వంద వెబ్ సైట్లపై కేంద్రం కొరడా .. ఎందుకంటే..

దేశంలోని నిరుద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, మహిళలను లక్ష్యంగా చేసుకుని ఆర్ధిక మోసాలకు పాల్పడుతున్న వంద వెబ్ సైట్లపై కేంద్ర ప్రభుత్వం కొరడా ఝలిపించింది.

Translated by :  Chepyala Praveen
Update: 2023-12-06 11:03 GMT
సైబర్ మోసాలు

ఈ నకిలీ వెబ్ సైట్లు అమాయకులే లక్ష్యంగా గూగుల్, మెటాలో ప్రకటనలు గుప్పింస్తోన్నట్లు కేంద్రం గుర్తించింది. సదరు వెబ్ సైట్లు ఆన్ లైన్ ఆధారిత వర్క్ ఫ్రం హోమ్ అంటూ అమాయకులను ఉద్యోగాల పేరిట మోసాలు చేస్తోందని హోంమంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. వీరు డిజిటల్ ప్రకంపనలు, చాట్ మెసెంజర్లు, మ్యూల్ ఇతర మార్గాల ద్వారా ప్రజలతో మాట్లాడి ఆర్థిక మోసాలను పాల్పడుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఇటువంటి సంస్థల లిస్ట్ తయారుచేసి ఐటీ శాఖ బ్లాక్ చేసింది.

ఆర్థిక మోసాల ద్వారా వీరు తమ దగ్గర మొత్తాలను క్రిప్టో కరెన్సీ, విదేశీ ఏటీఎం కార్డుల ద్వారా మనీలాండరింగ్ కు పాల్పడుతున్నారనే ఐటీ శాఖ గుర్తించింది. ఐటీ నిబంధనలు 2000 ప్రకారం వీటిపై చర్య తీసుకున్నట్లు ప్రకటించింది. వీటిని ట్రాక్ చేసినప్పుడు ఈ వెబ్ సైట్లను కొంతమంది విదేశీయులు నిర్వహిస్తున్నారనే విషయం తెలిసిందని ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో తేలింది.

మొదట ఆర్థిక నేరగాళ్లు వివిధ ఆన్ లైన్ వేదికల్లో వర్క్ ఫ్రం హోం అంటూ ప్రకటనలు ఇస్తారు. ఎవరైన అమాయకులు వాటిపై క్లిక్ చేయగానే ఆర్థిక మోసాగాళ్లు నేరుగా కాల్ చేసి మాట్లాడతారు. మొదట పని ఇచ్చి దానికి డబ్బులు ఇస్తారు. తరువాత వీరితో సంబంధాలు ఏర్పరచుకుని తమ బిజినెస్ లో పెట్టుబడి పెట్టాలని, ఎక్కువ మొత్తం లో కమిషన్ ఆశజూపి డబ్బులు రాగానే తరువాత ఉడాయిస్తారు. 

Tags:    

Similar News