ముఖ్యమంత్రి ఎవరో సాయంత్రంలోగా తేల్చేస్తాం: ఖర్గే

తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిని సాయంత్రం లోగా ప్రకటిస్తామని ఏఐసీసీ అధ్యక్షుడు ఎంపీ మల్లికార్జున్ ఖర్గే చెప్పారు. ఉదయం ఆయన ముఖ్యమంత్రికి ఎంపిక సంబంధించిన విషయంపై మీడియాతో మాట్లాడారు.

Producer :  Chepyala Praveen
Update: 2023-12-05 06:00 GMT
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గె

నాకు ఒక అవకాశం ఇవ్వండి: భట్టి విక్రమార్క

తెలంగాణ ముఖ్యమంత్రిగా తనకు అవకాశం ఇవ్వాలని మధిర ఎమ్మెల్యే  భట్టి విక్రమార్క అధిష్టానానికి నివేదించినట్లు సమాచారం. కష్టకాలంలో కూడా తను పార్టీనే నమ్ముకుని ఉన్నానని, గత అసెంబ్లీలో నేనే సీఎల్పీ నేతగా ఉన్నానని చెప్పారట. అలాంటప్పుడు ప్రస్తుతం వేరే ఎవరిని సీఎల్పీగా ప్రకటిస్తారని ఆయన వాదన. అలాగే తెలంగాణలో పార్టీ విజయం ఏ ఒక్కరి వల్లో సాధ్యంకాలేదని, ఇందులో అందరి పాత్ర ఉందన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహూల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర, దాదాపు 17 సభల్లో గాంధీ కుటుంబం ప్రచారం చేశారని, వారు ప్రచారం చేసిన మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించారని చెబుతున్నారు.

తెలంగాణ ఏర్పాటు అయితే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తామని కేసీఆర్ మాట ఇచ్చారని, ఇప్పుడు దళితుడైన తనకు అవకాశం ఇస్తే తెలంగాణ సమాజానికి ఈ విషయంపై కాంగ్రెస్ అధిష్టానం నుంచి సందేశం ఇచ్చినట్లు అవుతుందని, తనను ఎందుకు సీఎంగా చేయాలనే అంశంపై ఏఐసీసీ పెద్దలకు ప్రజేంటేషన్ ఇచ్చినట్లు సమాచారం. తెలంగాణలోని మెజారీటి ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల్లో కాంగ్రెస్ గెలిచిందని గుర్తు చేశారని, ఇది కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కు ఎంతో ఉఫయోగ పడుతుందని చెప్పినట్లు వినికిడి.

మాకు అవకాశం ఇవ్వండి

తెలంగాణ మఖ్యమంత్రిగా తమకు కూడా ఓ అవకాశం ఇవ్వాలని మాజీ టీసీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే మరో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అధిష్టానాన్ని కోరారు. ఇదే విషయంపై మాట్లాడేందుకు వారిద్దరు సోమవారం సాయంత్రం ఢిల్లీకీ చేరుకున్నారు. తమ అభ్యర్థిత్వంపై వారు ఒక ప్రజంటేషన్ విడివిడిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు సమర్పించారట. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. వారిద్దరిని ముఖ్యమంత్రి పదవి విషయంలో బుజ్జగిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి లోక్ సభ స్పీకర్ ను కలవనున్నారు. తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తారని తెలుస్తోంది.

తాము చాలాకాలం నుంచి కాంగ్రెస్ పార్టీనే నమ్ముకుని ఉన్నామని, కష్టకాలంలో కూడా పార్టీకి సేవ చేశామని ఇరువురు నాయకులు బలంగా వాదించినట్లు సమాచారం. ఈ విషయంపై కాంగ్రెస్ పెద్దలు కాంగ్రెస్ అగ్రనేతలు రాహూల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో చర్చించి చెబుతామని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి, ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలియజేసినట్లు తెలుస్తోంది. రాజస్తాన్ పరిస్థితి లాగే తమకు కూడా ముఖ్యమంత్రి పదవి దక్కుతుందనే ఆశాభావంతో మరికొంతమంది సీనియర్లు తమ ప్రయత్నాలు గట్టిగా చేస్తున్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా వినిపిస్తున్న పేరును వారు వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది.

రాజస్తాన్ కి 2018లో జరిగిన ఎన్నికల్లో పీసీసీ అధ్యక్షుడిగా సచిన్ ఫైలెట్ ఉన్నారు. అప్పటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన సచిన్ పైలెట్ ను కాదని అశోక్ గెహ్లట్ ను ముఖ్యమంత్రిగా కూర్చున్నారు. అలాగే ఆరు నెలల కిందట జరిగిన కర్నాటక ఎన్నికల్లో కూడా మొదట డీకే శివకుమార్ ను సీఎంగా చేస్తారని ప్రచారం జరిగిన చివరి నిమిషంలో తిరిగి సిద్దరామయ్య సీఎంగా అధిష్టానం నిర్ణయించింది. అలాగే తమకు కూడా అవకాశం వస్తుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు విశ్వప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News