AI-జనరేటెడ్ వీడియోపై తమిళనాట రాజకీయ దుమారం..

TVK చీఫ్ విజయ్ విడుదల చేసినట్లుగా సమాచారం..;

Update: 2025-09-16 11:32 GMT
Click the Play button to listen to article

తమిళనాడు(Tamil Nadu)లో ఏఐ-జనరేటెడ్ వీడియో ఒకటి తెగ వైరలవుతుంది. తమిళనాడులోని అధికార డీఎంకే(DMK)ను లక్ష్యంగా చేసుకుని తమిళగ వెట్రీ కజగం (TVK) చీఫ్ విజయ్(Vijay) విడుదల చేసినట్లు సమాచారం. ఈ వీడియోలో డీఎంకే వ్యవస్థాపకుడు సీఎన్ అన్నాదురై విజయ్‌ను ప్రశంసిస్తూ.. డీఎంకేను విమర్శిస్తున్నట్లు చూపించారు. సోషల్ మీడియాలో ట్రైండింగ్‌లో ఉన్న ఈ వీడియోపై ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని పార్టీ ఇంకా స్పందించలేదు.

రెండు నిమిషాల 32 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో అన్నాదురై(Annadurai).. తాను స్థాపించిన పార్టీ DMKని విమర్శిస్తూ, విజయ్ నాయకత్వాన్ని సమర్థిస్తున్నట్లుగా ఉంది. విజయ్ చిన్నప్పటి నుంచి చేసిన ప్రయాణాన్ని AI-అన్నాదురై ప్రశంసిస్తూ.. పెరియార్‌గా ప్రసిద్ధి చెందిన సామాజిక సంస్కర్త EV రామసామి ఆదర్శాలతో ఆయన ఆదర్శాలను అనుసంధానిస్తున్నట్లు చిత్రీకరించారు. "నాలాగే ముఖ్యమంత్రిగా ఎదిగిన సాధారణ వ్యక్తి.. మీరు కూడా కష్టపడి పైకి వచ్చారు" అని చివరన AI వాయిస్ చెబుతోంది.


డీఎంకేకు ఎదురుదెబ్బ..

డీఎంకే ప్రతినిధి ఎ శరవణన్ ఈ వీడియోను "డీప్ ఫేక్, "రాజకీయ స్వలాభం కోసం ప్రయోగించిన చౌకైన వ్యూహం"గా అభివర్ణించారు. రాజకీయాల్లో AI దుర్వినియోగం వల్ల ప్రజలు తప్పుదారి పట్టరని కూడా చెప్పారు.

తమిళులపై బలవంతంగా హిందీ భాషను రుద్దడం, మద్యం అమ్మకాలు వంటి వివాదాస్పద అంశాలను కూడా AI-అన్నాదురై ప్రస్తావించారు. ప్రస్తుత DMK దాని వ్యవస్థాపక విలువల నుంచి వైదొలిగిందని నొక్కి చెప్పారు. నిజమైన అన్నాదురై 1967లో తన పదవీకాలంలో మద్య నిషేధాన్ని అమలు చేశారు. ఈ వీడియో రాష్ట్ర ప్రస్తుత ఆదాయ నమూనా మద్యం అమ్మకాలను విమర్శిస్తుంది.

ఆసక్తికరంగా.. ఆ వీడియోలో AIADMK గురించి ప్రస్తావించలేదు. ఉన్నత రాజకీయ వ్యక్తికి AI టెక్నాలజీతో ప్రచార సందేశాలకు వాడుకోవడం తమిళ రాజకీయాల్లో కొత్త మలుపును సూచిస్తుంది. 

Tags:    

Similar News