దేశానికి స్థిరమైన వృద్దిరేటు అవసరం: అహ్లువాలియా

పెట్టుబడుల్లో వేగం కోసం రెడ్ టేపిజం తొలగించాలని సూచన;

Update: 2025-02-13 11:36 GMT

విజయ్ శ్రీనివాస్

భారత్ లో పన్ను హేతుబద్దీకరణ చాలా అవసరమని ప్రఖ్యాత ఆర్థికవేత్త, ప్రణాళిక సంఘం మాజీ డిప్యూటీ చైర్ పర్సన్ మాంటెక్ సింగ్ ఆహ్లువాలియా అన్నారు. వికసిత భారత్ లక్ష్యాలను సాధించడానికి స్థిరమైన వృద్దిరేటు అవసరమన్నారు. బెంగళూర్ లో జరిగిన ఇన్వెస్ట్ కర్ణాటక-2025 కార్యక్రమానికి విచ్చేసిన ఆయన ‘ ది ఫెడరల్’ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. దేశ ఆర్థిక వ్యవస్థ, ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన భారీ పన్ను రాయితీలు, ప్రయివేట్ పెట్టుబడుల చుట్టూ ఉన్న సవాళ్లపై మాట్లాడారు.

డిమాండ్ పెంచకపోవచ్చు..
కేంద్రం లక్ష కోట్ల రూపాయల పన్ను మినహాయింపు ప్రకటించిన విషయం గురించి అహ్లువాలియా మాట్లాడుతూ.. దేశంలో పన్ను హేతుబద్దీకరణ చాలా కీలకం, అయితే పన్ను మినహాయింపు ఇచ్చినంత మాత్రాన వినియోగం పెరగాలని లేదు.
దాని ప్రభావం మనం ఊహించినంతగా ఉండకపోవచ్చని విశ్లేషించారు. ‘‘ ప్రశ్న ఏమిటంటే.. ప్రజలు పొందే అదనపు ఆదాయంలో వినియోగించేది ఎంత? ’’ అహ్లాువాలియా వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం దేశంలో వినియోగం మందగించినప్పటికీ పన్ను ఉపశమనం కొంత ప్రొత్సహాన్ని అందించవచ్చని, అయితే ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ ను గణనీయంగా పెంచడానికి ఇది సరిపోకపోవచ్చని అన్నారు.
Full View

పెట్టుబడులలో అడ్డంకులు..
దేశ ఆర్థిక వ్యవస్థలో వృద్ధి ఉన్నప్పటికీ ప్రైవేట్ పెట్టుబడుల మందగమనం గురించి ఆందోళనలను కూడా అహ్లావాలియా ప్రస్తావించారు. 70ల మధ్యలో ఉన్న వినియోగం, ప్రస్తుతం ఉన్న సామర్థ్య వినియోగాన్ని ప్రస్తావిస్తూ, ప్రైవేట్ కంపెనీలు పెట్టుబడులు పెట్టడం ప్రారంభించడానికి 80 శాతం మార్క్ ను దాటవలసిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు.
ముందుగా ఆర్థిక వ్యవస్థ పెరగాలి. అది ఎంతగా పెరిగితే అంత మంచిది. అప్పుడు మన దగ్గర ఉన్న అదనపు సామర్థ్యం త్వరగా వినియోగించబడుతుందని అన్నారు.
దేశంలో పెట్టుబడుల కోసం కొన్ని అధికారిక అడ్డంకులు ఉన్నాయని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ముఖ్యంగా చిన్న కంపెనీల నుంచి చాలా మంది వ్యవస్థాపకులు పెట్టుబడి ప్రక్రియలో గణనీయమైన అడ్డంకులు ఎదుర్కొంటున్నారని, వాటిలో అధిక అనుమతులు రెడ్ టేపు కూడా ఉన్నాయని ఆయన చెప్పారు.
విదేశీ గమ్యస్థానాలను ఎందుకు ఎంచుకుంటున్నారు?
భారతీయ ఎంటర్ ప్రెన్యూర్ లు విదేశాల్లో వ్యాపారాలు స్థాపించడానికి ఉత్సాహం చూపిస్తున్నారని, దుబాయ్, సింగపూర్ లు మంచి సమర్థవంతమైన విధానాల కారణంగా ప్రజాదరణ పొందిన ప్రత్యామ్నాయాలుగా ఉన్నాయని ఆయన ఎత్తిచూపారు.
ఈ ప్రక్రియలను సులభతరం చేసే దేశంలో పెట్టుబడులు పెట్టడాన్ని మరింత ఆకర్షణీయంగా చేసే విధానాలను ప్రవేశపెట్టాలని కర్ణాటకతో సహ ఇతర రాష్ట్రాలను కోరారు.
2026 ఆర్థిక సంవత్సరంలో ఆర్ధిక లోటు 4.4 శాతం, ఉండటం ఇదే సమయంలో దేశ జీడీపీ 6.3 శాతం నుంచి 6.8 శాతంగా ఉంటుందనే విషయాలపై మాట్లాడారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించాలంటే కనీసం 8 శాతం వృద్ది రేటు కొనసాగించాలని అన్నారు.
వికసిత్ భారత్ కు చిట్కా..
దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధిని సాధించాలంటే కచ్చితంగా 8 శాతం వృద్దిరేట్ ను కొనసాగించాలని అందుకోసం విధాన నిర్ణేతలు ఆర్థిక వృద్ది, మధ్యస్థ అంశాలపై దృష్టి పెట్టాలి.
అదే సమయంలో పురోగతికి ఆటంకం కలిగించే పెట్టుబడి అడ్డంకులను పరిష్కరించాలి. ప్రతిష్టాత్మక లక్ష్యంతో ముందుకు సాగాలన్నారు. దేశంలో వృద్దికి అపారమైన సామర్థ్యం ఉందన్నారు.
‘‘దేశం అభివృద్ది చెందతున్న హోదా కు మారుతున్న క్రమంలో అన్ని రంగాలలో 8 శాతం వృద్దిని కొనసాగించలేరు’’ అని వర్ణించారు. బదులుగా ప్రారంభ సంవత్సరాల్లో సగటున 9 శాతం వృద్దిని కొనసాగించాలని, తరువాత క్రమంగా మందగమనం ఉన్నప్పటికీ రాబోయే 25 సంవత్సరాల్లో 8 శాతం లక్ష్యాన్ని చేరుకోవాలని అన్నారు.
Tags:    

Similar News