Rain alert :- రెయిన్ అలర్ట్ ఏపీ వైపు దూసుకువస్తున్న అల్పపీడనం..!
By : Dinesh Gunakala
Update: 2024-12-19 04:31 GMT
బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం సముద్ర మట్టం నుండి 5.8 కి.మీ వరకు విస్తరించి. ఉపరితల ఆవర్తనంతో కొనసాగుతోంది. రానున్న 24 గంటల్లో దాదాపు వాయువ్య దిశగా ఉత్తర తమిళనాడు దక్షిణకోస్తా తీరం వైపు వెళ్లే అవకాశం ఉంది. ఆ తర్వాత 24 గంటల్లో దాదాపు ఉత్తరం దిశగా ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి పయనించే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తమిళనాడులో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది
తీవ్ర అల్పపీడనం ప్రభావంతో గురువారం శుక్రవారం ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ, ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది.డిసెంబర్19న శ్రీకాకుళం విజయనగరం అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం జిల్లాల్లోని కొన్ని ప్రదేశాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. డిసెంబర్ 20న శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, బాపట్ల, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.