ఇక అలాంటి భూములకు రైతుభరోసా ఇవ్వరట?

రైతు భరోసా పరిధి నుంచి కొంత మంది దొడ్డ రైతులను తీసేయకపోతే పనిజరగదనే నిర్ణయానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినట్లుంది. అందుకే వీళ్లని ఎంపిక చేశారేమో...

Translated by :  Chepyala Praveen
Update: 2023-12-23 06:39 GMT
తెలంగాణ రైతు భరోసా అర్హతల్లో మార్పులు...

ఇక రైతులకు పంటసాయం కింద అందజేసే నిధుల కోసం కొత్త నిబంధనలు అమలు చేయాలని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.అయితే అందరూ అనుకున్నట్లు ఐదు ఎకరాల లోపే ఉన్న రైతులకు మాత్రమే నిధులు ఇవ్వాలనే ప్రతిపాదన పక్కన పెట్టారని తెలుస్తోంది.

అనేక మంది సలహాలు, సూచనలు ఇప్పటికే స్వీకరించిన ప్రభుత్వం రెండు కొత్త నిబంధనలు అమలు చేయాలని అనుకుంటోదట.  రైతు భరోసా ఉద్దేశం వ్యవసాయం చేస్తున్న రైతుకు పంటమీద పెట్ట ఖర్చు (Crop Investment) ఎకరానాకి సీజన్ కు అయిదువేలుఅందించే వాళ్లు. ఇలా ఏడాది వచ్చే రెండు సీజన్లకు పది వేలు ఇచ్చే వారు. అలాంటపుడు  సాగులో లేని భూమికి  ఇన్వెస్టు మెంటు ఇవ్వడం సరైనదేనా  అనే చర్చ ప్రభుత్వం లో మొదయలయింది.  దీనితో సాగులో లేని భూములకు రైతుభరోసా సాయం ఇవ్వకూడదని ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అలాగే రాష్ట్రంలో నివసిస్తూ సాగు చేస్తున్న వారికి మాత్రమే రైతుభరోసా నిధులు అందజేసే ఆలోచనకూడా చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇవే కాకుండా ఇన్ కమ్ ట్యాక్స్ చెల్లించే రైతులకు కూడా రైతుభరోసా సాయం అందించకూడదనే ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం ల్యాండ్ ఉన్న కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి వారికి ఉన్న భూమితో విస్తీర్ణంతో సంబంధం లేకుండా రైతుబంధు నిధులు అందుతున్నాయి. అంతే కాకుండా కొన్ని వ్యవసాయ భూములు కాలక్రమేణ ఇళ్ల కింద మారిన ప్రస్తుత ధరణి ద్వారా వాటికి కూడా గత ప్రభుత్వం రైతుబంధు నిధులు అందజేసింది.

అలాంటి వాటికి ప్రస్తుతం పక్కన పెట్టాలని కాంగ్రెస్ సర్కార్ భావిస్తోందని సమాచారం. అయితే ప్రస్తుత సీజన్ కు మాత్రం పాత నిబంధనల ద్వారానే రైతుభరోసా కింద నిధులు అందజేస్తామని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో హమీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయాలనే కృత నిశ్చయంతో ఉన్న నేపథ్యంలో నిధుల అన్వేషణ మొదలుపెట్టింది. అందుకోసం గత ప్రభుత్వం హయాంలో పథకాల్లో జరిగిన దుబారాలను అరికట్టాలని నిర్ణయించుకుంది.

అందుకే కొత్త నిబంధనలు విధించాలని తీర్మానించుకున్నట్లు సమాచారం. పెద్ద భూస్వాములకు రైతుభరోసా ద్వారా నిధులు అందకుండా చేసిన పెద్దగా ప్రభుత్వం నిధులు ఆదా కావని సీఎం భావిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయాలు అమలు కానున్నాయట. ఈ నిబంధనల అమలు వల్ల కూడా రైతుల నుంచి పెద్దగా వ్యతిరేకత రాదని ప్రభుత్వం భావిస్తోందట.

కాగా రైతుబంధును గత బీఆర్ఎస్ సర్కార్ 2018లో ప్రవేశపెట్టింది. ప్రారంభంలో ఎకరానికి రైతుకు రూ. 4 వేల పెట్టుబడి సాయం ఒక పంట కాలంలో అందిస్తామని అప్పటి సీఎం కేసీఆర్ ప్రకటించి అందించారు. తరువాత దీనిని ఎకరానికి రూ. 5 వేలకు పెంచారు. ప్రస్తుత ప్రభుత్వం ఈ పథకం పేరును రైతుభరోసాగా మార్చి, ఎకరానికి సంవత్సరానికి రూ. 15 వేలు ఇస్తామని హమీ ఇచ్చింది. 

Tags:    

Similar News