లాకప్ డెత్ లపై దోషులకు శిక్ష ఎందుకు పడట్లేదు?

దక్షిణాదిలో క్రూరంగా వ్యవహరిస్తున్నది తమిళనాడు పోలీసులే అంటున్న గణాంకాలు;

Update: 2025-07-02 07:09 GMT
లాకప్ డెత్ అయిన అజిత్ కుమార్

మహాలింగం పొన్నుస్వామి

తమిళనాడును లాకప్ డెత్ మరణాలు చాలాకాలం నుంచి వేధిస్తున్నాయి. ఇవి చట్టంలోని లోపాలను తరుచుగా బహిర్గతం చేస్తున్నాయి. కస్టోడియల్ మరణాలను సాధారణంగా లాకప్ డెత్ లుగా పిలుస్తారు.

రాష్ట్రంలోని ఓ గుడిలో దొంగతనం కేసులో అదుపులోకి తీసుకున్నఆలయ సెక్యురిటీ గార్డు అజిత్ కుమార్ ను పోలీసులు చిత్రవధ చేయడంతో మరణించడంతో మరోసారి ఈ విషయం చర్చకు వచ్చింది.

అనుమానితుల పట్ల పోలీసులు మానసికంగా శారీరకంగా హింసించడం సాధారణంగా మారిపోయింది. పోలీసులు పగపట్టినట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.

