చర్చల్లేవు గిర్చల్లేవ్, కాశ్మీర్ తలుపులు మూసేసిన బిజెపి?
జమ్మూకాశ్మీర్ కు ప్రత్యేక హోదా కల్పించే అధికరణ 370, 35 ఏ పునరుద్దరణ విషయంలో బీజేపీ అసలు చర్చలకు కూడా అవకాశం కల్పించకూడదని..
By : The Federal
Update: 2024-11-09 07:57 GMT
జమ్మూకాశ్మీర్ కు ప్రత్యేక హోదా కల్పించే అధికరణ 370, 35ఏ ను తిరిగి పునరుద్దరించాలని ప్రస్తుత అసెంబ్లీ సెషన్ లో తీర్మానం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై దేశ వ్యాప్తంగా రాజకీయచర్చ ప్రారంభమైంది. అయితే బీజేపీ మాత్రం ఈ ప్రతిపాదనలకు ససేమిరా అంటోంది. కమల దళ సభ్యులు ఈ తీర్మానం పై నిరసనలు, ఆందోళన చేశారు.
చర్చలు రెండు తీర్మానాల చుట్టూ కేంద్రీకృతమై ఉన్నాయి. ఒకటి నేషనల్ కాన్ఫరెన్స్ ప్రవేశపెట్టి ఆమోదించి, కేంద్ర ప్రభుత్వం తమతో చర్చలు జరపాలని డిమాండ్ చేసింది. రెండవది ఆర్టికల్ 370 పునరుద్ధరించాలని డిమాండ్ చేసే పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (PDP) నుంచి మరింత బలమైన ప్రతిపాదన. అంటే ఆర్టికల్ 35 ఏ ను కూడా దాని అసలు స్వరూపాల్లోనే తీసుకురావాలని కోరారు.
మొదటి తీర్మానం - జాగ్రత్తగా పదం..
ఉపముఖ్యమంత్రి సురేంద్ర చౌదరి ప్రవేశపెట్టిన మొదటి తీర్మానం ఆర్టికల్ 370 ప్రత్యక్ష ప్రస్తావనను తప్పించింది. విశ్లేషకుల ప్రకారం, " తీర్మానంలో జాగ్రత్తగా పదం ప్రస్తావించారు". ఈ తీర్మానం కేంద్రం, జమ్మూ - కాశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికైన ప్రతినిధుల మధ్య చర్చల ఆవశ్యకతను పునరుద్ఘాటించడానికి ప్రయత్నించింది.
రాజకీయ విశ్లేషకుడు పునీత్ నికోలస్ యాదవ్ ఈ తీర్మానాన్ని ఆర్టికల్ 370 పునరుద్ధరణ కోసం ప్రత్యక్ష డిమాండ్ నుంచి "వెనక్కి మరలడం" అని అభివర్ణించారు. తమతో కేవలం చర్చలు మాత్రమే జరపాలని కోరుతున్నారని ఆయన వివరించారు. జెకే కు ప్రత్యేక హోదా కల్పించే అధికరణ పునరుద్దరణ కోసం చర్చలు సులువుగా ప్రారంభించడానికి ఈ పదం ప్రయోగించారని కొంతమంది విశ్లేషకులు వివరించారు.
ఏది ఏమైనప్పటికీ, ఆర్టికల్ 370ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ PDP ప్రతినిధులు బ్యానర్‌లను శాసన సభలో ప్రవేశపెట్టడంతో బీజేపీ సభ్యులు సభ కార్యకలాపాలను అంతరాయం కలిగించారు. బ్యానర్ ను ముక్కలు ముక్కలుగా చింపివేశారు.
ఆర్టికల్ 370పై అసలు చర్చలేవు..
