బ్రాహ్మణ కొత్తపల్లిలో కాకతీయ శాసనాలు లభ్యం

మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలోని బ్రాహ్మణకొత్తపల్లి గ్రామంలో ఉన్న సంతాన వేణుగోపాలస్వామి దేవాలయ మంటపస్తంభం‌పై..

Update: 2024-05-21 10:38 GMT

మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలోని బ్రాహ్మణకొత్తపల్లి గ్రామంలో ఉన్న సంతాన వేణుగోపాలస్వామి దేవాలయ మండప స్తంభంపై ఉన్న శాసనాన్ని ఆలయపూజారి ఎం.వేణుగోపాల్, తెలంగాణ వారసత్వశాఖ పూర్వ ఉప-సంచాలకులు సముద్రాల శ్రీరంగాచార్యులు గుర్తించారు. ఈ శాసనాన్ని కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్, శ్రీరామోజు హరగోపాల్ చదివి, పరిష్కరించారు.

ఈ శాసనం 13వ శతాబ్దపు తెలుగులిపిలో ఉంది. కాకతీయ రుద్రమదేవ మహారాజులు పాలనాకాలంలో స్థానిక నాయంకరంలోని కుమ్మరికుంట రామనాథదేవరకు రట్టకుల పరతట్ట రాయసాహిణి విచరౌతు ఆ ఊరి (గడ్డ)చెరువు నడితూము కాలువ, పస్రచేనును ఆచంద్రార్కంగా వ్రిత్తిగా చేసిన దాన శాసనమిది. సాధారణంగా శాసనాలలో రుద్రమ అన్న పేరుతో కాకుండ రుద్రదేవమహారాజులు అని కనిపిస్తుంది. ఈ శాసనంలో రుద్రమదేవమహారాజులు అని ఉండడం అరుదుగా పేర్కొనబడ్డది. ఇది విశేషాంశం. ఇది బ్రాహ్మణకొత్తపల్లి గుడిలోని రామనాథదేవరకు కుమ్మరికుంటలో వ్రిత్తిగా చేసిన కొత్త కాకతీయ దానశాసనం అని శ్రీరామోజు హరగోపాల్ వివరించారు.

కుమ్మరికుంట శాసన పాఠం:

‘స్వస్తిశ్రీమతు రట్టకుల(ప)ర

తట్ట(వి)చామ రాయసా

హిణి రఖసపట్టసాహి

ణి చేడరౌతు మను(మం)

డు అమఱౌతుకొడుకు(వి)

చరౌతు కాకతీయ రుద్రమ

దేవమహారాజులుం..నిననాయంక

ఱమునందు కుమ్మరికుంట(లి)శ్రీరా

మనాథదేవరకు ఆ ఊరి..డ్డచ...

నడితూముకాల్వను పస్రసేను

కాల్వకట్ట శాశనాలు చెల్లెను వ్రిత్తి ఆ

చంద్రార్కస్థాయిగాను ఇచ్చెను’

Tags:    

Similar News