ఇలాంటి లాకప్ డెత్ లు గర్హనీయమైనవి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ను ఇవి తీవ్రంగా ఉల్లంఘిస్తున్నాయి. ప్రాథమిక హక్కులను కాలరాసే ఇలాంటి చర్యలు శిక్షార్హమైనవి.
తమిళనాడు చెత్త రికార్డు..
లోక్ సభ డేటా ప్రకారం.. 2017 ఫిబ్రవరి 28 నుంచి 2022 మధ్య తమిళనాడులో మొత్తం 478 కస్టడీ మరణాలు సంభవించాయి. ఇది దక్షిణ భారతంలోనే అత్యధికం. తరువాత ఆంధ్రప్రదేశ్ 244, కేరళ 235, తెలంగాణ 128, కర్ణాటక 58 ఉన్నాయి. ఈ గణాంకాల ప్రకారం చూస్తే తమిళనాడులో ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయి. ఇది తమిళనాడు పోలీస్ లు వ్యవస్థాగత సంస్కరణల అవసరాన్ని నొక్కి చెబుతోంది.
దేశవ్యాపంగా 286 కస్టడీ మరణాలపై న్యాయ విచారణకు ఆదేశించబడ్డాయి. ఇవన్నీ కూడా 2017-21 మధ్య జరిగినవి. అయితే దీంట్లో ఎవరూ దోషులుగా తేలలేదని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తెలిపింది.
సాతంకుళం కేసు..
ఈ కాలంలో తమిళనాడులో 39 న్యాయ విచారణలు జరిగాయి. కానీ చాలా కేసుల్లో ఎటువంటి అభియోగాలు నమోదు కాలేదు. ఇది జవాబుదారితనం గురించి తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది.
అదేవిధంగా ఈ కాలంలో భారత్ లో పోలీస్ సిబ్బందిపై చట్టవిరుద్దమైన అరెస్ట్ లు, హింస లేదా గాయాలకు సంబంధించిన 25 మానవ హక్కుల ఉల్లంఘన కేసులు మాత్రమే నమోదు చేశారు.
కేవలం 16 మంది అధికారులపై మాత్రమే అభియోగాలు మోపారు. 15 మందిని అరెస్ట్ చేశారు. దీనిలో ముగ్గురు మాత్రమే దోషులుగా నిర్ధారణ అయింది.
ఒక మైలురాయి తీర్పు..
ఇటీవల కస్టడీ మరణంపై కోర్టు సంచలనమైన తీర్పు ఇచ్చింది. 1999 లో కస్టడీ మరణంపై శ్రీ వైకుంటం డిప్యూటీ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ తో సహ తొమ్మిది మందికి జీవిత ఖైదీ విధించింది. కార్మికుడు సి విన్సెంట్ ను పోలీసులు అదుపులోకి తీసుకోగా మరుసటి రోజు తలముత్తు నగర్ పోలీస్ స్టేషన్ లో లాకప్ లో మరణించాడు.
అయితే 26 సంవత్సరాల పాటు సాగిన విచారణలో మొదటిసారిగా ఓ కేసు నిర్దారణ జరిగింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 22 పౌరులను చట్టవిరుద్దమైన నిర్భందం నుంచి రక్షణ కల్పిస్తుంది. ఖైదీల భద్రత బాధ్యతను న్యాయ వ్యవస్థ పై నిలిపింది. అయితే సీనియర్ న్యాయవాదీ శంకర్ ప్రకారం.. ఆచరణలో రక్షణ చాలా అరుదుగా ప్రజలకు చేరుతుందని పేర్కొన్నారు.
హ్యూమన్ రైట్స్ కు పరిమిత అధికారులు..
తమిళనాడు ప్రభుత్వం ప్రకటించిన విధంగా జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్ హెచ్ ఆర్ సీ) కస్టడీ మరణాలు, ఎన్ కౌంటర్ లు, లైంగిక వేధింపులు, శారీరక గాయాలకు పరిహారం రూ.5 లక్షల నుంచి రూ. 7.5 లక్షలకు పెంచింది. అలాగే పోలీస్ క్రూరత్వం కారణంగా నష్టపోయిన బాధితులకు అందించే పరిహారం రూ. 1 నుంచి రూ. 3 లక్షలకు పెంచారు.
మానవ హక్కుల కార్యకర్త ఎవిడెన్స్ కథిర్ ప్రకారం.. ఎన్ హెచ్ ఆర్ సీకి పరిమిత అధికారులు ఉన్నాయన్నారు. ఇది కేవలం రాష్ట్ర ప్రభుత్వాలకు సిఫార్సు మాత్రమే చేయగలదు. కానీ ప్రభుత్వాలు తరుచుగా వీటిని పట్టించుకోదు.
ఈ వ్యవస్థకు అమలు చేయదగ్గ అధికారాలు లేకపోవడంతో కస్టడీ మరణాలు వంటి తీవ్రమైన నేరాలు శిక్షించకుండా పోతున్నాయి. న్యాయ వ్యవస్థ విధానాలు, కేసు విచారణలో దీర్ఘకాలిక జాప్యం బాధితులకు న్యాయం జరగకుండా నిరాకరిస్తున్నాయి.
మార్పులు అవసరం..
ఈ అంశం పై సీనియర్ న్యాయవాదీ ఎలంగోవన్ మాట్లాడుతూ.. వ్యవస్థలోని ఈ లోపాలపై సమగ్ర పరిశీలన అవసరం అన్నారు. ‘‘కస్టోడియల్ మరణాలు న్యాయ వ్యవస్థ వైఫల్యాన్ని ఎత్తిచూపుతున్నాయి.
పోలీసులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా కోర్టులు పర్యవేక్షించాలి. లాకప్ లో వైద్య సేవలకు హమీ ఇవ్వాలి. దుర్వినియోగాలను నివేదించడానికి బలమైన వ్యవస్థను తీసుకురావాలి. దర్యాప్తును నిర్ణీత సమయాల్లో ముగించాలి. ఖైదీల భద్రతకు రాష్ట్రం పూర్తి బాధ్యత తీసుకోవాలి.
చట్టం ప్రకారం నిర్భంధించబడిన లేదా అరెస్ట్ చేయబడిన ఎవరికైనా చట్టపరమైన ప్రాతినిధ్యం పొందే హక్కు ఉంటుంది. స్వీయ నేరారోపణ రాజ్యాంగ విరుద్దం. అయినప్పటికీ తమిళనాడులో మార్పులు జరగలేదు.
పోలీసుల థర్డ్ డిగ్రీ ప్రయోగించడం మానట్లేదు. ఖైదీలు చాలా అరుదుగా న్యాయవాదులను ఆశ్రయిస్తారు. ఖైదీలు విరిగిన చేతులు, గాయాలతో కనిపించినప్పుడూ ఎంతమంది న్యాయమూర్తులు పోలీసులను ప్రశ్నిస్తారు? అని ఆయన చెప్పారు.
ప్రభుత్వానికి ఏం అవుతుంది..
పరిపాలనా సంస్కరణలు లేకుండా కస్టడీ మరణాలు, పోలీసుల దౌర్జన్యాలను పరిష్కరించడానికి ఉద్యోగాలు, ఆర్థిక సాయం అందజేస్తామని తమిళనాడు ప్రభుత్వం ఇచ్చిన హమీలు సరిపోవని ఎలంగోవన్ అన్నారు.
‘‘అజిత్ కుమార్ కేసులో పోలీసు ఎఫ్ఐఆర్ లో అతను మూర్చవల్ల చనిపోయాడని పేర్కొంది. కానీ పోస్ట్ మార్టంలో చిత్రహింసల కారణంగా మరణించాడని తేలింది. పోలీసులపై చర్య తీసుకున్నారు.
కానీ ప్రభుత్వ కోర్టులో దీనిని సరిగా నిర్వహించడంలో విఫలం అయింది. రాజకీయ జోక్యం లేకుండా ఇటువంటి కేసులు పరిష్కరించినప్పుడే వ్యవస్థ మారుతుంది’’ అని ఆయన నొక్కి చెప్పారు.
Tags:    

Similar News