హైడ్రా పేరిట డబ్బు వసూళ్లు,చర్యలకు ఏసీబీకి సీఎం ఆదేశం

హైదరాబాద్‌లో కొందరు ప్రభుత్వ అధికారులు హైడ్రా పేరు చెప్పి అక్రమాలకు పాల్పడుతున్నారనే ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Update: 2024-08-29 10:43 GMT

కబ్జాదారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్న హైడ్రా హైదరాబాద్ నగరంలో సంచలనం రేపుతోంది. హైడ్రాకు ప్రజల్లో పేరు ప్రతిష్ఠలతోపాటు ఆ పేరు వింటేనే కబ్జాదారులు వణికిపోతున్నారు. దీన్నే కొందరు అవినీతి అధికారులు అనువుగా మార్చుకొని, అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు.

- హైదరాబాద్ నగరంలో కొందరు ప్రభుత్వ అధికారులు హైడ్రా పేరిట అక్రమాలకు పాల్పడుతున్నారని ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డికి ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

కబ్జాదారుల నుంచి డబ్బు వసూళ్లు
రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ శాఖల్లోని కొందరు అధికారులు పాత నోటీసులు, రెండు మూడేళ్ల క్రితం ఇచ్చిన ఫిర్యాదులను సాకుగా చూపి డబ్బులు కబ్జాదారుల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని సాక్షాత్తూ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. సీఎం దృష్టికి వసూళ్ల పర్వం రావడంతో ఏసీబీ అప్రమత్తమైంది.

అక్రమాలపై ఏసీబీకి సీఎం ఆదేశం
హైడ్రా పేరుతో ప్రజల నుంచి డబ్బులు డిమాండ్‌ చేస్తూ అక్రమాలకు పాల్పడిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. అక్రమార్జనకు పాల్పడుతున్న అధికారులపై దృష్టి సారించాలని తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ), విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ (వీ అండ్‌ ఈ) వింగ్‌ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.




Tags:    

Similar News