawal Revanna case. Some media channels are falsely reporting this.
— NCW (@NCWIndia) May 9, 2024
ప్రజ్వల్ రేవణ్ణపై 700 మంది మహిళలు కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్లు వచ్చిన వార్తలను కూడా NCW తోసిపుచ్చింది. ఒక X పోస్ట్‌లో, NCW అధికారిక హ్యాండిల్ లో ఇలా రాసుకొచ్చింది, “ప్రజ్వల్ రేవణ్ణ కేసుకు సంబంధించి 700 మంది మహిళలు NCWకి ఎటువంటి ఫిర్యాదులు చేయలేదని NCW స్పష్టం చేయాలని అనుకుంటోంది.కొన్ని మీడియా ఛానళ్లు ఈ విషయాన్ని తప్పుడు ప్రచారం చేస్తున్నాయని పేర్కొంది.
సిట్‌పై కుమారస్వామి ఆగ్రహం..
కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి సిట్ దర్యాప్తుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజ్వల్ రేవణ్ణపై కేసులు పెట్టకపోతే వ్యభిచారం కేసు పెడతామని కొంతమంది మహిళలను పోలీసులు బెదిరించారని ఆరోపించారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా ప్రకటనలు చేయించేలా మహిళలపై పోలీసులు ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు.
''విచారణ అధికారులు బాధితుల ఇంటి వద్దకు వెళ్లి బెదిరిస్తున్నారు. సిట్ అధికారులు బాధితులపై వ్యభిచారం కేసులు పెడతామని బెదిరించడం వాస్తవం కాదా చెప్పండి? అని రెవెన్యూ మంత్రి కృష్ణ బైరేగౌడను ఆయన ప్రశ్నించారు. ఈయనే ఇంతకుముందు ఈ సంఘటనలు ప్రపంచంలోనే అతిపెద్ద సెక్స్ స్కాండల్ గా అభివర్ణించారు.
“కిడ్నాప్‌కు గురైన మహిళను మీరు ఎక్కడ ఉంచారు? ఆమెను కోర్టు ముందు ఎందుకు హాజరుపరచడం లేదు? బాధితుల ప్రైవేట్ వీడియోలను పబ్లిక్ చేయడాన్ని మీరు సమర్థించారా” అని గౌడను ప్రశ్నించారు. అయితే ప్రజ్వల్ రేవణ్ణను మాత్రం సమర్ధించే ప్రశ్నే లేదన్నారు. ప్రతి ఒక్కరూ చట్టాన్ని గౌరవించాలని, దోషులను శిక్షించాలని ఆయన అన్నారు. హెచ్‌డి దేవెగౌడకు నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. మాకు మా స్వంత వ్యాపారాలు, కుటుంబాలు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే నేను హాసన్‌కు వెళ్లానన్నారు.
సిట్ దర్యాప్తును సమర్థించిన మంత్రి
కాగా, సిట్ దర్యాప్తు సమర్ధవంతంగా సాగుతోందని కర్ణాటక హోంమంత్రి జి.పరమేశ్వర అన్నారు. జేడీఎస్ చేస్తున్న ఆరోపణలన్నింటికీ రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు.
హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ, జెడి-ఎస్ ఎమ్మెల్యే హెచ్‌డి రేవణ్ణ కుమారుడు, తన కొడుకు ప్రమేయం ఉన్న లైంగిక కుంభకోణం బాధితురాలి కిడ్నాప్‌లో కీలక పాత్ర పోషించినందుకు అరెస్టయ్యారు.