అసెంబ్లీ ‘సిఎఎ’ వ్యతిరేక తీర్మానాన్ని రేవంత్ అమలు చేయాలి: అసద్

సీఏఏ చట్టం అమలు నేపథ్యంలో తెలంగాణలో ప్రకంపనలు ప్రారంభమయ్యాయి. సీఏఏను రద్దు చేయాలని కోరుతూ గత అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని అమలు చేయాలని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కోరారు.

Update: 2024-03-12 13:45 GMT
Asaduddin Owaisi

 సీఏఏను రద్దు చేయాలని కోరుతూ గత అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని అమలు చేయాలని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సీఎం రేవంత్ రెడ్డిని కోరారు.ఈ రోజు హైదరాబాద్ లో విలేకరులతో మాట్లాడుతూ సీఏఏ అమలును వ్యతిరేకిస్తూ తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

ఈ చట్టాన్ని అమలుచేసేది లేదని కేరళ రాష్ట్రం అసెంబ్లీలో ఒక తీర్మానం చేసిందని చెబుతూ తెలంగాణ కూడ ఇదే దారిలో చేసిన తీర్మానాన్ని ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని అన్నారు.
“జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్‌ఆర్‌సి), నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ (ఎన్‌పిఆర్)తో పాటు పౌరసవరణ చట్టం (సిఎఎ) అమలుపై తెలంగాణ అసెంబ్లీ ఆందోళన వ్యక్తం చేసింది.ఎన్‌పీఆర్, ఎన్సీఆర్ నుంచి రాష్ట్ర ప్రజలను రక్షించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ అసెంబ్లీ కోరింది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పౌరసవరణ చట్టాన్ని రద్దు చేయాలని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు,” అని అసద్ అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ), జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్‌ఆర్‌సి), జాతీయ జనాభా రిజిస్టర్ (ఎన్‌పిఆర్) అమలుకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ 2020 మార్చి 16వతేదీన తీర్మానం చేసింది. సీఏఏ పార్లమెంటరీ చట్టం దేశవ్యాప్తంగా సమాజంలోని వివిధ వర్గాల్లో తీవ్ర భయాందోళనలను సృష్టించిందని అసెంబ్లీ తీర్మానంలో పేర్కొన్నారు. ఏ మతానికి సంబంధించిన లేదా ఏదైనా విదేశానికి సంబంధించిన అన్ని సూచనలను తొలగించడానికి పౌరసత్వ (సవరణ) చట్టం, 2019ని సవరించాలని భారత ప్రభుత్వాన్ని కోరుతూ తెలంగాణ శాసనసభ తీర్మానించింది.
“ ప్రభుత్వం అనేది శాశ్వతం. పార్టీలు ప్రజాతీర్పును బట్టి అధికారంలోకి వస్తుంటాయి పోతుంటాయి. ఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్నయినా తర్వాత వచ్చే ప్రభుత్వాలు గౌరవించాలి. 2020 మార్చి 16 బిఆర్ఎస్ ప్రభుత్వం అసెంబ్లీ లో తీసుకువచ్చిన తీర్మాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది,” అని ఆయన అన్నారు.
సీఏఏను రద్దు చేయాలని కోరుతూ గత అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని ఎంపీ అసదుద్దీన్అసెంబ్లీ ‘సిఎఎ’ వ్యతిరేక తీర్మానాన్ని రేవంత్ అమలు చేయాలి: అసద్ కోరారు.


Tags:    

Similar News