కరూర్ తొక్కిసలాటపై S.I.T విచారణను TVK ఎందుకు వ్యతిరేకిస్తుంది?

పార్టీ చీఫ్ విజయ్ కోరుకుంటున్న ఏమిటి?

Update: 2025-10-08 13:05 GMT
Click the Play button to listen to article

తమిళ(Tamil Nadu) సూపర్ స్టార్ జోసెఫ్ విజయ్(Vijay) నేతృత్వంలోని కొత్త రాజకీయ పార్టీ తమిళగ వెట్రీ కజగం (TVK) సుప్రీంకోర్టు(Supreme Court)ను ఆశ్రయించింది. ప్రచార సభ సందర్భంగా కరూర్ జిల్లాలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. మరో 60 మందికి పైగా గాయపడ్డారు.


‘న్యాయమూర్తి వ్యాఖ్యలే కారణమా?’

ఈ దుర్ఘటనపై మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సెంథిల్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "ఇది ఎలాంటి రాజకీయ పార్టీ?" అని వ్యాఖ్యానించారు. " దుర్ఘటన తర్వాత పార్టీ నాయకులంతా కరూర్(Karoor) నుంచి పారిపోయారు. ఎవరూ బాధ్యత తీసుకోలేదు. దీన్ని కోర్టు తీవ్రంగా పరిగణిస్తుంది’’ అని మండిపడ్డారు. సెప్టెంబర్ 27న జరిగిన ఈ ఘటనపై దర్యాప్తు చేయడానికి ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేయాలని స్టాలిన్ ప్రభుత్వాన్ని న్యాయమూర్తి ఆదేశించారు. అదే సందర్భంలో జాతీయ, రాష్ట్ర రహదారుల వెంట రాజకీయ ర్యాలీలు, రోడ్‌షోలు నిర్వహించరాదని పేర్కొంది. బలమైన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ రూపొందించే వరకు ర్యాలీలకు అనుమతించవద్దని పోలీసులకు సూచించింది.


సుప్రీంకోర్టులో టీవీకే పిటిషన్..

హైకోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యల నేపథ్యం ఒక కారణం కాగా.. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేసే SIT దర్యాప్తుతో తమకు న్యాయం జరగదన్న ఆలోచనకు వచ్చిన TVK సుప్రీంకోర్టు తలుపుతట్టింది. రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో కేసు దర్యాప్తు చేయించాలని పిటీషన్‌లో కోరింది.


అక్టోబర్ 10న విచారణ..

స్థానిక పోలీసుల దర్యాప్తుపై నమ్మకం లేదని వాదిస్తూ..14 ఏళ్ల బాధితురాలి తండ్రి కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI)తో విచారణ జరిపించాలని సుప్రీంకోర్టుకు అప్పీల్ చేశారు. దాంతో పాటు TVK పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌పై కూడా విచారణను శుక్రవారానికి (అక్టోబర్ 10) సుప్రీంకోర్టు వాయిదా వేసింది. మరో వైపు చెన్నైకి చెందిన న్యాయవాది జిఎస్ మణి తొక్కిసలాటపై సీబీఐ దర్యాప్తు కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. 41 మంది బాధితుల కుటుంబాలకు విజయ్ వ్యక్తిగతంగా ఒక్కొక్కరికి రూ.1 కోటి పరిహారం అందించాలని, పోలీసులు, తమిళనాడు విద్యుత్ బోర్డు (టిఎన్‌ఇబి), కార్యక్రమ నిర్వాహకుల నిర్లక్ష్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని తన పిటీషన్‌లో కోరారు. సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో మరో రెండురోజుల్లో తేలిపోతుంది.

Tags:    

Similar News