ఆర్టికల్ 370 పై అసలు చర్చలేవని బీజేపీ అధికార ప్రతినిధి అభిజిత్ జస్రోటియా చెప్పారు. 2019లో కూడా ఆర్టికల్ రద్దును సుప్రీంకోర్టు ఇప్పటికే సమర్థించిందని చెప్పారు. ఆర్టికల్ 370 వేర్పాటువాదాన్ని మాత్రమే పెంపొందించిందని, జమ్మూ కాశ్మీర్ ఆర్థిక, సామాజిక పురోగతిని సాధించకుండా నిరోధించిందని అన్నారు. కాబట్టి పాత సమస్యలను పున: సమీక్షించవలసిన అవసరం ఉందా అని ఆయన ప్రశ్నించారు. అధికరణ రద్దు తరువాత జమ్మూకాశ్మీర్ లో భద్రత పెరిగిందని, పెట్టుబడులు పెరిగాయాని తెలిపారు.
ప్రత్యామ్నాయాలు కూడా లేవు..
పునీత్ నికోలస్ యాదవ్ ప్రకారం.. "BJP తమ అభిప్రాయాన్ని తప్ప మరే ఇతర అభిప్రాయాన్ని వినడానికి ఇష్టపడదు." జమ్మూకు చెందిన దినపత్రిక డైలీ తస్కీన్ ఎడిటర్-ఇన్-చీఫ్ సుహైల్ కజ్మీ, అసెంబ్లీలో చర్చకు బిజెపి ప్రతిఘటనను విమర్శించారు, ఈ వైఖరి ప్రజాస్వామ్య ప్రక్రియను బలహీనపరుస్తుందని అన్నారు. “అసెంబ్లీ చర్చలకు వేదిక. బిజెపి ఈ సంస్థను గౌరవించాలి. ఆరోగ్యకరమైన చర్చ ప్రాముఖ్యతను గుర్తించాలి ” అని కజ్మీ అన్నారు. జమ్మూ కాశ్మీర్ ప్రజల అవసరాలు, మనోభావాలను పరిష్కరించేందుకు మధ్యేమార్గం అవసరమని వారు అభిప్రాయపడ్డారు.
'సమతుల్య విధానం ఉత్తమ మార్గం'
నేషనల్ కాన్ఫరెన్స్‌లోని సీనియర్ నాయకుడు ఒమర్ అబ్దుల్లా కూడా బిజెపి ఆర్టికల్ 370ని పునరుద్ధరిస్తుందని ఆశించడం అవాస్తవమని బహిరంగంగా చెప్పారని, సమతుల్య విధానాన్ని కనుగొనడం ఉత్తమమైన మార్గమని సూచించారని పునీత్ నికోలస్ యాదవ్ పేర్కొన్నారు.
అయినప్పటికీ, బీజేపీ నేత జస్రోటియా అధికరణ 370 పునరుద్దరణ అసలు చర్చే లేదన్నారు . చర్చల కోసం అసెంబ్లీ చేసిన విన్నపాన్ని "అవకాశవాదం" అని కొట్టిపారేశారు. ఆర్టికల్ 370 దుర్వినియోగాన్ని ఎత్తి చూపారు. తన దృష్టిలో వాల్మీకి సమాజ్, పశ్చిమ పాకిస్తానీ శరణార్థులు వంటి వర్గాల దోపిడీకి దారితీసింది. ఆర్టికల్ 370పై సంభాషణ కోసం చేసిన పిలుపులను నేరం చేసిన తర్వాత సయోధ్య కోసం అడిగే దొంగతో పోల్చారు. జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక హోదాను పునఃపరిశీలించడం పాత గాయాలను మాత్రమే తెరుస్తుంది అనే BJP విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందన్నారు.
జమ్మూ కాశ్మీర్‌కు రాజ్యాంగ హోదాపై చర్చ తీవ్రరూపం దాల్చడం, ఆర్టికల్ 370పై అసెంబ్లీలో చర్చించడానికి బీజేపీ ఇష్టపడకపోవడం ఆ ప్రాంత రాజకీయ వాతావరణాన్ని మరింత జఠిలపరిచింది.