అమెరికా వడ్డీలు పాతాళానికి... భారత్ బంగారు ధరలు చుక్కల్లోకి
అమెరికా వడ్డీ రేట్లు పాతాళానికి పడిపోనున్నాయన్న అంచనాలతో భారత్‌లో బంగారం ధరలు ఆకాశానంటాయి. పది గ్రాముల బంగారం ధర రూ.65,000కు చేరింది.
Update: 2024-03-06 05:33 GMT
పెళ్లిళ్ల సీజన్ రానే వచ్చింది. మూడు ముళ్ల బంధంతో ఒక్కటవ్వాలనుకుంటున్న వారంతా షాపింగ్‌లో బిజీగా ఉంటున్నారు. బట్టలు, ఆభరణాలు అంటూ ఒకదాని తర్వాత ఒకటిగా కొనడానికి ప్లాన్స్ రెడీ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే బంగారం కొనాలనుకునేవారికి పిడుగులాంటి వార్త ఒకటి ఉంది. అదే బంగారం ధరల పెరుగుదల. ఈ సారి బంగారం ధర ఎన్నడూ లేని విధంగా రికార్డ్ స్థాయికి పెరిగింది. మంగళవారానికి 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.65,000 దాటింది. దాదాపు మంగళవారం ఒక్కరోజే పది గ్రాముల బంగారం ధర రూ.800 వరకు పెరిగింది. జూన్ నెలలో అమెరికా వడ్డీ రేట్లు తగ్గుతాయని వేసిన అంచనా వల్ల బంగారం ధరలు ఆకాశాన్నంటాయి. సోమవారం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం 10 గ్రాముల ధర 2,141 డాలర్ల దగ్గర నిలిచింది. ఇది ఇప్పటివరకు బంగారం అందుకున్న అత్యధిక స్థాయి ధర 2,135.39 డాలర్లను అధిగమించింది.
అమెరికా వడ్డీ రేట్లు తప్పక తగ్గుతాయి
‘అమెరికా వడ్డీ రేట్లు జూన్ నెలలో భారీగా తగ్గనున్నాయని వస్తున్న వార్తలపై యూఎస్ ఫెడరల్ రిజర్వ్ అధికారులు సరైన స్థాయిలో స్పష్టతను ఇవ్వలేకపోయారు. జూన్ నెలలో వడ్డీ రేట్లు గణనీయంగా తగ్గే అవకాశం పుష్కలంగా ఉంది. ఇదే అంశాన్ని గత వారం విడుదలైన అమెరికా మాక్రోఎకనామిక్ డాటాలోని స్పష్టత లోపం పునరుద్ఘాటించింది. దీంతో కామెక్స్ మార్క్ ఉన్న బంగారం ధర రికార్డు స్థాయికి పెరిగింది. భారత మార్కెట్లో ఈ కామెక్స్ మార్క్ ఉన్న బంగారం రూ.65,000కు చేరి ఆల్‌టైమ్ రికార్డ్‌ను సృష్టించింది’’అని హెచ్‌డీఎఫ్‌సీ సీనియర్ ఎనలిస్ట్-కమోడిటీస్ అధికారి సామిల్ గాంధీ అంచనా వేశారు. దీనికి తోడు బంగారం ఉత్పత్తి ఇండెక్స్ తగ్గిపోవడం కూడా ఒక కారణమేనని విశ్లేషకులు వెల్లడించారు.
యుద్ధాలూ కారణమే
బంగారం ధరల పెరుగుదలకు అమెరికా ఫెడరల్ వడ్డీ రేట్లు తగ్గుతాయన్న అంచనా ఒక్కటే కారణం కాదని ఇండియా బులియన్ అండ్ జ్యూవెలరీ అసోసియేషన్ వర్గాలు తెలిపాయి. ‘‘బంగారం ధరల పెరుగుదలలో అమెరికా వడ్డీ రేట్ల తగ్గింపు అంశంతో పాటు మధ్య ఆసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, భారత్-చైనా మధ్య నడుస్తున్న టెన్షన్‌లు, బాండ్ల ఉత్పత్తులు తీవ్రంగా క్షీణించడం, డాలర్ ఇండెక్స్ బలహీనపడటం కూడా ప్రధాన కారణాలే’’అని ఆయన వెల్లడించాయి.
బంగారం ధర 2,150డాలర్లకు చేరితే బంగారం సంక్షోభాన్ని నిలువరించడానికి బంగారం ధరలను 70-80 డాలర్ల వరకు తగ్గించి 2080 డాలర్లకు సరిదిద్దాల్సి ఉంటుంది. బంగారం ధరలపై నిరసనలు, ర్యాలీలు ప్రారంభం కాకముందే ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టడం మంచిదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. దీపావళి పండగ నాటికి 10 గ్రాముల బంగారం ధర రూ.70,000 దాటినా తాను ఏమాత్రం ఆశ్చర్యపోనని సికింద్రాబాద్‌లోని ఓ బంగారు వ్యాపారి అభిప్రాయపడ్డారు.
తాజా ధరల పెరుగుదలతో ఇకనుంచి 10 గ్రాముల బంగారం ధర 2,168-2,180 డాలర్ల ప్రారంభం కోసం ప్రయత్నించడం విచిత్రంగా ఉంటుందని హైదరాబాద్‌కు చెందిన బులియన్ వర్గాలు పేర్కొన్నాయి.