'ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు TSPSC చైర్మన్ ఫోస్టు ఆఫర్ చేశా'

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిఎస్ పి మాజీ అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ గురించి ఆసక్తి కరమయిన విషయం వెల్లడించారు. అవేంటంటే...

Update: 2024-03-17 08:31 GMT
CM Revanth Reddy

బహుజన్ సమాజ్ పార్టీ మాజీ అధ్యక్షుడు  ఆర్.ఎస్. ప్రవీణ్ గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తి కరమయిన విషయాలు వెల్లడించారు. ఆయన కు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చెయిర్మన పదవి ఆఫర్ చేశానని ఆయన  వెల్లడించారు.

 ఈరోజు కాంగ్రెస్  ప్రభుత్వం నూరు రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. 

  "అంటే నాకు ఇప్పటికీ గౌరవం ఉంది.  ఐపిఎస్ అధికారిగా  ఉద్యోగంలో కొనసాగి  ఉంటే ప్రవీణ్ డీజీపీ అయ్యేవారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవిని ప్రవీణ్ కు ఆఫర్ చేశా.. కానీ ఆయన ఒప్పుకోలేదు," రేవంత్ చెప్పారు.

ప్రవీణ్ కుమార్ భారత రాష్ట్ర సమితిలో చేరతారన్న విషయం ప్రస్తావిస్తూ, ఆయన కేసీఆర్ తో చేరుతారని  తాను భావించడం లేదని, ఒక వేళ కేసీఆర్ తో చేరితే ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సింది ఆయనేనని రేవంత్ రెడ్డి అన్నారు.


నిజాం కోరిక


‘‘సెప్టెంబరు 17,1948 సెప్టెంబర్ 17లో దేశంలో ఆనాడు ఉమ్మడి హైదరాబాద్ రాష్ట్ర నిజాం రాచరిక పాలనకు ఆ రోజు విముక్తి కలిగింది. సాయుధ రైతాంగ పోరాటంతో 2023 డిసెంబర్ 3కు అంతే ప్రాధాన్యం ఉంది. నిజాం ఆసుపత్రి, నిజాంసాగర్ కట్టినా, ఉస్మానియా యూనివర్శిటీ ఏర్పాటు చేసినా,నిజాం ఆర్థోపెడిక్ ఆసుపత్రి కట్టినా, మొజాంజాహీ మార్కెట్ కట్టినా, సంక్షేమం, సాగునీటి ప్రాజెక్టులు చేసినా 8 వతరం తమ వారసులే పాలన సాగించాలని ఏడవ నిజాం ఆశించారు. మా రాచరికంలో మీకు స్వేచ్ఛ లేదని నిజాం ప్రభువులు ప్రకటించారు. కాని ఈ ప్రాంత ప్రజలు స్వేచ్ఛ కోసం అరాచకం నుంచి విముక్తి పొందేందుకు సాయుధ పోరాటం జరిగింది. నాడు ఎర్రజెండా నీడన ఈ ప్రాంత ప్రజలకు నిజాం నిరంకుశత్వం నుంచి స్వేచ్ఛను ప్రసాదించారు.’’ అని సీఎం చెప్పారు.


నయా నిజాం కేసీఆర్ కోరిక
‘‘ నయా నిజాం కేసీఆర్ పాలనకు ప్రజలు చరమగీతం పాడారు, జూన్ 2014 నాడు నాడు కేసీఆర్ సీఎంగా తాను అభివృద్ధి చేశానని వారసత్వంగా తమ కుటుంబమే పాలన సాగించాలని కేసీఆర్ భావించారు. నాటి నిజాం హయాంలోని ఖాసిం రజ్వీ ఆధిపత్యాన్ని తాను చలాయించాలని కేసీఆర్ అనుకున్నారు. సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తితో మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి అని ప్రజలు తీర్పు ఇచ్చారు. ఆ పోరాటంలో కేసిఆర్ కుటుంబం పతనం అయ్యింది. ప్రతీ సారి నేను కాళేశ్వరం కట్టినా, సచివాలయం నిర్మించా, కళ్యాణ లక్ష్మీ ఇచ్చా, దళిత బంధు ఇచ్చినా తన వారసత్వాన్ని కొనసాగించాలని కేసీఆర్ భావించారు, కాని ప్రజలు సాయుధ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని కేసీఆర్ ను పారదోలారు. ’’ అని సీఎం చెప్పారు.

నాడు ఖాసింరిజ్వీ...నేడు కేసీఆర్
‘‘నిజాం, కేసిఆర్ ఇద్దరి పేర్లు మాత్రమే వేరు. ఆ నాడు ఖాసిం రిజ్వీ ఉంటే నేడు కేసీఆర్ ఉన్నాడని నాటి నిజాం నకలే కేసీఆర్ అని రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. ప్రజలు కేసీఆర్ ను కాదని ప్రజా పాలనకు పట్టం కట్టారు. కానీ సారూప్యత ఒకటే. బతుకమ్మ పండుగను కొందరు వ్యాపార వస్తువుగా, ఆటవస్తువుగా మార్చారు. బతుకమ్మ, బోనాలు అనాదిగా తెలంగాణలో జరుపుకుంటున్న పండుగలు. ఎవరు ఉన్నా లేకున్నా ఈ పండుగలు జరుగుతాయి. ప్రైవేట్ చేతిలో ఉన్న ధరణిని ప్రభుత్వ సంస్థకు అప్పగించాం. ధరణి పోర్టల్ ను ఫోరెన్సిక్ ఆడిట్ చేస్తే అసలు విషయం బయటపడుతుంది. తప్పులకు కారణమైన వారిని ఉపేక్షించేది లేదు.’’ అని రేవంత్ రెడ్డి ప్రకటించారు.

ధర్నా చౌక్ ను ప్రారంభించాం
నాడు నిరంకుశ కేసీఆర్ ధర్నా చౌక్ ను మూసివేయగా తాము అధికారంలోకి రాగానే దాన్ని ప్రారంభించామని రేవంత్ చెప్పారు. ‘‘తాము జయ జయహే తెలంగాణ పాటను రాష్ట్ర గీతంగా మార్చామని, టీఎస్ బదులు టీజీని తీసుకువవచ్చాం, తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు తీసుకువచ్చాం, అధికారంలోకి రాగానే ప్రగతి భవన్ గోడలు బద్దలు కొట్టాం’’ అని సీఎం ఉద్వేగంగా చెప్పారు. ‘‘మేం పాలకులం కాదని ప్రజా సేవలకులమని చెబుతూ ప్రజలకే స్వేచ్ఛ ఇచ్చాం’’ అని సీఎం చెప్పారు.




Tags:    

Similar News